Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
rajinikanth is back

ఈ సంచికలో >> సినిమా >>

రామ్‌ చరణ్‌ రాముడైతే - ఆ ఊహే ఓ అద్భుతం

ramcharan as lord  rama...

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, కొంత మంది నిర్మాతలతో కలిసి 'రామాయణం' సినిమాని తెరకెక్కించాలని అనుకుంటున్నారు. రామాయణం తెరకెక్కించడం అనే ఆలోచన చేయడమే ఓ పెద్ద సాహసం. అందులోనూ ఈ సినిమాని యూనివర్సల్‌ సినిమాగా రూపొందించా లనుకుంటున్నారట.   తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ సినిమాని తెరకెక్కించే యోచనలో అల్లు అరవింద్‌ ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు, ఇతర భాషా నటీ నటులు ఈ సినిమాలో నటించే అవకాశాలున్నాయి.

అయితే ఈ న్యూస్‌ బయటికి వచ్చినప్పట్నుంచీ, సోషల్‌ మీడియాలో అభిమానుల హోరు జోరందుకుంది. తమ అభిమాన హీరోలను ఫలానా పాత్రల్లో ఊహించుకుని ఊహా చిత్రాలను కూడా డిజైన్‌ చేసేస్తున్నారు. అందులో ముఖ్యంగా రామ్‌ చరణ్‌ గెటప్‌ వైరల్‌ అవుతోంది. రామ్‌ చరణ్‌ రాముడి గెటప్‌లో ఎలా ఉంటాడో అంటూ సోషల్‌ మీడియాలో ఊహాజనిత ఫోటోలు సందడి చేస్తున్నాయి. వీటికి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కూడా. మొన్న అవతార్‌ గెటప్‌లో రాముడిలా రామ్‌ చరణ్‌ లుక్‌ని వదిలారు. అలాగే మరో గెటప్‌లో ఓ అభిమాని రామ్‌ చరణ్‌ రాముడైతే ఇలా ఉంటాడేమో అంటూ ఓ అదిరిపోయే లుక్‌ని డిజైన్‌ చేశాడు. ఈ లుక్‌కి వస్తోన్న రెస్పాన్స్‌ అయితే అదరహో అనిపిస్తోంది. రామాయణం అంటే కేవలం ఓ ఇతిహాసం మాత్రమే కాదు. భూమ్మీద మానవీయ విలువల్ని చాటి చెప్పిన ఓ పవిత్ర గ్రంధం. రామాయణం అంటే ఓ బాధ్యత. ఓ దిక్సూచి.. ఇలా ఎంత చెప్పుకున్నా రామాయణం గురించి తక్కువే అవుతుంది. అలాంటిది దీనికి దృశ్య రూపం ఇవ్వడం అంటే అదో మహాద్భుత ఘట్టమే అని చెప్పక తప్పదు. 

మరిన్ని సినిమా కబుర్లు
uyyalavada is indian movie