Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
chuttaalabbaay feel tention

ఈ సంచికలో >> సినిమా >>

`హ్య‌పీ బ‌ర్త్‌డే` ఆడియోవిడుద‌ల

Happy birthday audio cd relesed

చెన్న‌మ‌నేని శ్రీద‌ర్‌, జ్యోతిసేథీ, సంజ‌న‌,శ్ర‌వ‌ణ్ కీల‌క పాత్ర‌ధారులుగా శ్రీ నంద‌న్‌మూవీస్ ప‌తాకంపై ప‌ల్లెల వీరారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ క‌ల్లే నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `హ్య‌పీ బ‌ర్త్‌డే`. జి.సంతోష్ రెడ్డి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోవిడుద‌ల కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. కార్య‌క్ర‌మంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌, బిగ్ సీడీని విడుద‌ల చేశారు. ఎమ్మెల్యే బాల‌రాజు ఆడియో సీడీల‌ను ఆవిష్క‌రించి తొలి సీడీని త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌కు అందించారు. ఈ సంద‌ర్భంగా...

బొంతు రామ్మోహ‌న్ మాట్లాడుతూ ``శ్రీధ‌ర్ ఒక మంచి న‌టుడు. గ‌తంలో ఎన్నో సినిమాల్లో న‌టించాడు. ఈ సినిమాతో హీరోగా ప‌రిచయం అవుతున్నాడు. త‌న‌కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను. సంతోష్‌రెడ్డి మంచి పాట‌ల‌ను అందించారు. సినిమాటోగ్ర‌ఫీ కూడా బావుంది. ఓ టీంగా చేసిన ప్ర‌య‌త్నం ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌హా అంద‌రికీ మంచి పేరు తీసుకురావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ఎమ్మెల్యే బాల‌రాజు మాట్లాడుతూ ``శ్రీధ‌ర్ మంచి హార్డ్‌వ‌ర్కర్‌. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కు అభినంద‌న‌లు. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్‌కు మంచి పేరు తెచ్చే చిత్రం కావాలి`` అన్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam