Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 31st  march to 6th april

ఈ సంచికలో >> శీర్షికలు >>

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గురించీ వివిధ పవిత్రగ్రంధాల్లోని అంశాలు.. - ఆదూరి హైమావతి

sri satya sai baba information

అరవింద మహర్శి మహా యోగి. ఆయన పుదుచ్చేరిలోని తన ఆశ్రమంలో 1923 నుంది 1926 వరకు తీవ్ర తపస్సాధనలో ఉండేవారు. ఆయన  1926వ సంవత్సరము నవంబరు 24వ తేదీన ఆయన తపస్సమాధి లోనుండి బయటకి వచ్చి "నిన్నటి రోజున భగవంతుడు భూమి మీద అవతరించాడు! ఆయన తన అనంత దివ్య శక్తితో మానవులను ఉధ్ధరించ బోతు న్నాడు.మానవోద్దారణ కోసం భగవంతుడు మానవలోకంలో అవతరించాడు " అని ప్రకటించారు.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు అనేకమంది భక్తులకు వారి ఇంటిదైవంగా దర్శనం ప్రసాదించి వారిని తన్మయులను చేశారు.

ఒకమారు అరుణాచలం నుంచి రమణమహర్షి శిష్యుడు స్వామి అమృతానంద భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారిని దర్శించుకోను పుట్టపర్తికి వచ్చారు. స్వామి అమృతానంద దగ్గరకి వచ్చి ప్రేమగా 'అమృతం' అని పిలిచారు. ఆ పిలుపు విని స్వామి అమృతానంద పరమానందం పొందారు. కారణం రమణమహర్శి తనను ఆప్యాయతతో,అనురాగంతో సంబోధించినట్లే బాబా వారు పిల్చి ఆయనగురువూ ,తానూ ఒకరే అని తెలిపారు.అది ఆయనకు చాలా వింతగా అని పించింది. 85 సంవత్సరాల అమృతానందతో స్వామి మాట్లాడుతూ "నీవు 7వ యేట 41 రోజులు గణపతి హోమం చేశావు గదా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లీ గ్లాం అనే బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని రోజుకు వెయ్యి సార్లు జపిస్తూ అగ్నికార్యం చేశావు. ఆ యాగం చేసినవారికి  మహా గణపతి ఆ హోమగుండం నుండి బంగారు రంగుతో కూడిన దేహంతో ,గజవదనంతో ,దివ్య దర్శనం ప్రసాదిస్తారు. మరినీకు అలాటి దర్శనం కలిగినదా?" అని అడిగారు.

అప్పుడు అమృతానంద "స్వామి! నేను అప్పుడు యేడు సంవత్సరముల బాలుణ్ణి కదా. అప్పుడు నాకేమీ తెలియదు.  మహగణపతి దర్శనం అలా చేస్తే సాధ్యమవుతుందా?" అన్నా రు. ఆ మాట విని భగవాన్ శ్రీ సత్య సాయిబాబావారు " ఆ జప హోమాదులు చేసిన  ప్రభావం చేతనే నీ వీవయస్సులో ఇక్కడికి రాగలిగావు. ఆ హోమఫలం ఎన్నటికీ వృధాకాదు. నీకిప్పు డు లభింపబోతున్నది. శాస్త్ర ప్రమాణాలు ఎప్పుడు వ్యర్ధంకావు" అంటూ అమృతానందను తనవైపు చూడమన్నారు. అప్పుడు సత్యసాయి  స్థానంలో సువర్ణ కాంతులతో మిరుమిట్లు గొలిపే శ్రీ మహాగణపతిని అమృతానంద దర్శించి దివ్యానుభూతిని పొందారు.

ఇలాంటి అనుభవాలు పొందిన భక్తులు కోకొల్లలు.

మైసూర్ లో నివసించే భట్ కుటుంబానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇష్టదైవం. 1943లో భట్ భార్యకు కేన్సర్ వచ్చింది. వైద్యులందరూ ఆమెకు ఆపరేషన్ చేయాలన్నారు. భట్ గారి తల్లి అందుకు అంగీకరించక "సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన ఆరాధ్య దైవం కాబట్టి ఆయనే నయం చేస్తాడు" అన్నది . అచంచల విశ్వాసంతో ఆరు మాసాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చనలు చేశారువారు. భట్ భార్య క్రమంగా నీరసించి పోసాగింది. ఒక రాత్రి భట్ భార్యకు స్వప్నంలో పెద్ద సర్పం తన మంచం చుట్టూ తిరుగుతున్నట్లు అనిపించింది. ఆమె భయపడి పెద్దగా అరిచి తన అత్తగారిని నిద్ర లేపింది. దీపం వేసి చూస్తే ఏమీ కనిపించలేదు. మరల కొంతసేపటికి స్వప్నం లో ఆ మహా సర్పం కనిపించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో సాక్షాత్కరించి ఆమె చాతి మీద త్రిశూలంతో గుచ్చి ఆమెను యెక్కడికో తీసుకువెళ్తున్నట్లు ఆమెకు స్పష్టంగా అని పించింది. ఆమెను సుబ్రహ్మణ్యేశ్వర  స్వామి ఒక పర్వత శిఖరాగ్రానికి తీసుకుని వెళ్ళగా అక్కడ ఆమె స్వామి పాదాలపై పడుతుంది. అప్పుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి "ఆమెతో ఇక్కడ ఉంటావా? తిరిగి వెళ్తావా? అని అడగ్గా , ఆమె తన భర్తను,పిల్లలను తలుచుకుని "ఇంటికి వెళ్తాను స్వామీ!" అనగా  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి "నీ వ్యాధి పూర్తిగా నయమైంది వెళ్ళు. ఎప్పుడూ నిన్ను కాపాడుతూనే ఉంటాను, మీభక్తీ, మీప్రార్ధనలూ నీకు తిరిగి ఆరోగ్యా న్ని ప్రసాదించాయి."  అని ఆమెను సన్నని మెట్ల నుండి ఈ లోకానికి పంపినట్లు ఆమెకు అనుభవం కలిగింది. ఆనాటినుంచి ఆమె ఆరోగ్యం బాగుపడ సాగింది. ఆమె పూజలుతో పాటు చేతనైన  దీనజన  సేవ చేస్తూ ఉండేది.

మరిన్ని శీర్షికలు
sriramanavami special artical