Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

రంజనము ( ఎర్రచందనం.& చందనం.) - హైమా శ్రీనివాస్

red sandle tree

"చంపకం ! ఏంచేస్తున్నావ్ ఇంకా ? తయారవలేదా! "అంటూ వచ్చింది శ్రీలక్ష్మి.

 " ఒకేఒక్క నిముషం. ఐపోయింది."

" అప్పన్న నిజదర్శనం  చూసే భాగ్యం పోగొట్టుకోకూడదు, రా!రా !ఆలస్యమైతే దూరంగా నిల్చోవాలి. కనబడదు, నా కసలే కళ్ళుమసక " అంటూ హడావిడి పెట్టింది శ్రీలక్ష్మి చంపకాన్ని. ఇద్దరూ ఇంటికి తాళం పెట్టుకుని బయల్దేరారు. వారు సిమ్హాచల ఆలయాన్ని చేరేసరికి  అపాటికే  ఆలయంలో చాలామంది భక్తులుపోగై  ఉన్నారు. మైక్ లో ప్రధాన అర్చకస్వామి వారి స్వరం వినిపిస్తోంది. ‘ ప్రహ్లాదుడి పిలుపువిని , శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామిగా సింహగిరిపై కొలువుదీరిన  సిరిగల దేవుడు అప్పన్న స్వామి. సంవత్సరమంతా చందనంలో ఉండి,  వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే భక్తులకు నిజరూప దర్శనం ప్రసాదిస్తున్నా డు. “అంటూ చెప్పుకుపోతున్నాడు. .  ఎన్నో కిలోలచందనం తీసి స్వామివారికి అద్దుతారు. అలా చందనం భగవంతుని అర్చన లో ప్రఖ్యాతిపొందింది.

గంధం చెట్టు, శ్రీగంధం, ఎర్రచందనము అన్నీ ఒకే కోవకు చెందినా ఎర్రచందనం అనేపేరు మాత్రం మన దేశంలో అందరికీ తెలిసి ఉంది.దీని సువాసన, కలప, మన దేశీయులే కాక విదేశీయులు సైతం  దీని పట్ల చూపే ప్రత్యేక ఆసక్తి వలన దీనికింత ప్రఖ్యాతి వచ్చింది.
పార్వతీమాత ఈ శ్రీగంధంతోనే గణపతి బొమ్మనుచేసి ప్రాణంపోసింది. భగవంతుని పూజకు గంధం తప్పనిసరి. గంధం సమర్ప యామి - అంటూ భగవంతుని ఆహ్వానిస్తాం.

శ్రీ గంధం లేదా చందనం ఒక విశిష్టమైన సుగంధాన్నిచ్చే చెట్టు. దీని శాస్త్రీయనామం శాంటాలమ్ ఆల్బమ్  ఇది శాంటాలేసి  కుంటుంబానికి చెందినది.  ఈ చెట్టు ఎండు ముక్కను బండమీద నీరు చల్లుతూ రంగరించి వచ్చే గంధాన్ని మన దేశంలో ప్రాచీనకాలం నుండి పూజా ద్రవ్యముగా వాడటం జరుగుతున్నది.

ఎర్ర చందనం అత్యంత విలువైన కలప. దీన్ని ఎర్ర బంగారం అని కూడా అంటారు.ఎర్ర చంద నాన్ని ఆంగ్లంలో ‘ రెడ్ శాండల్ ఉడ్’ అంటారు.  వాతావరణం రీత్యా ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే పెరుగు తుంది.  నల్లమల అడవుల్లో ఈ ఎర్ర చందనం చెట్లు పెరుగు తాయి. దీని కలపతో చేసే వాయిద్యాన్ని జపాన్ లో సంగీత సాధనం గా ఉప యోగి స్తారు .. ఆ సంగీత సాధనాన్ని ప్రతి ఒక్కరూ తమ  ఇంట్లో ఉంచుకోడం వాళ్ళ ఆచారం. చందనం కలప పొట్టుని కలర్ ఏజెంట్ గా వాడతారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కలప ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. దీని  విలువ చాలా  అధికంగా ఉండటం తో కొంతమంది దొంగతనంగా ఎగుమతి అంటే స్మగ్లింగ్  చేయడం జరుగుతున్నది.

దీన్ని తమిళంలో -చందనం అనీ .కన్నడంలో  -శ్రీగంధం అనీ అంటారు.   ఈ చందనానికి విదేశాల్లో అత్యధిక విలువ వుండటంతో ప్రాణాలకు తెగించి ఈ కలపను దొంగ రవాణా చేసి స్మగలర్లు ఇతర దేశాలకు పంపి  కోట్లాది రూపాయలు దొంగ  సంపాదన చేస్తున్నారు . ఇలా లక్షల కోట్ల విలువైన ఎర్ర చందనం విదేశాలకు పోతున్నది.

