Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sirasri question

ఈ సంచికలో >> శీర్షికలు >>

తాతగారి పాత రేడియో లఘు చిత్రసమీక్ష - ప్రతాప్ రూపినేని

Thaatha Gari Paatha Radio || Telugu Short ... 2017 || By Aaron Raj Ayub || RBV Talkies

 చిత్రం: తాతగారి పాత రేడియో
నటీనటులు: కుమార్ కాశారాం, పావని, మహేష్ విట్ట , సంపత్ రాజ్,మాస్టర్ మహేష్
సినిమాటోగ్రఫీ: అనిల్ మల్లెల
ఎడిటింగ్ డీజి టైటిల్స్: రాహుల్ మరుగుల
సంగీతం: హరి
నిర్మాత; రాహుల్ భరధ్వాజ్ వేలమకన్ని
రచన మరియు దర్శకత్వం: ఆరోన్ రాజ్ అయుబ్

కథ: రాం చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళను అని ఏడుస్తూ కూర్చుంటే తన తాతయ్య దగ్గరకు తీసుకుని నీకు ఏదైనా కష్టం వస్తే ఇలా చెయ్యి అని ఒక సింపుల్ మార్గం చెబుతాడు. ఆ తర్వాత పెద్దవాడు అయిన రాం ఒక అమ్మాయి జాహ్నవి ని ఇష్టపడుతాడు , అదే సమయం లో తన జీవితం లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురౌతాయి. ఇటువంటి పరిస్తితుల్లో రాం తన తాతయ్య చెప్పినటువంటి సింపుల్ మార్గం ను ఎంచుకున్నాడా...! లేక చిన్నప్పుడు తాను ఏడుస్తూంటే ఏదో సరదాకి చెప్పాడు అని  వదిలేసి తన తెలివి తేటలతో తన సమస్యలు పరిష్కరించుకున్నాడా...  అసలు గిరి, రాం కి వున్న సంబంధం ఏంటి.. అని తెలుసుకోవాలంటే ఇంకా ఆలస్యం చెయ్యకుండా కింద కనిపిన్చే లింక్ ను క్లిక్ చేయండి.  

విశ్లేషణ: దర్శకుడు మరియు రచయిత అయినటువంటి ఆరోన్ రాజ్  ఒక మంచి పాయింట్ ఎంచుకుని దానికి చిన్నప్పుడు , పెద్దవారు మనం ఆనందం గా వుండటానికి ఎన్నో మార్గాలు చెప్తారు. వాటిల్లో కొన్ని మంచివి వుంటాయి. మరికొన్ని చెడ్డవి వుంటాయి. వాటిల్లో ఏవి ఎప్పుడు మనకి ఉపయోగపడుతాయి అని చెప్పాలనుకున్న దర్శకుడుకి నా అభినందనలు. కాని మన దర్శకులు ఎటువంటి కథను ఎంచుకున్న దానికి ప్రేమను ఉపయోగించడం అంతగా సూట్ అవ్వలేదు. ఇంకా తను ఎంచుకున్న నటీనటులు చాలా బాగా వారి పాత్రలకి జీవం పోసారు.

ప్లస్ పాయింట్స్:

హీరో , తాతయ్య
మహేష్ విట్ట కామెడీ
సంగీతం
సినిమాటోగ్రఫీ
ఎడిటింగ్

మైనస్ పాయింట్స్:

లవ్ ట్రాక్
లాజిక్ లేని సన్నివేశాలు

సాంకేతిక వర్గం: రచయిత మరియు దర్శకుడు  ఆరోన్ రాజ్ తన ప్రతిభ చాలా మంచిగా కనబరిచాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ బాగుంది. మరియు నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తం గా సాంకేతిక వర్గం చాలా కష్టపడి పనిచేసింది అని అర్ధమవుతుంది.

చివరగా: యవ్వనం వచ్చాక పసితనం , వృద్ధాప్యం వచ్చాక యవ్వనం కోల్పోతం. కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయిన కోల్పోకూడనిదీ ఆత్మస్థైర్యం.  

మరిన్ని శీర్షికలు
uttarakhand tourism