Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

28-04-2017 నుండి 04-05-2017 వరకు వారఫలాలు - - శ్రీకాంత్

మేష రాశి :ఈవారం బంధువులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. మీ మాటతీరును కొన్ని విషయాల్లో సరిచూసుకొనే ప్రయత్నం చేయుట మంచిది. వారం మద్యలో ఒకింత ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోండి. సంతానం వలన పెద్దలకు సమాధానం చెప్పవలసి వస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో తొందరపాటు వద్దు. సాధ్యమైనంత వరకు అనవసరమైన ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట అన్నివిధాలా మేలు. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా పడుతుంది.

 

 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద నలుగురిలో గుర్తింపును పొందుటకు మీరు చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయి. తలపెట్టిన పనులలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పక పోవచ్చును. కుటుంభంలో తీసుకొనే నిర్ణయాల విషయంలో తొందరపాటు ఆలోచనలు చేయకండి నిదానంగా వ్యవహరించుట సూచన. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు కలుగుతాయి అందరిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయవలసి రావోచ్చును వాటిలో ఖర్చులు కలుగుతాయి. మిత్రులతో కలిసి చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలిపోయే ప్రమాదం కలదు జాగ్రత్త. దూరప్రదేశం నుండి వచ్చు వార్తలు సంతోషాన్ని కలుగజేస్తాయి. కొన్ని కొన్ని విషయాల్లో మొండినిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు.

 



మిథున రాశి : ఈవారం మొత్తంమీద బాగానే ఉంటుంది చిన్న చిన్న సర్దుబాటు తప్పక పోవచ్చును. పెద్దలతో మీకుగల పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. నూతన పనులను చేపట్టి అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. ఉద్యోగంలో అధికారుల నుండి గుర్తింపును పొందుతారు అలాగే పనుల మూలాన ఒత్తిడి తప్పకపోవచ్చును. ప్రయాణాలు చేయునపుడు స్వల్ప జాగ్రత్తలు తప్పనిసరి. విదీశీప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది ప్రయత్నం చేయుట మంచిది. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్దపనికిరాదు తగిన జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయాల్లో ఉన్నవారికి పదవులు లభించే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నిదానం అవసరం పెద్దల అనుభవాలు పరిగణలోకి తీసుకోండి. 


కర్కాటక రాశి : మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ప్రతిపనిలో బాగాఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగినను జాగ్రత్తగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది అలాగే అందరిని కలుపుకొని వెళ్ళడం అనేది సూచన. తలపెట్టిన పనులను వారంచివరలో విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో వేచిచూసే దోరణిమేలుచేస్తుంది. శుభకార్యములలో పాల్గొనే అవకాశం ఉంది వాటికి సమయాన్ని ఇస్తారు. కుటుంభంలో సభ్యుల సహకారం వలన ఉత్సాహం పొందుతారు అలాగే కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. పెద్దలనుండి కొంత వ్యతిరేకతను పొందుటకు అవకాశం ఉంది నిదానంగా వ్యవహరించుట సూచన.  

 



 సింహ రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభం బాగున్న మధ్యలో ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. మానసికంగా దృడంగా లేకపోతే లేనిపోని ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. అధికారులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది వారికి అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. మిత్రులవలన కొత్త కొత్త సమస్యలు వచ్చుటకు అవకాశం కలదు జాగ్రత్త. నూతన ప్రయత్నాలను ఆరంభించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు పెద్దల సూచనలతో ముందుకు వెళ్ళుట మంచిది. ప్రయాణాల మూలాన ఊహించని ఖర్చులు కలుగుటకు అవకాశం కలదు. 

 

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. వచ్చిన అవకశాలను సద్వినియోగం చేసుకొనే విధంగా ముందుకువెళ్ళుట మంచిది. కుటుంభంలో సభ్యులనుండి సహకారం ఆశిస్తారు వారితో కలిసి చర్చలలో పాల్గోనేముందు మీయొక్క లక్ష్యాలను తరచిచూసుకోవడం మంచిది. నూతన ప్రయత్నాల విషయంలో తొందరపాటు వద్దు నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. శుభకార్యముల విషయంలో అనుకున్న దానికన్నా అధికంగా ఖర్చులు అవడం వలన కొంత ఇబ్బందికి లోనయ్యే అవకాశం కలదు. మిత్రులనుండి ఊహించని విధంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు కావున ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన.    

