స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కించాలని నందమూరి నటసింహం బాలయ్య ఉవ్విళ్లూరుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన ఓ స్పెషల్ టీమ్‌ని కూడా ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించిన ముఖ్య అంశాలను చిత్రం కోసం ఎంపిక చేసే పనిలో ఆ టీమ్ ఆల్రెడీ వర్కింగ్‌లో ఉంది. అయితే ఈ సినిమాని తెరకెక్కించే దర్శకుడు ఎవరు? మిగిలిన నటీనటులు ఎవరన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు బాలయ్యకి. మరో పక్క డైరెక్టర్ తేజ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో సినిమాని తెరకెక్కించి, హిట్ కొట్టాడు. ఈ సక్సెస్‌తో అందరి దృష్టిలోనూ పడ్డాడు. అలాగే బాలయ్య దృష్టిలో కూడా తేజ ఉన్నట్లు తెలియవస్తోంది. తేజ - బాలయ్య కాంబినేషన్‌లో సినిమా అంటూ పబ్లిసిటీ కూడా బాగానే జరుగుతోంది. ఈ విషయాన్ని తేజ దగ్గర ప్రస్థావిస్తే ఎన్టీఆర్ గొప్ప మహానుభావుడు.
అంతటి గొప్ప మహానుభావుని జీవిత చరిత్రని తెరకెక్కించే అవకాశం నాకొస్తే అంతకన్నా అదృష్టవంతుడు మరొకడుండడు. ఖచ్చితంగా నేను ఆ అవకాశాన్ని స్వీకరిస్తాను.. అని తేజ అన్నారు. అంటే డైరెక్టర్ తేజ, బాలయ్యతో స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించేందుకు సుముఖంగా ఉన్నట్లే. ఇక ఫైనల్ డెసిషన్ బాలయ్యదే. అయితే బాలయ్య మాత్రం ఈ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా, మరో పక్క సెన్సేషనల్ డైరెక్టర్ వర్మ తానే ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కిస్తానంటూ, అఫీషియల్‌గా టైటిల్ కూడా అనౌన్స్ చేసేశాడు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' టైటిల్‌తో వర్మ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ రెండింటిలో ఏది పట్టాలెక్కుతుంది? బాలయ్య డైరెక్టర్ ఎవరు? అనేది తేలాల్సి ఉంది.
|