Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Navvula Jallu by Jayadev Babu

ఈ సంచికలో >> శీర్షికలు >>

పులస చేప పులుసు - పి. శ్రీనివాసు

pulasa chepa pulusu

అతి ఖరీదైన, అరుదైన చేప 'పులస' చేప. పుస్తెలు తాకట్టు పెట్టైనా పులస చేపలు తినాలి అని అంటారు. ఈ పులుసు ఉదయం వండుకొని రాత్రి తింటే ఇంకా బాగుంటుందంటారు. ఈ చేప ఆగస్ట్, సెప్టెంబర్ ల లోనే దొరుకుతుంది. దీని ఖరీదు కిలో చేపకి మూడు వేల నుండి నాలుగు వేల వరకు వుంటుంది. దీనికెందుకింత రేటు అనే ప్రశ్నకి సమాధానం 'ఒకసారి తింటే మీరే చెప్తారు' అని అంటారు. అంత ప్రాచుర్యం పొందిన ఈ వంటకం ఎలా చేయాలో చూద్దాం


కావలసిన పదార్థాలు:
పులస చేపలు, చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కారం, తగినంత ఉప్పు.

తయారు చేయు విధానం:
ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కలిపి ముద్దగా చేసుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టుకుని అందులో నూనె వేడి చేసుకొని అందులో ఉల్లి, పచ్చిమిర్చి కలిపిన ముద్దని వేసుకోవాలి. కొద్దిగా వేగాక అందులో వెల్లుల్లి, జీలకర్ర, కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. నూనె బయటకు వచ్చే వరకు వుంచుకొని అందులో చేప ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు తగినంత వేసుకోవాలి. కొద్ది సేపు మగ్గనిచ్చి చింత పండు పులుసు వేయాలి. మూత పెట్టి సన్నని మంటపై ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత కొత్తిమీర వేసుకొంటే ఘుమఘుమలాడే పులస చేప పులుసు రెడీ!!

 

 

మరిన్ని శీర్షికలు