Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
deva prayaga

ఈ సంచికలో >> శీర్షికలు >>

05-05-2017 నుండి 11-05-2017 వరకు వారఫలాలు - - శ్రీకాంత్

మేష రాశి : ఈ వారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుతారు. నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించుట సూచన. కుటుంబంలో పెద్దలనుండి నూతన విషయాలు తెలుస్తాయి. వివాదాస్పదవ్యాఖ్యలకు దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. మిత్రులతో చేపట్టిన పనుల వలన ఒత్తిడి, శ్రమభారం పెరుగుటకు ఆస్కారం కలదు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి, వైద్యసహాయం తీసుకొనే విషయంలో ఏమాత్రం అశ్రద్దచేయకండి. పెద్దలతో మీకున్న పరిచయం బలపడేలా మరిన్ని నిర్ణయాలు తీసుకోవడం సూచన. వ్యాపారపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట, వాయిదావేసే పద్ధతులు అనుకూలిస్తాయి. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుట వలన కొంతఇబ్బందికి గురయ్యే ఆస్కారం కలదు. చిననాటి మిత్రులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం కలదు.

 

 

 వృషభ రాశి : ఈ వారం మొత్తంమీద పెద్దలతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్లకండి. మీనంటూ ఒక స్పష్టమైన ఆలోచన కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. ఆత్మీయుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్లకండి. వాహనములను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్లడం మంచిది. సంతానపరమైన విషయాల్లో గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు వాయిదాపడుతాయి.   

 

.

మిథున రాశి : ఈ వారం మొత్తంమీద ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు , సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. నూతన అవకాశాలు లభిస్తాయి. పెద్దలను కలుస్తారు ,వారితో మీకున్న పరిచయం బలపడుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట బాగా ఆలోచించి ముందుకు వెళ్ళుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. గతంలో మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండుట సూచన. కుటుంబంలో చిన్న చిన్న విషయాలకు సర్దుబాటు విధానం కలిగి ఉండుట మంచిది. మిత్రులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రుణపరమైన ఇబ్బందులు మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురిచేస్తాయి. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, తలపెట్టిన ప్రయత్నాలు ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సమయానికి భోజనం చేయుట మంచిది.  

 


కర్కాటక రాశి : ఈ వారం మొత్తంమీద మిత్రులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విందులలో పాల్గొంటారు. వ్యాపార పరమైన విషయంలో బాగాఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. అనుభవజ్ఞులతో కలిసి బాగాఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. ఊహించని విధంగా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. గట్టిగా ప్రయత్నం చేయుట సూచన. స్త్రీ సంభందమైన విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే నూతన సమస్యలు కలుగుతాయి. తల్లితరుపు బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. మధ్యవర్తిత్వం పనికిరాదు, సాధ్యమైనంత వరకు ఎవ్వరికి ఎటువంటి హామీలు ఇవ్వకండి. సర్దుబాటు విధానం మేలుచేస్తుంది.

 



 సింహ రాశి : ఈ వారం మొత్తంమీద ఉద్యోగంలో పనిఒత్తిడి కలిగి ఉంటారు, వారై అభిప్రయాలను గౌరవించుట సూచన. సరైన సమయపాలన అలాగే శ్రమించుట ద్వారా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించుట సూచన. కుటుంబపరమైన విషయాల్లో పెద్దల సూచనల మేర ముందుకు వెళ్లడం మంచిది. ఇష్టమైన వ్యక్తుల నుండి కీలకమైన విషయాలు తెలుస్తాయి, అవి మీలో నూతన మార్పులకు ఆస్కారం కలిగిస్తాయి. నూతన పరిచయాలకు అవకాశం కలదు. వారితో కలిసి సమాయన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవచ్చును. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుటకు ఆస్కారం కలదు. ఆరోగ్య పరమైన సమస్యలు తప్పక పోవచ్చును, భోజనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది.

 

కన్యా రాశి : ఈ వారం మొత్తంమీద ఆరంభంలో చర్చలు జరుగుటకు అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు చర్చలకు దూరంగా ఉండుట సూచన. సంతానపరమైన విషయాల్లో ఆందోళన ఉండే అవకాశం కలదు. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. ఉద్యోగంలో అధికారులతో మీ ఆలోచనలను పంచుకొనుట మంచిది. అలాగే వారై సూచనల మేర ముందుకు వెళ్ళండి. దూరప్రదేశంలో ఉన్న బంధవుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వారంచివరలో ఏమాత్రం అశ్రద్ధగా ఉన్న పెద్దలకు సమాధానం చెప్పవలసి వస్తుంది. గతంలో చేసిన వాగ్దానాలకు కట్టుబడి ఉండుట అలాగే వాటివిషయంలో ఒకటికి రెండుసార్లు టార్చి చుసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. గతంలో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది, ఖర్చులను తగ్గించుకోవడం సూచన. 

