నూనె లేని క్యారట్ పులిహోర.
ఈ నూనె లేని క్యారట్ పులిహోర కు కావలసిన వస్తువులు. 1. క్యారట్స్.2. మంచి బియ్యం[ క్రొత్తవి వాడితే ముద్ద అవుతుంది.] 3. చింతపండు.4.తగినంత ఉప్పు.5.ఎండుకొబ్బరి కోరు.6. ఎండు మిర్చి- [అభ్యమైతే ఉప్పు మిరపకాయలు వాడితే చాలా బావుంటుంది] ,7.ఎండుమిర్చి ఆవాలు, మిన ప్పప్పు, మెంతులు, తెల్లనువ్వులు ,ఇంగువ - వేయించి ,దంచి ఉంచుకున్న గుండ.] 8.కరివేప 9. పులిహొరకు వేసుకునే పోపుసామాను.10. జీడిపప్పు.11 అల్లం .12పచ్చిమిర్చి.13. అలంకారానికి కొతిమేర.
తయారు చేసే విధం:- ముందుగా బియ్యం పావుకిలో కడిగి , నాల్గు పెద్ద క్యారట్స్ కడిగి, తురిమి ఉంచుకుని , చింతపండు 5.నిముషాలు ముందుగా నాననిచ్చి,పులుసు కలుపుకుని ,ఆ చింత పండు పులుసు నీటినే , బియ్యానికి ఎసరుగా పొయ్యాలి.మామూలుగా పోసేనీటి కొలత ఒకటికి రెండైతే, దీనికి కొంచెం తక్కువగా ఒకటికి ఒకటీముక్కాలు పొయ్యాలి. కడిగినబియ్యం,క్యారట్ తురుము వేసిన గిన్నెలో చింతపండు పులుసు ఎసరుపోసి, ఉప్పు కూడా తగినంత వేసి, గరిటతో బాగాకలపాలి. కుక్కర్లోపెట్టి ఉడికించాలి.చింతపండు పులుసు, క్యారట్ తురుము అన్నంతో బాగా కలసిపోతాయి.కుక్కర్ మూత ఊడివచ్చాక , అన్నాన్ని బాగా విడిగా ఒక బేసిన్లో వేసి గాలిపారనిచ్చి , బాణలిలో పోపు సామాను వేసి ఒకే బొట్టు నూనె ఇంగువ వేగను మాత్రం వేసి [ జీడిపప్పు ముందుగా వేయిచి ఉంచుకోవాలి] ,ఆవాలు చిటపటలాడాక, అల్లం తురుము, పచ్చిమిర్చిముక్కలు వేసి, ఒక్క క్షణంతర్వాత, కడిగి ఉంచుకున్న కరివేప వేసి ఆతర్వాత మెత్తని ఎండుకొబ్బరి పొడివేసి మాడకుండా తీసి అన్నంలో కలిపేయాలి, తయారు చేసి ఉంచుకున్న పొడిని రెండు చెంచాలు అన్నంలో వేసి,అన్నీ బాగా గుచ్చెత్తి ,పైన కొత్తిమేర అలంకరించి వడ్డించాలి.కమ్మగా , రుచికి రుచీ ,ఆరోగ్యానికి ఆరోగ్యం , నూనె తక్కువ ఐనందున ఉండనందున దాహంకాదు. ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళేప్పుడు చేసుకుని, కొంత పెరుగుతో తింటే చాలు. సంపూర్ణ అహారం తిన్నట్లే. మరి చేసి చూస్తారుగా!
|