గత సంచికలో నాదైన ప్రపంచం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
http://www.gotelugu.com/issue216/607/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/
( గతసంచిక తరువాయి )..
ఆకాష్ పరిచయం చేసుకుని, అభిమానినని చెప్పి వుంటాడు. అందుకే కీర్తన మాట్లాడి వుంటుంది.
అదంతా తెలుసుకోకుండా, వాళ్ళు గెలుపు కోసం కీర్తన స్థయిర్యాన్ని దెబ్బ తీయడం కోసం గాసిప్స్ పుట్టిస్తున్నారు. చివరికి ఆమెని కూడా వదిలిపెట్టడంలేదు వాళ్ళు. బాధగా అనిపించింది....
‘‘కీర్తన! మణిబిందు మాటల్ని పట్టించుకోకు నువ్వు. తన తత్వం మనకి తెలిసిందే కదా’’ ఒకమ్మాయి అంది.
మళ్ళీ మానుతున్న గాయం రేగినట్లయింది. మళ్ళీ ఆకాష్ గుర్తొస్తున్నాడు. మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతోంది. ఎందుకు?
మణిబిందు ఏమంది....?
అతను తనకి బాయ్ ఫ్రెండనా?
ప్చ్....! ఆమెకి అలానే అనాలని ఎందుకనిపించిందో? అలా ఆలోచిస్తూ వుండగానే ఎగ్జిబిషన్ గ్రౌండ్ వచ్చింది. టికెట్స్ కొనుక్కుని లోనికెళ్ళారు. కీర్తన తప్ప మిగతా వాళ్ళంతా తాత్కాలికంగా అన్ని విషయాలను పక్కన పెట్టి జెయింట్ వీల్స్ ఎక్కడం లోనూ, పావ్‌బాజీ తినడం లోనూ, షాపింగ్ చెయ్యడం లోనూ మునిగి పోయారు.
కీర్తనకి అంతా విచిత్రంగా వుంది. ఆమె ఎగ్జిబిషన్‌కి వచ్చి చాలా సంవత్సరాలయింది. అందుకే అన్నీ వింతగా చూస్తూ తిరుగుతోంది.
ఒక షాపులో స్పెట్స్ అమ్మడం చూసింది. స్పెడ్స్ పెట్టుకున్న ఆకాష్ గుర్తుకొచ్చాడు.
మనసంతా దిగులుగా తయారైంది. ఈ ఆకాష్ తనని వదిలిపెట్టడా....? తనేంటీ ఇలా మారిపోతోందీ...? భయంగా అనిపించింది....
ఈ విషయాలు ఎవరితో షేర్ చేసుకోవాలీ....? అసలు ఈ ఫీలింగ్స్‌ని ఏమంటారు....? సంఘర్షణ తట్టుకోలేక తలనొప్పి వచ్చేసింది.
ఫ్రెండ్స్‌కి కారీయాన్ చెప్పి తను వచ్చేసింది.
టాబ్లెట్ వేసుకుని పడుకుంది.
తండ్రి తన మాట కోసం ఎంతగా ఎదురుచూస్తాడో గుర్తొచ్చి నిట్టూర్చి లేచి వెళ్ళి ఆయనతో మాట్లాడింది. ఆమె మాటల్లో అంతగా ఉత్సాహం లేకపోవడం గమనించాడాయన. ఎలా అడగాలో తెలియలేదు...
అశోక్ కూడా ఎందుకో డల్ గానే కనిపించాడు. మరింత దిగులుగా అనిపించింది.
తండ్రి నిద్రపోయాక అశోక్ రూం లోకి వెళ్ళింది. అతను ఎటో చూస్తూ కనిపించాడు.
‘‘నీతో మాట్లాడాలి అన్నయ్యా!’’ అంది.
‘‘చెప్పరా!....’’ లాలనగా అడిగాడు.
తలదించుకుని నిలబడింది.... పరిశీలనగా చూశాడు....
మనిషి డిస్టర్బ్‌గా వుంది...
అతని పెదాల మీద చిరు దరహాసం మెదులుతోంది.
‘‘ఎందుకో కాన్సన్‌ట్రేషన్ ఉండటం లేదు.’’ మెల్లగా అంది.
‘‘దేని మీద....?’’ అడిగాడు.
‘‘గేమ్ ఆడుతుంటే అన్నీ మర్చిపోతాను కానీ తిండి మీద, చదువు మీద ధ్యాస ఉండటం లేదు.’’
‘‘ఏం....?’’
ఏదో చెప్పబోయి విరమించుకుంది...అది అన్నయ్యతో షేర్ చేసుకునే ఫీలింగ్ కాదని మనసుకి తడుతోంది. నిట్టూర్చాడతను.
