Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

క్యారట్ తో వంటలు - ఆదూరి హైమవతి

carrot recipes

.రాగి- క్యారట్- చక్రాలు.

ఈ రాగి - క్యారట్ - చక్రాలు చేయటానికి  కావలిసిన పదార్ధాలు 

1.క్యారట్స్. 2. రాగిపిండి.3.బియ్యపు పిండి.4.తెల్లనువ్వులు.5.ఉప్పు.  6.కొద్దిగావెన్న. 7.పచ్చిమిర్చి.8.అల్లం .9.కొద్దిగాజీలకర్ర.10.తగినంతనూనె.

 [ కారం తినని పిల్లలకు అల్లం పచ్చిమిర్చి మానేయవచ్చు. పెద్దలకోసం  వాడుకోవచ్చు.]

క్యారట్ బాగా కడిగి తడి తుడిచేసి , సన్నని తురుము పీటతో తురుముకోవాలి. షాపుల్లో దొరికే రాగి పిండి , బియ్యపు పిండి తెచ్చుకుని - ఒక కొలత  రాగి పిండికి ఒకకొలత బియ్యపు పిండి , రెండు కొలతలు సన్నగా తురిమిన క్యారట్ పొడి ఉప్పు ,జీలకర్ర [పొడిచేసి కలిపితే పిండేప్పుడు చిట్లలో చిల్లులకు అడ్డురావు.]మిగతావన్నీ కలిపేసి తగినన్ని నీరుపోసుకుని  గట్టిగా కలుపుకుని, బాండిలో నూనెపోసి కావల్సినసైజ్ లో చక్రాలు చిట్లలోపిండి ఉంచి వత్తుకోవాలి.ఎర్రగా బంగారు రంగు వచ్చాక తీఇస్ , సర్వ్ చేయాలి.

రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.  పెద్దలకే కాక పిలల్లకూ మqంచి పుష్టి ఇస్తాయి.

మరిన్ని శీర్షికలు
sri satya sai baba information