Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

నేనే కానీ లఘుచిత్ర సమీక్ష - ప్రతాప్ రూపినేని

Nene Kaani Telugu Short Film || Directed By Srinivas Vinjanampati

చిత్రం: నేనే..కానీ!
నటీనటులు: సోహెల్, దివ్య, నవీన్, అప్పారవు, అభిషేక్
సంగీతం: చైతన్ ప్రభాకర్
డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జి యస్ కే
ఎడిటర్: ఏ.వి.ప్రసాద్
నిర్మాత: సాహిత్య చక్రవర్తుల
కథ - కథనం - దర్శకత్వం: శ్రీనివాస్ వింజనంపాటి

కథ: శివ {సోహెల్} తన స్నేహితుడు అయినటువంటి ప్రసాద్ {నవీన్} వాళ్ళ ఊరికి వెళ్తాడు. సెలవులకి ఎంజాయ్ చేయడానికి ఆ ఊళ్ళో పెద్దమనిషి అయిన నాగిరెడ్డి కూతురు సమీరా {దివ్య } ని ప్రేమిస్తాడు. సమీరా కూడా శివని ప్రేమిస్తుంది. అలా ఒకరినొకరు ప్రేమించుకున్నా వాళ్ళిద్దరు పెద్దలు ఒప్పించి పెళ్ళి చేసుకున్నారా. లేక నన్న మాటకు కట్టుబడి సమీరా ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్ళికి ఒప్పుకుందా అనే సందిగ్ధ పరిస్థితుల్లో శివ ఏం చేసాడు? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఒక సారి :నేను..కాని" లింక్ మీద క్లిక్ చెయ్యండి.
 కథనం: ఒక సాధారణమైన కథని తీసుకుని దానికి మంచిగా ఆసక్తికరమైనటువంటి కథనాన్ని బాగా చూపించారు. హీరో తన ప్రేయసి గురించి ఆలోచిస్తూ యాక్సిడెంట్ కి గురికావడం . తరువాత ఒక చిన్న హాస్పిటల్ అక్కడ వాళ్ళు చేర్చడం. అక్కడ  కామెడీ మరియు హీరో తన ప్రేయసి గూరించి తెలుసుకోవడానికి వాళ్ళ ఊరికి వెళ్ళి ఎలా ఇబ్బంది పడ్డాడో చూపించాడు

చివరికి తన ప్రేయసి కనిపించినప్పుడు తన దగ్గరికి హీరో వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఇలా కథనాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు.  

ప్లస్ పాయింట్స్:
1. కథనం
2. సంగీతం
3. హీరో నటన

మైనస్ పాయింట్స్:
1.కథ
2. క్లైమాక్స్
3. స్లో నేరేషన్

నటీనటుల తీరు : సోహెల్ ఇప్పటికి తాను ముందు తీసిన ఫిల్మ్ లో నటుడిగా మంచి ప్రతిభను చూపించారు. ఇందులోను అదేవిధంగా ఎమోషన్ సన్నివేశాల్లో చాలా బాగా చేసాడు. రొమాంటిక్ సన్నివేశాల్లో చాలా బాగా చేసాడు. ఇక సినిమా మొత్తం తన నటనతో బాగా అలరించాడు.  తరువాత దివ్య చాలా అందంగా వుంది. రొమాంటిక్ సన్నివేశాల్లో బాగా చేసింది. ఎమోషన్ సన్నివేశాల్లోని మంచి నటనను కనబరిచింది. హీరో స్నేహితుడిగా నటీంచిన నవీన్ వున్నంతసేపు తన నటనతో కామెడె  టైమింగ్ తో బాగానే అలరించాడు. ఇకపోతే అప్పారావు గారు వేసిన డాక్టర్ క్యారెక్టర్ అంతగా ఆకట్టుకోలేదు. మిగతా నటీనటులు వాళ్ళ పరిధి మేరకు నటించారు.    సాంకేతిక వర్గం: కథ

కథనం- దర్శకత్వం. మూడు విభాగాల భాధ్యతను పోషించిన శ్రీనివాస్ వింజనంపాటి గారు అందరికీ తెలిసినటువంటి చాలా సాధారణమైనటువంటి కథని తీసుకుని మంచి కథనం తో చాలా ఆసక్తి కరంగా చూపించారు దర్శకుడు ప్రతి ఒక్కరి దగ్గర మంచి నటనను రాబట్టుకున్నారు. ఇకపోతే సంగీతం చాలా వినసొంపుగా కూల్ గా వుంది. ఉన్న ఒకపాటకీ చాలా చక్కటి బాణీలు సమకూర్చారు. బ్యాక్ గ్రౌండ్ స్కోరు చాల బాగుంది . తరువాత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ మంచిగానే వుంది. ఎడిటింగ్ విషయానికొస్తే ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయి.

చివరగా : ఈ నేను ..కాని! చూస్తున్నంత సేపు మనము కాదు అన్న విధంగానే ఆసక్తి కనబరుస్తుంది.

మరిన్ని శీర్షికలు
sirasri  question