వెనుక జపాన్  ఎర్రచందనాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునేది. ఈ కలపతో వారు బొమ్మలు, ఇందాక చెప్పుకున్నట్లు  సంగీత పరికరాలు తయారు చేసుకునేవారు. ఇప్పుడు చైనాదేశం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నది. వీరు ఈ కలపను బొమ్మలు, సంగీత పరికరాలు, వాస్తు సంబంధపరికరాలు వంటి వాటికి ఉపయోగిస్తున్నారు. ఈ కలపతో చేసిన వస్తువు తమ ఇంటిలో వుంటే అంతా కలిసి వస్తుందని వీరి నమ్మకం. ఈకలప నుండి సుగంధ ద్రవ్యాలు, మందులు, నకిలీ రుద్రాక్షలు ఇలా ఇంకా అనేక రకాల ఉత్పత్తులు చేస్తున్నారు. 
కలపజాతి వృక్షాలు మనదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో లక్షలు సంపాదించి పెడుతున్నాయి. ఈ గంధం కలప బంగారంతో పోటీపెడితే ఈకలపకే మొదటిస్థానం తప్పదు - అనడం అతిశయోక్తి కాదు. టన్ను శ్రీ గంధం వెల షుమారుగా  కోటి రూపా యలు ఉంటంది. అలాగే టన్ను ఎర్రచందనం 10 లక్షలకు పైగా ఉంటుంది. దీంతో ఈ అటవీ వృక్షాలను వ్యవసాయ భూముల్లో పెంచేం దుకు రైతులు ముందు కొస్తున్నారు. జీవితాలను మార్చేసే ఈ వృక్షాల కలప పేదరైతులను పెద్ద ధనవంతులుగా మార్చ వచ్చు. భవిషత్తుకు బంగారుబాట వేసుకునేందుకు రైతులు వీటి సాగు పట్ల ఉత్సాహం చూపడం సహజం .  

చందనం వ్యాధి నిరోధక శక్తిని కలిగి, మేధస్సును పెంచే గుణం కలిగి ఉండటాన దీనికింత ప్రాధాన్యత వచ్చింది.చందనపు చెక్క నుండి తీసిన తైలం మంచి సువాసన కలిగి యుండి పరిమళ ద్రవ్యాల తయారీలో బాగా వాడుతారు. ఇది మెదడు, హృదయానికి సంబంధించిన అనారోగ్యాలకు, కడుపులో మంట, జ్వరము, తలనొప్పి, జలుబు, శ్వాసకోశ, మూత్రకోశ, అతిసార వ్యాధులకు, మశూచి, స్ఫోటకం ,ఇంకా ఇతర చర్మవ్యాధులకు సంబంధించిన మందుల తయారీలో వాడుతు న్నారు. వేరు నుండి లభించే తైలాన్ని అత్తరు, అగరుబత్తి, సబ్బులలో ఉపయోగిస్తారు. వీటినే మైసూర్ శాండల్ సోప్ అంటారు. 

ఇసుకతో కూడిన ఎర్రమట్టి నేలలు చందనము సాగుకు అనుకూలమైనవి. ఇది ఉష్ణమండల పంట. దీనికి తేమగల పొడి నేలలు అవసరము. శ్రీగంధం చెట్టు ఒక పరాన్న జీవన వృక్షం. ఇది భూమి నుండి నేరుగా నీటిని, పోషకాలను గ్రహించ లేదు. వేరేమొక్క ల వేర్లతో సంబంధాన్ని ఏర్పరచుకొని నీటిని, పోషకాలను గ్రహిస్తుంది. అందువలన శ్రీగంధం మొక్కలతో పాటు ఉసిరి,సరుగుడు, కానుగ, మిరప, కరివేప  మొదలైన మొక్కలను  పెంచాల్సి ఉంది.  

