కావలిసిన పదార్ధాలు: గోంగూర, చికెన్, కారం, అల్లం వెల్లుల్లిముద్ద, పసుపు, చికెన్ మసాలా, కొత్తిమీర, ఉల్లిపాయలు
తయారుచేసే విధానం: ముందుగా రైస్ కుక్కర్ లో నూనె వేసి ఉల్లిపాయలను వేయాలి. అవి వేగిన తరువాత అల్లంవెల్లుల్లిముద్దను వేయాలి. ఈలోగా చికెన్ ముక్కలకు అల్లవెలులి ముద్ద, కారం, పసుపు వేసి పట్టించాలి. దాన్ని వేగుతున్న నూనె లో వేసి కలిపి ఉడకనివ్వాలి. తరువాత గోంగూరను వేసి చికెన్ మసాలాను వేయాలి. అలా 10నిముషాలు ఉడకనివ్వాలి. అంతేనండీ గోంగూరచికెన్ రెడీ..
|