 

 



తులా రాశి : ఈ వారం మొత్తం మీద ఇష్టమైన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. ఆశించిన మేర ఫలితాలు పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది, తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. దూరప్రదేశంలో ఉన్న మిత్రులనుండి కీలకమైన విషయాలు తెలుస్తాయి. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, సాధ్యమైనంత వరకు వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. మీ అభిప్రయాలను పెద్దలతో పంచుకుంటారు, వారినుండి ఆశించిన మేర సహకారం అందకపోవచ్చును. గతంలో చేపట్టిన పనుల విషయంలో స్పష్టత అలాగే బాధ్యత కలిగి ఉండుట మేలుచేస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన కలిగి ఉంటారు. జీవితభాగస్వామితో మీ ఆలోచనలు పంచుకొనే ప్రయత్నం చేయండి, వారి సూచనల మేర ముందుకు వెళ్ళుట వలన లబ్దిని పొందుతారు.

 


వృశ్చిక రాశి : ఈ వారం మొత్తంమీద బంధువులను కలుస్తారు, వారినుండి ఆశించినమేర సహకారం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యముల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఉద్యోగంలో అధికారుల నుండి పనిఒత్తిడి ఉంటుంది. తోటివారు లేదా మిత్రులనుండి సహకారం తీసుకోవడం ద్వారా పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. మీ మాటతీరు మూలన ఇవ్వరు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో అనవసరమైన ఖర్చులకు ఆస్కారం కలదు. చాలాజాగ్రత్తగా ఉండుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాల కన్నా గతంలో చేపట్టిన పనులను పూర్తిచేసే ప్రయత్నం చేయుట సూచన. జీవితభాగస్వామితో ఊహించని విధంగా ఇబ్బందులు ఏర్పడే ఆస్కారం కలదు, సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. పనిఒత్తిడి ఉంటుంది.

 


ధనస్సు రాశి : ఈ వారం మొత్తంమీద నూతన పనులపట్ల అమితమైన ఆసక్తిని కలిగి ఉంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి  ఉంటారు. పెట్టుబడుల కోసం మీరు చేసిన ప్రయత్నాలు మిశ్రమఫలితాలు ఇస్తాయి. మీ మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును, సర్దుబాటు విధానం వలనమేలుజరుగుతుంది. అధికారుల విషయంలో వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకొనుట సర్వదా శ్రేయస్కరం. సోదరులతో చేపట్టిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. విదేశాల్లో ఉన్న బంధువులతో  మీ ఆలోచనలుపంచుకుంటారు. విలువైన వస్తువుల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే నస్టపోయే ఆస్కారం కలదు. వారం చివరలో అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన.

 

మకర రాశి : ఈ  వారం మొత్తంమీద ఉద్యోగంలో అధికారులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. చేపట్టిన పనులను పూర్తిచేయుటకు తోటివారి సహకారం తీసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడుల గురుంచి నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు ఆస్కారం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడేలా ఆలోచనలు కలిగి ఉండుట సూచన. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం కలదు. సంతానపరమైన విషయాల్లో ఒత్తిడిని కలిగి ఉంటారు. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. గతంలో మీరు చేపట్టిన పనులను పూర్తిచేసేలా ప్రణాళిక కలిగి ఉండుట సూచన. జీవితభాగస్వామితో కలిసి దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాహసం ఉంది. నూతన వాహనములు కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు.    

 

   

కుంభ రాశి : ఈ వారం మొత్తంమీద చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుటకు ఆస్కారం ఉంది. సాధ్యమైనంత వరకు తొందరపాటు నిర్ణయాలకు అలాగే చర్యలకు దూరంగా ఉండుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడుల గురుంచి అనుభవజ్ఞులతో చర్చలు చేయుటకు ఆస్కారం కలదు. వివాదస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండుట మంచిది. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనల దిశగా అడుగులు వేస్తారు. సంతానపరమైన విషయాల్లో మీ ఆలోచనలను పెద్దలతో పంచుకుంటారు. దూరప్రదేశప్రయాణాల విషయంలో ఒక స్పష్టత వస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుండి పూర్తిస్థాయి సహకారం లభిస్తుంది. బంధువులతో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు. రావల్సిన ఆర్థికపరమైన సహకారం సమయానికి వస్తుంది. నూతన ప్రయత్నాల విషయంలో స్పష్టత అలాగే తోటివారి సహకారం వలన లబ్దిని పొందుతారు.  

 


మీన రాశి : ఈ వారం మొత్తంమీద ఆరంభంలో వ్యతిరేకఫలితాలు రావడం వలన కొంత ఆందోళనకు లోనయ్యే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞులతో మీ ఆలోచనలు పంచుకోండి. కుటుంబసభ్యుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. సంతానం గురుంచి ఆందోళనకు లోనయ్యే ఆస్కారం కలదు. ప్రశాంతంగా ఉండి నిర్ణయాలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. దూరప్రదేశ ప్రయాణాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో గతంలో రావాల్సిన ధనం వారం చివరలో మీ చేతికి అందే ఆస్కారం ఉంది. మిత్రులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. మీ మనసులో ఉన్న విషయాలను ఆత్మీయులతో పంచుకోవడం వలన మేలుజరుగుతుంది.

 

మరిన్ని శీర్షికలు
chamatkaram