 

 

 



తులా రాశి : ఈవారం మొత్తంమీద పెద్దల సలహాలు పాటించుట వలన మేలుజరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బద్ధకం వలన నష్టపోతారు మాటలు జాగ్రత్తగా వాడుట అనేది సూచన. వారం మధ్యలో ప్రణాళికాతో వ్యవహరించినచో పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. పనులమూలన శ్రమను అలాగే పనిభారంను పొందుటకు అవాకాశం కలదు. దూరప్రదేశాల నుండి వార్తలు తెలుసుకొనే అవకాశం ఉంది కుటుంభంలో స్వల్ప మార్పులకు అవకాశం కలదు. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన గుర్తింపును పొందుతారు. ఆర్థికపరమైన విషయల్లో నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి మంచిది లేకపోతే ఇబ్బందులు తప్పవు. 

 


వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం ఉంది జాగ్రత్త. అనారోగ్య సమస్యలు తప్పక పోవచ్చును ఈ విషయంలో చాలావరకు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంభంలో స్వల్ప మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది సర్దుబాటు విధానం మేలుచేస్తుంది. ఆర్థికపరమైన విషయల్లో కొంత ఖర్చులు చేయుదాటిపోయే ప్రమాదం కలదు కావున నిదానంగా వ్యవహరించుట సూచన. వారం చివరలో తలపెట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు రావడం అనేది ఊరట కలిగించే అంశం. బంధువుల నుండి సమాచరం సేకరిస్తారు నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు. వాహనముల విషయంలో అలాగే ప్రమాదకరమైన వస్తువులతో పనిచేసేటప్పుడు జాగ్రత్త అవసరం. కుటుంభంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు.       

 

 


ధనస్సు రాశి : ఈవారం మొత్తంమీద ప్రతిపనివిషయంలో నిదానంగా వ్యవహరించుట సూచన. తలపెట్టిన పనులను నిదానంగా పూర్తిచేసే అవకాశం కలదు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది కాకపోతే నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. బంధువుల నుండి వచ్చు సూచనల విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోండి. సోదరులు మీ విషయంలో అసంతృప్తిని పొందుటకు అవకాశం ఉంది వారితో చేసిన చర్చలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చును. ఆర్థికపరమైన విషయాలలో బాగానే ఉంటుంది. వ్యాపారపరమైన విషయల్లో ఇబ్బందులు కలుగుటకు అవకాశం కలదు జాగ్రత్త. ఆరోగ్యం బాగానే ఉంటుంది కాకపోతే అశ్రద్దచేయకండి.  

 

 

మకర రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభం బాగుంటుంది నూతన ప్రయత్నాలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు కాకపోతే స్వల్ప ఇబ్బందులు తప్పక పోవచ్చును. నూతన పరిచయాలు కలుగుతాయి లేదా మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో మీకుగల సంభందాలు గట్టిపడే అవకాశం కలదు ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు లాభించకపోవచ్చును కావున వాటిని వాయిదా వేయుట అనేది సూచన. తండ్రితరుపు వారితో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు వారికి సమయం ఇస్తారు. ఆరోగ్యం మాత్రం కొంత ఇబ్బందులకు గురిచేస్తుంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.          

 

   

కుంభ రాశి :ఈవారం మొత్తంమీద ఆరంభం కొంత ఇబ్బందికి గురిచేస్తుంది కాకపోతే రానురాను ఆటంకాలు తొలగిపోవుటకు అవకాశం ఉంది. మాటతీరు చాలావరకు ప్రభావితం చేసే అవకాశం కలదు జాగ్రత్త. నూతన ప్రయత్నాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు నిదానంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయకపోవడం అనేది సూచన. ఆర్థికపరమైన విషయలలో ఆచితూచి వ్యవహరించుట మంచిది. అధికారులతో చేసిన నూతన ప్రయత్నాలు కావొచ్చు లేక చర్చలు కావచ్చు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కుటుంభంలో తీస్కోనే నిర్ణయాలు వాయిదావేయుట అలాగే అందరి అభిప్రాయాలు తెలుస్కోనే ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో కొంత సమయం ఎక్కువ ఇవ్వడం మంచిది.        

 


మీన రాశి :ఈవారం మొత్తంమీద అధికారులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు పొందుతారు అధికారులకు అనుగుణంగా నడుచుకొని పనిలో శ్రమను కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉండే అవకాశం కలదు. దూరప్రదేశ ప్రయాణాలు చేయవలసి రావోచ్చును కాకపోతే ఆశించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చును. స్త్రీ పరమైన విషయాలలో నూతన సమస్యలు వచ్చిపడుతాయి జాగ్రత్త. వ్యాపారపరమైన విషయాల్లో వారం మధ్యలో కొంత ధననష్టం వచ్చే అవకాశం కలదు కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. అనవసరమైన ఆలోచనలకు అవకాశం ఇవ్వకండి మానసికంగా దృడంగా ఉండుట సూచన. ఈవారం మొత్తంమీద .

మరిన్ని శీర్షికలు
sarasadarahasam