‘‘గేమ్ సంగతి ఎలా వున్నా ముందు హెల్త్, స్టడీస్ చూసుకో!’’ చెప్పాడు అశోక్. నిర్ఘాంతపోయింది కీర్తన.
ఈ మాట అన్నది ఎవరు...? తన అన్నయ్యేనా....? తను వాలీబాల్ గేమ్‌ని ప్రాణ ప్రదంగా ప్రేమిస్తుందని తెలిసీ, దానిని అంత తక్కువ చేసి మాట్లాడేది అన్నయ్యేనా....? కళ్ళు విప్పార్చి చూసింది.
ఆ కళ్ళల్లో గాయపడిన భావం స్పష్టంగా కనిపించింది.
అశోక్ మనసు విలవిల్లాడింది. కానీ తప్పదు. తను గట్టిగానే ఉండాలి. నిర్ణయించుకున్నాడు. మౌనంగా వెను దిరిగి వెళ్ళిపోయింది కీర్తన. వెళ్తున్న ఆమె వంక అలానే చూస్తుండిపోయాడు అశోక్
*****************
ఆకాశంలో తెల్ల మబ్బులు తేలుకుంటూ వెళ్తున్నాయి. సూర్యుడు తన ప్రతాపాన్ని తగ్గించుకుని చాలా సేపయింది. గాలి చల్లదనాన్ని సంతరించుకుంటోంది.
డాబా మీద ఆరేసిన బట్టల్ని తీసుకొచ్చి మడతలు పెడుతోంది జాహ్నవి. రెండు గంటల ముందు మధ్యాహ్నపు నిద్ర నుంచి మేలుకొని ఫ్రెష్‌గా స్నానం చేయడంతో మనిషి నిగారింపుగా కలకల్లాడుతూ అరవిరిసిన తెల్ల కలువలా వుంది....
ఇన్నాళ్ళ బట్టీ ఆవరించిన కష్టాల నీడలు తొలగిపోవడంతో ముఖం తేటపడింది. కళ్ళు స్వచ్ఛంగా మెరుస్తున్నాయి.
ఎర్రని పెదాలు తేనెలో ముంచి తేల్చినట్లు వున్నాయి. మనసు లోని మనోహరమైన భావాల తాకిడికి మొహం కుంకుమ రంగుని సంతరించుకుంది.
ఇంటి ముందు కారాగడంతో గబగబా వచ్చి తొంగి చూసింది. ప్రకాష్ అప్పుడప్పుడూ కార్లో వస్తుంటాడు.
కానీ అన్నయ్య కాదు....
అశోక్!....
గాభరాగా అనిపించింది. మొహమంతా చిరు చెమటలు పట్టాయి. బట్టలన్నీ తీసుకెళ్ళి మధ్య గదిలో పెట్టింది. తడబడే అడుగులతో ఎదురెళ్ళి ‘‘రండి!’’ పిలిచింది.
‘‘హలో!’’ అంటూ లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఇచ్చింది. అవసరం లేకపోయినా కొంచెం తాగాడు. అతని ఎదురుగా కూర్చోవడం సంగతి దేవుడెరుగు. నిల్చోవాంటేనే కాళ్ళు వణుకుతున్నాయి....
‘‘అన్నయ్య ఇంకా రాలేదు....’’ అతని కోసం వచ్చాడేమోనని చెప్పింది.
‘‘నాకు తెలుసు’’ అన్నాడు.
‘‘తెలుసా....???’’
తెలిసే ఇంటికి ఎందుకు వచ్చినట్లు....?
‘‘ఆంటీ లేరా....?’’ అడిగాడు.
‘‘టెంపుల్‌కి వెళ్ళింది’’ చెప్పింది.
కాసేపు అతను ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపించాడు. ఆమె తల దించి కుచ్చిళ్ళు చూసుకుంటూ నిల్చుంది.
‘‘రెండేళ్ళాగి, మనిద్దరం పెళ్ళిచేసుకుందామా...?’’ సడెన్‌గా అడిగాడు అశోక్.
అతనేమన్నాడో అర్థం కాలేదు. రెప్పలు టపటపా ఆర్పింది. అశోక్ లేచి మెల్లగా ఆమె వైపు నడిచాడు.
అతను దగ్గరగా వస్తుంటే గుండెలు దడదడలాడాయి. దగ్గరగా వచ్చాక జేబు లోంచి ఏదో తీసాడు. దాన్ని గుప్పిట్లో బంధించి, కాసేపాగి ఆమె కళ్ళ ముందు గుప్పెట తెరిచాడు.
అతని అరచేతిలో మిలమిల్లాడుతూ తన చెయిన్, చిన్న ఉంగరం.
