Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

భలే భలే మహానుభావుడు

mahanubhavu teaser first look released

'మహానుభావుడు' టీజర్‌, ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. సరికొత్తగా ఎట్రాక్ట్‌ చేస్తోంది ఈ టీజర్‌. ఇంతకీ ఈ సినిమా డైరెక్టర్‌ ఎవరనుకుంటున్నారా? మారుతి. 'భలే భలే మగాడివోయ్‌' సినిమాతో హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ అన్నమాట. హీరో శర్వానంద్‌. ఈ సినిమాలో శర్వానంద్‌ పాత్ర పేరు ఆనంద్‌ ఓసీడీ. ఓసీడీ అంటే బీటెక్‌, ఎమ్‌టెక్‌లాంటి డిగ్రీలేం కాదండోయ్‌. ఆ విషయం శర్వానందే చెప్పాడు. అదో డిజార్డర్‌ అట. అదేం డిజార్డర్‌ అనుకుంటున్నారా? అతి శుభ్రం దాని లక్షణాలు. అంటే మనోడికి అతి శుభ్రమన్న మాట. అదెంత అనుకుంటున్నారా? హీరోయిన్‌ని ముద్దు పెట్టుకునే సిట్యువేషన్‌లో కూడా కొంచెం ఆగి, నువ్వు బ్రష్‌ చేశావా..

అన్నంతగా. భలే ఉంది కదా. భలే ఉన్నాడులే మన మహానుభావుడు. ఫస్ట్‌లుక్‌ కూడా ఆకర్షిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ పాత్రలో నటిస్తున్నాడు శర్వానంద్‌ ఈ సినిమాలో. 'శతమానం భవతి' సినిమాతో ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న శర్వానంద్‌ దసరాకి 'మహానుభావుడు' సినిమాతో వస్తున్నాడు. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' ఫేం మెహరీన్‌ కౌర్‌ ఈ సినిమాలో శర్వానంద్‌తో జోడీ కడుతోంది. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' తర్వాత మెహరీన్‌ నుండి వస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాలో ఇంకా అందంగా క్యూట్‌గా కనిపిస్తోంది మెహరీన్‌. శర్వానంద్‌ తనకున్న ఓసీడీ సమస్యతో ఎంతగా కామెడీ క్రియేట్‌ చేయబోతున్నాడో టీజర్‌ చూస్తేనే అర్ధమవుతోంది. ఇక సినిమా ఇంకెంత ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందో చూడాలిక

మరిన్ని సినిమా కబుర్లు
sachin new look