కావలిసిన పదార్ధాలు : కొర్రమీను చేపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు
తయారుచేసే విధానం: ముందుగా ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలు, పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేసుకోవాలి. తరువాత బాణలిలో నూనె వేసి అది కాగాక గ్రైండ్ చేసిన ఉల్లిపాయల మిశ్రమాన్ని వేసి బాగా వేగనివ్వాలి. తరువాత కారం, పసుపు, ఉప్పు , కొర్రమీను చేప ముక్కలను వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోయాలి. 15 నిముషాలు మూతపెట్టి ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర వేయాలి. అంతే రుచికరమైన కొర్రమీను చేపల ఇగురు రెడీ...
|