‘‘ఇష్టమైతే ఈ రెండూ తీసుకోండి. ఇష్టం లేకపోతే వదిలేయండి. ప్రకాష్ జాబ్‌కీ దీనికీ ఏ సంబంధం లేదు.’’ చెప్పాడు.
అతను కళ్ళు మూసుకున్నాడు.
ఆమె ఆలోచనలో పడింది.
ఇతని స్టేటస్ పెద్దది. అయినా తనని పెళ్ళిచేసుకుంటానంటున్నాడు. అన్నయ్యతో చెప్పకుండా ఎలా....?
ఆ మాటంటే ఇతను ఫీలవ్వొచ్చు...
ఏం చెయ్యాలీ....?
ఓపిగ్గా నిరీక్షిస్తున్నాడు అశోక్.
చివరికి అతని చేతిపై ఆమె మునివేళ్ళ స్పర్శ.....ఆనందంగా కళ్ళు తెరిచాడు. గుప్పిట ఖాళీగా వుంది.
జాహ్నవి మొహం రాగరంజితమయింది. ఉంగరాన్ని స్వయంగా వేలికి తొడిగాడు. చెయిన్‌ని ఆమె మెళ్ళో వేసాడు. ‘‘మన పెళ్ళికి ముందు, మా చెల్లి కీర్తన పెళ్ళి జరగాలి. రెండేళ్ళు టైమ్ వుంది కదాని ప్రేమా దోమా అంటూ మిమ్మల్ని యిబ్బంది పెట్టను. షికార్లకీ, సినిమాకీ రమ్మని బలవంతం చేయను. నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తే మా చెల్లిని తీసుకుని మీ యింటికి వస్తాను. మీకు నన్ను చూడాలనిపిస్తే మీ అన్నయ్యతో కలిసి ఆఫీస్‌కో, మా ఇంటికో రండి’’ అతను చెబుతుంటే కళ్ళింతలా చేసి వింది.
అవి విన్నాక అనిపించింది. ఎంత అవాంతరాలు వచ్చినా తమ పెళ్ళి జరిగి తీరుతుందీ అని.
అతను కుర్చీలో కూర్చున్నాక ఆమెతో చెప్పాడు ‘‘కూర్చోమని’’
ఆ తర్వాత అతను నిశ్చయించుకున్న ప్రకారం తమ ఫ్యామిలీ విషయాలు చెప్పదలుచుకున్నాడు.
రెండేళ్ళాగైనా ఆమె తన కాబోయే భార్య.
అన్ని విషయాలు ఆమె తెలుసుకోక తప్పదు. అనుకుంటూ మొదట్నించీ యిప్పటివరకూ జరిగినవన్నీ చెప్పుకొచ్చాడు శ్రద్ధగా వింది జాహ్నవి. కీర్తన గురించి చెప్పేటప్పుడు అతని మొహంలో మారుతున్న ఫీలింగ్స్ చూసి, చెల్లెంటే అతనికి ఎంత ప్రాణమో, ఆమె పెళ్ళి చేసుకొని ఆనందంగా జీవితం గడపడం కోసం తన సర్వస్వాన్నీ అతడు త్యాగం చేయగలడు అనిపించింది.
‘‘మన పెళ్ళయ్యాక మీకు సుఖాలకన్నా బాధ్యతలే ఎక్కువగా వుంటాయి’’ బలహీనంగా నవ్వుతూ అన్నాడు.
‘‘అవి నాకు కొత్త కాదు. చిన్నప్పటి నుంచీ అందులోనే పెరిగిన దాన్ని. బాధ్యతల్ని నెరవేర్చడంలోనే నాకు సంతృప్తి దొరుకుతుంది. అప్పటికి నోరువిప్పి ధైర్యంగా ఒక మాట చెప్పగలిగింది.
‘‘ప్రేమికుల ముందు స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటారేమో....నేను మీకు అన్నీ కష్టాల గురించే చెపుతున్నాను’’ అన్నాడు.
కొంచెం సిగ్గుపడి ‘‘అదేం లేదు’’ అంది. కాసేపాగాక ఆమె టీ తెచ్చి యిచ్చింది. తాగి పదినిమిషాలు కూర్చుని వెళ్ళొస్తానని బయలుదేరాడు. జాహ్నవికి యిందాకటి నుంచి మనసులో ఒక అనుమానం మెదుల్తోంది.

కొంచెం సిగ్గుపడి ‘‘అదేం లేదు’’ అంది. కాసేపాగాక ఆమె టీ తెచ్చి యిచ్చింది. తాగి పదినిమిషాలు కూర్చుని వెళ్ళొస్తానని బయలుదేరాడు. జాహ్నవికి యిందాకటి నుంచి మనసులో ఒక అనుమానం మెదుల్తోంది. |