కావలిసిన పదార్ధాలు: బేబీకార్న్ (సన్నగా తరిగినవి), క్యాప్సికం, ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, నిమ్మకాయ, కరివేపాకు , మిరియాలపొడి, అజినామోటో
తయారుచేసే విధానం: పెద్ద బాణలిలో నూనె వేసి కాగాక సన్నగా తరిగిన ఈ ముక్కలన్నీ వేయాలి. వీటి పచ్చివాసన పోయేవరకూ బాగా వేగనివ్వాలి. తరువాత ఉప్పు, మిరియాలపొడి, అజినామోటో వేసుకుని కలపాలి. తరువాత వండిన అన్నాన్ని వేసుకుని బాగా కలపాలి. చివరగా ఒక నిమ్మకాయ రసాన్ని పిండాలి. అంతేనండీ.. బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ..
|