ప్రకృతిమాత, భూమాత మానవులకు ఎన్నెన్ని చిత్రవిచిత్ర వృక్షాలను తనద్వారా పెంచి మానవాళికి ఎంత సేవచేస్తున్నదో మనం ఊహించలేము. ఒకేనేలమీద అనేక రకాల మహా విలువైన  చెట్లను పెరగను సహకరిస్తూ భూమాత మనకు చేసే సేవవిలువకట్తలేనిది .  
శ్రీగంధాన్ని - సిరి గందం చెట్టు అని కూడా అంటారు. బాగా ముదిరిన ఈ చెట్టు కర్ర మంచి సువాసన వస్తుంది. తిరుమల లోని శ్రీ వేంకటేస్వరాలయంలో ఈ విధంగా గందం తీయడానికి ఒక గది ఉంది. దీన్ని గందపు గది అంతారు.  తిరుమల కొండ పైన ఈ చెట్లు విస్తారంగా కనిపిస్తాయి. ఇక్కడ గందపు చెక్కలను కూడా బజారులో అమ్ముతుంటారు. ఇవి చాల విలువైనవి. అందు చేతే ఇందాకచెప్పుకున్నట్లు వీటిని స్మగ్లర్లు దొంగ రవాణా చేస్తున్నారు.  రాయలసీమ ప్రాంతంలో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. చందనం వాడకంతో అందం పెరుగుతుందని నమ్మకం. ఇది రాజులూ, మహారాజుల కాలంలోనేదీనివాడకం  ప్రాచుర్యంలో వుంది.  నేటికీ, సౌందర్యసాధనాల్లో చందనానికి గల ప్రాధాన్యం అసామాన్యం.చందనం తాలూకు గుణాలు చాలాగొప్పవి. 

రూపసౌందర్యాలకూ, చందనానికీ అవినాభావసంబంధం పురాతన కాలం నుంచీ వుంది. పూర్వం నుంచీ భారతీయులు చాలా మంది చందనపు బొట్టు పెట్టుకోవటం  ఆచారంగా ఉంది.శరీరానికి చందనం పూసుకోడం వల్ల చర్మం కోమలంగా ఉంటుంది. అలాగే చందనం నుంచి వెలువడే సుగంధాలు మన ఆరోగ్యాని కి ఉపకరిస్తుంది.

కొన్ని రకాల పెర్ఫ్యూంస్ లోనూ చందనం వుంటుంది. ఆధ్యాత్మిక మానసిక ఆరోగాల కోసం కూడా చందనం వాడుతారు. వేదాల్లో దేవరాజైన ఇంద్రుని నందనోద్యానంలో చందనవృక్షం  వుండేదిట. దాని సువాసనలతో దేవలోకం మొత్తం గుబాళించేదిట. అక్కడి దేవతలుపాటు అప్సరల అందానికి ముఖ్యకారణం చందనం వాడటమేమేట!ఆ తర్వాత  చందనవృక్షం భూలోకాకి వచ్చిందిట. చర్మసౌందర్యం కోసం మహిళలు చందనాన్ని వాడటం మొదలెట్టారుట.!. చర్మం కోల్పోయిన తేమను తిరిగి తీసుకు రాగలిగిన శక్తి చందనానికి ఉంది.  చర్మంలోని అదనపు జిడ్డును కూడా చందనం తొలగిస్తుంది. అందుకనే సంపూర్ణమైన స్కిన్ కేర్ ప్రాడాక్ట్ గా చందనాన్ని నేడు భావిస్తున్నారు. చందనాన్ని ముల్తానీ మట్టి, పన్నీరు కలిపి, పేస్టుగా చేసి, ముఖం, మెడ మీద రాసుకుంటే ఈ లేపనం చర్మాన్ని నునుపుగా చేస్తుంది.  స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల చందన తైలాన్ని వేసుక్లుని స్నానంచేస్తే చర్మాని కి కమ్మని వాసన అబ్బుతుంది. శరీరమంతటా చందనం పూసుకుని, ఆ తరువాత చందనతైలం వేసుకున్న నీటితో స్నానం చేస్తే చాలా హాయిగా వుంటుంది.  

చందనతైలాన్ని ప్రతిరోజూ కొన్ని చుక్కలు వాడుకోవటం వల్ల, చర్మానికి పట్తే చెమట వల్లవచ్చే దుర్గంధం పోతుంది.  చందన వృక్షం  ఆకులు, వేళ్లు, చెక్క అన్నిటిలోనూ చందనానికి వుండే సుగుణాలు ఉన్నాయి.

