Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Navvula Jallu by Jayadev Babu

ఈ సంచికలో >> శీర్షికలు >>

టమాటో రైస్ - పి. శ్రీనివాసు

tomato rice

కావలసిన పదార్థాలు:
టమాట, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు, నిమ్మకాయ, పసుపు, ఉప్పు, కారం

తయారు చేయు విధానం:
ముందుగా స్టవ్ పై బాణలి పెట్టుకొని అందులో నూనె పోసి పోపుదినుసులు వేసుకోవాలి. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక అందులో టమాటో ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా మగ్గాక కొద్దిగా పసుపు, ఉప్పు మరియు కారం వేసుకొని బాగా కలుపుకొని, మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి.  కాస్త ఘాటు కావాలనుకొనేవారు అల్లం, వెల్లుల్లి పేస్టూ కూడా వేసుకోవచ్చు. టమాటాలు ఉడికిన తరువాత అందులో అన్నం వేసుకొని బాగా కలుపు కొని నిమిషం పాటు స్టవ్ పై ఉంచాలి.  తరువాత అందులో కొద్దిగా నిమ్మ రసం. కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటో రైస్ రెడీ.

ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినపుడు సాధారణంగా పులిహోర చేసుకుంటారు. దానికి బదులుగా కాస్త వెరైటీగా ఈ టమోటా రైస్ చేసుకోవచ్చు.

 


 

మరిన్ని శీర్షికలు