ఆది హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'చుట్టాలబ్బాయ్'. 'పూలరంగడు' ఫేం వీరభద్రమ్ చౌదరి డైరెక్షన్‌లో తెరకెక్కబోతోంది ఈ చిత్రం. నమితా ప్రమోద్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో సాయికుమార్ కీలకపాత్రలో నటిస్తుండడం ఇంకో విశేషమ్. తండ్రీ కొడుకులిద్దరూ కలిసి మాంఛి హిట్టు కొట్టేస్తామంటున్నారు. ఈ సినిమాలో సాయికుమార్, ఆదికి మధ్య జరిగే సన్నివేశాలను చాలా అద్భుతంగా తెరకెక్కించారట డైరెక్టర్. అంతేకాదు ఈ సినిమాలో ఆది న్యూలుక్‌లో మెచ్యూర్డ్ గెటప్‌లో కనిపించబోతున్నాడు.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదంతో పాటు లవ్‌లోని కొత్త యాంగిల్‌ని, అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌లో న్యూ యాంగిల్‌ని ఈ సినిమా ద్వారా చూపించనున్నారట వీరభద్రమ్ చౌదరి. ఈ సినిమా సక్సెస్‌పై ఆది కూడా భారీగా ఆశలు పెట్టుకున్నాడు. వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో సునీల్ సినిమా 'పూల రంగడు' మంచి సినిమాగా నిలిచింది. అయితే ఆ తరువాత వీరభద్రమ్ చౌదరి కాస్త నిరాశపర్చాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ఉన్నాడు వీరభద్రం చౌదరి. 'చుట్టాలబ్బాయ్' సినిమాకు తమన్ మ్యూజిక్‌ని అందించాడు. ఆది బేసిగ్గా మంచి డాన్సర్. తన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా తమన్ స్వరాలను సమకూర్చాడు. తమన్ బీట్స్‌కి తగ్గట్లుగా ఆది అదిరిపోయే స్టెప్పులేశాడు. ఈ సినిమాను ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆది హీరోగా 7 సినిమాలు వచ్చేశాయి. ఇది ఎనిమిదవ సినిమా. ఆ సెంటిమెంట్ కలిసొచ్చి, ఆదికి బిగ్ బ్రేక్ వస్తుందని సాయికుమార్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
|