చందనంతో రోజూ బొట్టు పెట్టుకుంటే, మనస్సు, మస్తిష్కమూ ప్రశాంతంగా వుంటాయి. ఆధ్యాత్మిక దృష్టితో చూసినా చందనానికి ప్రముఖస్థానమే వుంది. పూజలూ, ధ్యానాల్లో చందననానికి పెద్దపీటే!. చందనం అంటేనే చల్లదనం. కళ్లకు చల్లగా వుండను చంద నం తో కాటుక తయారు చేసి పెట్టుకుంతారు.  ఎండాకాలంలో చందనం రాచుకుంటే చర్మ చల్ల బడుతుంది. ముఖ్యంగా పసి పిల్ల లకూ, ముసలివారికీ చందనం వంటినిండా అద్దుతారు. చందనం వేసవిలో అతినీలలోహిత కిరణాల ప్రభావం నుంచి చర్మాన్ని రక్షి స్తుంది. మొటిమలు, దద్దుర్లను కూడా తగ్గిస్తుంది. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టనివారు స్నానం చేసే నీటిలో 2- 3 చుక్కల గంధపు నూనెను వేసుకుంటే ఎంతో హాయిగా అనిపించి చక్కని నిద్రపట్టే అవకాశం ఉంది.

చందనం కలిపిన  సున్నిపిండి ని వాడితే చర్మం మృధుత్వం సొంతమవుతుంది. ఐతే దీన్ని మనం మనకోసం ప్రత్యేకంగా తయా రు చేసుకోవాలి. పెసలు, సెనగలు, బియ్యం పావుకేజీ చొప్పున, యాభై గ్రాముల పసుపు కొమ్ములు, వంద గ్రాములు ఎండ బెట్టి న కమలాఫలం చెక్కులు తీసుకుని అన్నింటినీ మెత్తగాపిండి చేసుకోవాలి. ఆరు చెంచాల సున్నిపిండికి చెంచా మంచి గంధం పొడి కలిపి,వాడుకునేప్పుడు సగం నిమ్మచెక్క రసం కూడా కలిపి శరీరానికి రుద్దుకోవాలి. చర్మం తాజాగా,మృదువుగానూ ఉంటుంది. చర్మం నల్లబడటం, ఎర్రగా కందిపోడం మంటపుట్తడం జరిగితే  ఈ చందనంసున్నిపిండి ని వాడితే తప్పక ఫలితం ఉంటుంది.
ఎర్రచందనం చెట్టు 60 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కలపను ఆహార,వస్త్ర పరిశ్రమల్లో సహజ రంగుగానూ, అనేక మందులు తయారుచేయనూ ఎక్కువగా వాడుతుంటారు.  కలపలో ఎర్రచందనం తర్వాతే ఏదైనా.పూర్వం టేకును ఎక్కువగా వాడేవారు. చందనం తర్వాతే టేకూనూ. గతంలో వీటిని తమ భూముల్లో పెంచుకోను ప్రభుత్వం అనుమతించేది కాదు. నేడు అనేక కారణాలవలన  కేంద్ర ప్రభుత్వ అనుమతితో  రైతులు చందనం సాగుకు పూనుకుంటున్నారు. ఒక్క ఎర్రచందనం చెట్టు నుంచి 20సం.ల కాలంలో అరటన్ను నుంచి టన్ను వరకు కలప దిగుబడినిస్తుంది. 500కిలోల చేవగల కలప లభిస్తుంది. ఎర్ర చందనం చాలా మొండి మొక్క కావటాన ప్రత్యేకమైన పెట్టుబడి అవసరం లేదు.  

గర్దభచందనన్యాయము- అనే మాట మన తెలుగులో వింటాం -అంటే గాడిద గందపుపొడి ఎంతకాలం మోసినా దానికి గంధం సువాసన తెలియదు.--అని . అంతే విఙ్ఞులచెంత ఉన్న అవివేకి వారి పాండిత్యాన్ని గ్రహించలేడనే అర్ధంలో చెప్పి ఉండవచ్చు.  జయదేవుని అష్టపదుల్లో 3వది ఇలా - చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలీ!--అంటూ సాగుతుంది. భూమాత మానవులకు కేవలం గాలిపీల్చుకోను ప్రాణవాయువునూ, భుజించను అనేకరకాల పండ్లనూ, ధాన్యాలనూ, పప్పు దినుసులనూ అందించడమేకాక, గృహనిర్మాణానికి కలపనూ,ఇంట్లో వాడుకునే అనేక వస్తువులనూ తయారుచేసుకోను వివి ధరకాలచెట్లకలపనూ , సౌందర్యసాధనాలకోసం చందన వృక్షాలనూ  ,సుగంధ ద్రవ్యాలనూ  ఇంకాఎన్నోరకాల చెట్లను తాను పెంచి సేవచేస్తున్న భూమాత ఋణం తీర్చుకోను మనకుసాధ్యమా! కృతఙ్ఞతలు తెలుపుకోడం తప్ప.అందుకే భూమాత పంచ మాతలలో ఒకటైంది.   

 

మరిన్ని శీర్షికలు
sirasri question