Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
poruginti pullakoora

ఈ సంచికలో >> శీర్షికలు >>

శ్రద్ధ - బన్ను

concentration

మనం ఏ పనిచేసినా 'శ్రద్ధ'తో చేయాలి. శ్రద్ధ అనేది ఏకాగ్రత (కాన్సన్ ట్రేషన్) తో వస్తుంది. మనం శ్రద్ధతో చేసే పని మనకి గుర్తుంటుంది. మనం చేసే పనిమీద ఇష్టం, మమకారం వుంటే 'శ్రద్ధ' కలుగుతుంది.

నిద్ర, తిండి సమయానికి వుండాలి. మైండ్ రిలాక్స్ గా ఉండేలా చూసుకోవాలి. అందుకు జీవితంలో ఆనందం వుండాలి. 'మిత్రులతో కాలం గడపటం', 'సినిమాలు చూడటం', 'జోక్స్ చదవటం' ఇలా మీ కిష్టమైన పనిచేస్తే మైండ్ రిలాక్స్ గా వుండి ఏకాగ్రత కలిగి మన 'వర్క్' మీద శ్రద్ధ కలుగుతుంది.

ఇంకో విషయం... మనసులో భయం వుండకూడదు. కొంతమందికి 'ఫోబియా'లుంటాయి.  'ట్రావెల్ ఫోబియా', 'లిఫ్ట్ ఫోబియా', 'ఎగ్జామ్స్ ఫోబియా' లాంటివి. మనం మన మనసుతో 'అందరూ చేసేదే నేనూ చేస్తున్నా...' అనుకుంటే చాలు... 'ఫోబియా'లు పోతాయి.

శ్రద్ధతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం తో ఏదన్నా సాధించవచ్చు. కానీ అది 'అతి' అవ్వకూడదు. అతి ఐతే ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది.

ఏకాగ్రత -> శ్రద్ధ -> ఆత్మవిశ్వాసం -> విజయం!

దీనికి మన నిజ జీవితంలో ఉదాహరణగా ఎన్నో విజయాలు సాధించిన సినీ డైరెక్టర్ 'రాజమౌళి' గారిని చెప్పుకోవచ్చు. ఆయన ఏ పనిచేసినా శ్రద్ధతో చేస్తారని యూనిట్ వాళ్ళు నాతో చెప్పారు. ఇటీవలే గోవా ఎయిర్ పోర్టులో వారితో మాట్లాడే అవకాశం లభించింది.

నా అదృష్టం బాగుండి, హైదరాబాద్ ఫ్లైట్ 30 నిమిషాలు లేటుగా రావటంతో, అది గోవా కావటంతో ఆయన తీరిగ్గా మాట్లాడే అవకాశం దొరికింది!

CONCENTRATE - "YOU WILL BE A SUCCESSFUL MAN !"

మరిన్ని శీర్షికలు
Acidity