Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
mega with victory

ఈ సంచికలో >> సినిమా >>

ప్రబాస్‌ డబుల్‌ ధమాకా!

prabhas double dhamaka

ఇంతవరకూ 'బాహుబలి' సినిమాతో టాలీవుడ్‌ కండల వీరుడిగా ఆకట్టుకున్నాడు ప్రబాస్‌. ప్రబాస్‌ ప్రధాన పాత్రలో వస్తోన్న 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' ఏప్రిల్‌ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోగా ప్రబాస్‌ తన కొత్త సినిమా కోసం మేకోవర్‌ అయిపోయాడు. లవర్‌ బోయ్‌లా మారిపోయాడు. న్యూ గెటప్‌లో అందర్నీ అలరించడానికి సిద్ధమయిపోయాడు. యంగ్‌ డైరెక్టర్‌ సుజిత్‌ దర్శకత్వంలో ప్రబాస్‌ ఓ సినిమాకి కమిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్‌లో ప్రబాస్‌ సందడి చేస్తున్నారు.

ఈ సినిమాలో ప్రబాస్‌కి జోడీగా రష్మిక మండన్నా అనే కొత్తమ్మాయి నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. మరో పక్క ఈ సినిమాని తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఇప్పుడు ప్రబాస్‌కి తెలుగుతో పాటు పలు భాషల్లో మాంచి మార్కెట్‌ ఉంది. ఈ మార్కెట్‌ని ఇకపై విస్తరించుకోవాలనుకుంటున్నాడట ప్రబాస్‌. అందులో భాగంగా ఈ సినిమాని ఇతర భాషల్లో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనీ సమాచారమ్‌. అంతేకాదు 'బాహుబలి' సినిమాతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కినప్పటికీ, ప్రబాస్‌ నుండి మరో సినిమా రాలేదు గత నాలుగైదేళ్లుగా. అందుకే ఆ లోటును తీర్చేందుకు కంకణం కట్టుకున్నాడట ప్రబాస్‌. వరుస పెట్టి సినిమాలు చేయాలనుకుంటున్నాడట. ప్రస్తుతం చేయబోతున్న సినిమాకి 'సాహో' అనే టైటిల్‌ని పెట్టారు. అంతేకాదు ప్రబాస్‌ స్టార్‌డమ్‌కి తగ్గట్లుగానే ఈ సినిమా కథ ఉండబోతోందట. త్వరలోనే 'సాహో' సినిమాతో లవర్‌ బోయ్‌లా ప్రబాస్‌ మన మనసు దోచుకునేందుకు వచ్చేస్తున్నాడహో! 

మరిన్ని సినిమా కబుర్లు
pava VS trivikram and two heroines