అధ్యాత్మ మర్మాలు అలవోకగా తెల్ప,
విభుధ వర్గము వారు వింతజూసె,
హస్త చాలన చేత వస్తువులు సృష్టింప,
భౌతిక సూత్రాలు భగ్నమయ్యె,
కోట్లాది రూప్యముల్ కొల్లలుగా కురవ
ప్రభుత్వాలకు అంతు పట్టకుండె,
వింత రోగాలన్ని వీభూతితో పోవ,
ప్రముఖ వైద్యులు ప్రణ మిల్లు చుండె
ఏది చేసిన అది ఆయె అద్భుతమ్ము,
ఏది పల్కిన అది నిత్య సత్య మగును,
ఏది చెప్పిన అది ధర్మ సమ్మతమ్మె
స్వామి ప్రఙ్ఞను వివరింప సాధ్య మగున?
భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ...
దివ్యాత్మ స్వరూపు లందరికీ నమస్కారాలు.
"బహుముఖ ప్రఙ్ఞాశాలి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా -అనేశ్రీర్షిక గురించీ మనం మాట్లాడుకుందాం. ప్రఙ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మీ తత్వమసి , అయమాత్మాబ్రహ్మా --అనే ఈ నాల్గింటినీ మహావాక్యాలు అని అంటారు. అనగా అతిప్రామాణికమైన వాక్యాలన్నమాట. ఇవన్నీకూడా వేద వాక్యాలు. మనభగవాన్ సాయిబ్రహ్మ కూడా " ప్రఙ్ఞానం బ్రహ్మ " అన్నమాట! స్వామి మాటలలో " ప్రఙ్ఞానం " అనగా సామాన్య మైన ఙ్ఞానం కాదు. అది ఎప్పుడూ మార్పు చెంద నిది.అనగా -constent Integrated Awarness ".అని అన్నారు. సామాన్య ఙ్ఞానంలో కానీ వేద వాజ్మయ ఙ్ఞానంలో కానీ స్వామి వారు బహుముఖ ప్రఙ్ఞాశాలి. ఇపుడు సామాన్య ఙ్ఞానమైన అనేక విఙ్ఞానశాస్త్రాలలో కూడా అత్యంత ప్రఙ్ఞను కనపరుస్తూ ఉంటారు మన బాబా.
ఉదాహరణకు- ఒకానొక సమయంలో ఒక బోటనీ లెక్చరర్ తో మాట్లాడుతూ స్వామి వారు ' బోటనీ అంటే ఏమిటీ?" అన్నారు. "వృక్షశాస్త్రము స్వామీ " అన్నారాయన. స్వామి వెంటనే "what is the aim of the plant "అని అడిగారు స్వామి. దాని కత డు ఏమీ పలుకలేదు.అప్పుడు బాబావారు "Fruit is the aim of the plant "అని అన్నారు. ఆతర్వాత "what is the base of the plany " అని అడిగారు స్వామి. స్వామివారే "root is the base of the Plany " అన్నారు. "రూట్ బలంగా ,దృఢం గా ఉంటే కాండము [స్టెం] కూడా బలంగా ఉంటుంది,ఆ stem నే 'సెల్ఫ్ కంటెంట్ మెంట్ అంటా రు. కనుక సెల్ఫ్ కాన్ ఫిడెన్స్ అనే రూట్ మీద సెల్ఫ్ కంటెంట్ మెంట్ అనగా ఆత్మతృప్తి ఆధారపడి ఉంటుంది.ఈ ఆత్మ తృప్తి ఆత్మ త్యాగా నికి దారి తీస్తుంది.ఆత్మత్యాగ మంటే self Sacrifice. ఆత్మత్యాగము, ఆత్మాసాక్షత్కారానికి అనగా సెల్ఫ్ రియలైజేషన్ కు దారి తీస్తుంది .కనుక సెల్ఫ్ కాన్ ఫిడెన్స్ , సెల్ఫ్ కంటెంట్ మెంట్ ,self Sacrifice,సెల్ఫ్ రియలై జేషన్ . మొట్ట మొద ట కావలసింది సెల్ఫ్ కాన్ ఫిడెన్స్ . ఐతే సెల్ఫ్ కాన్ ఫిడెన్స్ అనగా ఏమి? కాన్ ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్ .అంటే దేవుడు. God. అందుకని భగవత్ విశ్వాసమ0 ప్రతి వ్యక్తికీ అవసరం. ఆత్మవిశ్వాసము ఉంచుకోవాలి, పెంచుకోవాలికూడా. చూశారా! ఇది స్వామివారి ప్రఙ్ఞ. అతి క్లిష్టమైన విషయాలను అందరికీ తెలికగా అర్ధమయ్యే రీతిలో చెప్పటమే స్వామివారి ప్రఙ్ఞ అన్న మాట. దాన్ని మనం ఊహించలేము.
ఒక విద్యార్ధితో స్వామి మాట్లాడుతూ "ఒక అరగంట ధ్యానం చేస్తే 24గం.శాంతిగా ఉంటుంది రా! " అన్నారు. అప్పుడు ఆ విద్యార్ధి వెంటనే "స్వామీ!అరగంట ధ్యానానికి 24.గం.మనశ్శాంతి ఎలా ఉంటుంది?" అని అడిగాడు.స్వామి తడబడ కుండా" ఒక నిముషం నీ రిస్ట్ వాచ్ కీ తిప్పితే నీగడియారం 24గం.ఆడుతుందికదా! "అని ఠక్కున సమాధానంచెప్పారు.
|