Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

08-09-2017 నుండి14-09-2017 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మీరు అనవసరమైన విషయాలకు సమయం ఇవ్వడం మూలాన నూతన సమస్యలు తెచ్చుకొనే అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ఒకింత ఆందోళనకు లోనయ్యే అవకాశం ఉంది. చేపట్టిన పనులను పూర్తిచేయుటకు సరైన సమయంలో సహకారం వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఉత్సాహానికి తగిన విధంగా కష్టపడుట ద్వారా ఊహించిన ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది. వాహనముల మూలాన ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. 
 

 వృషభ రాశి : ఈవారం మీరు బంధువులను కలుస్తారు, మీ ఆలోచనలను వారితో పంచుకొనే అవకాశం కలదు. ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వండి. చేపట్టిన పనుల విషయంలో కాస్త స్పష్టమైన ఆలోచన కలిగి ఉండుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో తగిన విధంగా ఆలోచన కలిగి ఉండుట సూచన. వ్యాపారపరమైన విషయంలో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు.  



మిథున రాశి : ఈవారం చేపట్టిన నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది. పనులను మొదట్లో వేగంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆరంభంలో ఉన్న వేగం తదుపరి ఉండక పోవచ్చును. నచ్చిన వ్యక్తులను కలుసుకునే ఆస్కారం కలదు, సమయాన్ని వారితో గడుపుతారు. అధికారులతో మీ ఆలోచనలు పంచుకొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో శుభకార్యాల గురుంచి ప్రస్తావన వచ్చే అవకాశం కలదు. 


కర్కాటక రాశి : ఈవారం మీరు దైవపరమైన విషయాలకు సమయం కేటాయిస్తారు. అనుకోకుండా దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. మిశ్రమ ఫలితాలు పొందుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం సూచన. పెద్దలతో మీకున్న పరిచయం బలపడేలా మీ ప్రయత్నాలు ఉండేలా చూసుకోండి. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించుట సూచన విదేశీప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. 

.



 సింహ రాశి : ఈవారం సమయాన్ని సరదాగా గడుపుటకు ఇస్టపడుతారు. చిననాటి మిత్రులను కలుస్తారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. కుటుంబసభ్యులనుండి వచ్చిన సూచనలను పాటించుట సూచన. ఉద్యోగంలో సమయ పాలన పాటించుట మంచిది , ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. వ్యాపారపరమైన విషయాల్లో మీరు ఆశించిన విధంగా నూతన పనులను చేపట్టుటకు అవకాశం కలదు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. మిత్రులనుండి వచ్చిన సూచనల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. 

 

 


కన్యా రాశి : ఈవారం మీరు అనుకోకుండా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. పెద్దలతో మీ ఆలోచనల్ను పంచుకుంటారు. బంధువులను లేదా ఆత్మీయులను కలుస్తారు. వారితో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. అనుకోని విధంగా దూరప్రదేశప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. మీ మాటతీరు విషయంలో ఒకటికి రెండుసార్లు సరిచూసుకొనే ప్రయత్నం చేయుట మంచిది. తల్లితరుపు బంధువుల నుండి కీలకమైన విషయాలు తెలుస్తాయి. మానసికంగా దృడంగా ఉండుట అవసరం. 

 

 


తులా రాశి : ఈవారం మీరు పోటీ పరమైన విషయాల్లో మీ ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. క్రీడారంగంలో ఉన్న వ్యక్తులు రాణిస్తారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా పటిష్టం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మీకంటూ ఒక విధానం కలిగి ఉండుట సూచన. చర్చలకు అవకాశం ఇవ్వకండి. సాధ్యమైనంత మేర సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. 

 

వృశ్చిక రాశి : ఈవారం మీరు చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. మీకు ఆశించిన మేర నూతన అవకాశాలు లభించక పోవచ్చును. చిన్న చిన్న విషయాలకు హైరానా పడకపోవడం మంచిది. ఉద్యోగపరమైన విషయాలకు సమయం ఇస్తారు. కాస్త కోపాన్ని తగ్గించుకోవడం సూచన. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. మిత్రులతో ఊహించని విధంగా వివాదాలు వచ్చే ఆస్కారం కలదు. 

 

ధనస్సు రాశి : ఈవారం మీరు మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో ఆశించిన మేర లబ్దిని పొందుటకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ప్రయత్నం చేయుట మంచిది. దైవపరమైన విషయాలకు కాస్త సమయం ఇవ్వడం సూచన. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. వాహనముల వలన అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. దూరప్రదేశ ప్రయాణాలు వాయిదా వేయుట సూచన, తగిన జాగ్రత్తలు తీసుకోండి. 

 



మకర రాశి : ఈవారం మీరు స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం కలదు. ఉద్యోగంలో ఆశించిన మేర అభివృద్ధి లభిస్తుంది, గుర్తింపును పొందుతారు . ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు, రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన సంప్రదింపులు చేయుటకు అవకాశం కలదు. మీ మాటతీరు మూలాన విభేదాలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. మిత్రులతో కలిసి చర్చలు చేయుటకు అవకాశం ఉంది. 

 


కుంభ రాశి : ఈవారం మీరు మిత్రుల ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. కుటుంబపరమైన విషయాల్లో కాస్త అసంతృప్తిని కలిగి ఉంటారు. గతంలో చేపట్టిన పనులకు గాను మీకు గుర్తింపు లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. జీవితభాగస్వామితో చర్చలు చేయకండి. నూతన పరిచయాలకు ఆస్కారం కలదు. చిన్న చిన్న విషయాలకు ప్రాముఖ్యం ఇవ్వండి.  మీ మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. స్రదుబాటు విధానం కలిగి ఉండుట సూచన. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. 

 


మీన రాశి :  ఈవారం మీరు ఉద్యోగంలో ఉత్సాహంగా ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఊరట చెందుతారు.ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. విదేశీ ప్రయత్నాలు చేయువారు ఊహించిన ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశీప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది, కలిసి వస్తాయి.      

మరిన్ని శీర్షికలు
Pulasa Fish Curry - Most expensive fish in the world.