Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
amala for hussain sagar

ఈ సంచికలో >> సినిమా >>

మరీ ఇంత హంగులేని హీరోయినా?

heroine's simplicity

ముంబై నుంచి దిగుమతి అయ్యే అందాల భామలే కాదు, దక్షిణాదిలో తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమల నుంచి తెలుగు సినిమాల్లో నటించే అందాల భామలూ గొంతెమ్మ కోర్కెలు కోరుతారు నిర్మాతలకి. వారి కోరికలను తీర్చడం నిర్మాతలకు తలకు మించిన భారమవుతుంది. కానీ, ఓ హీరోయిన్ నిర్మాతలకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంటోంది.

ఆమె పేరు తషు కౌషిక్. సరైన కమర్షియల్ హిట్ ఆమె ఖాతాలో ఇంకా పడలేదుగానీ, తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడామె గురించి అందరూ చర్చించుకుంటున్నారు. కారణం ఆమె సింప్లిసిటీనే. ‘రిపోర్టర్’ అనే సినిమాలో నటిస్తోందిప్పుడు తషు కౌషిక్. చాలా సింపుల్గా వుంటుందట ఆమె వ్యవహారమంతా.

ఖరీదైన హోటళ్ళలో బస కోరదు, అకామిడేషన్ కి సంబంధించి రూల్స్ ఆమె ఏమీ పెట్టదు. హంగూ ఆర్భాటాల్లేని హీరోయిన్ ఎవరన్నా వుంటే అది తషు కౌషిక్ మాత్రమేనంటున్నారు ‘రిపోర్టర్’ మూవీ దర్శకుడు మహేష్ కత్తి. ఇలాంటోళ్ళతో సినిమా అంటే నిర్మాతకీ, దర్శకులకీ కష్టం లేకుండా వుంటుందనడం నిస్సందేహం.

మరిన్ని సినిమా కబుర్లు
telugu singer in kanchi peetam