అక్కినేని రాకుమారుడు అఖిల్ రెండో సినిమాకి 'హలో' అని టైటిల్‌ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్‌కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. 'మనం' సినిమాతో అఖిల్‌ని తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఈ సినిమాలో. అఖిల్ మంచి డాన్సర్. తొలి సినిమాతోనే ఆ విషయం ప్రూవ్ చేసుకున్నాడు అఖిల్.
సో ఈ సినిమాలో కూడా అఖిల్ డాన్సులు ఇరగదీసేశాడట. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం ఇద్దరు ముద్దుగుమ్మలు అఖిల్‌తో జత కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కళ్యాణీ ప్రియదర్శిని అనే కొత్తమ్మాయిని ఈ సినిమా కోసం ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కొత్త భామ లైన్‌లోకి వచ్చింది. నివేదిత ఈ ముద్దుగుమ్మ పేరు. తమిళ సినిమా నుండి ఈ ముద్దుగుమ్మని తీసుకొచ్చారు. ఈ ఇద్దరితోనూ అఖిల్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనున్నాడన్న మాట. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫస్ట్‌లుక్ స్టిల్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. నాగార్జునకి బాగా కలిసొచ్చిన డిశంబరులో ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటోంది అఖిల్ 'హలో'.
|