రామ్‌చరణ్ కొత్త సినిమా 'రంగస్థలమ్ 1985'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం. 1985 కాలం నాటి లవ్ స్టోరీని ఈ సినిమాలో సుకుమార్ చూపించనున్నారు. ఇదో ప్రయోగాత్మక చిత్రమన్న సంగతి తెలిసిందే. సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. కథా, కథనాలన్నీ చాలా కొత్తగా చూపించబోతున్నాడు సుకుమార్. రామ్‌చరణ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాకి స్పెషల్‌గా గ్లామర్ యాడ్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. అదేంటి హీరోయిన్ అయిన సమంతే డీ గ్లామర్ రోల్‌లో నటిస్తోంది. అలాంటిది గ్లామర్ ఎక్కడి నుండి వస్తుందనుకుంటున్నారా? ఐటెం గ్లామర్. ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఉండబోతోందట. అందులో ముద్దుగుమ్మ పూజా హెగ్దే నటిస్తోందట. ఇదే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ హాట్ టాపిక్. ఆ కాలంలో ఐటెం సాంగ్‌ని సుకుమార్ ఎలా చూపిస్తాడో.
ఆ సాంగ్ తెరకెక్కించే విధానం, అందుకోసం క్రియేట్ చేసిన సీన్ సిట్యువేషన్స్ అన్నీ చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఇటు సుకుమార్‌కీ, అటు రామ్‌చరణ్‌కీ వెరీ వెరీ స్పెషల్. అలాగే సమంతకు కూడా. ఎందుకంటే తొలిసారిగా సమంత, రామ్‌చరణ్‌తో జత కడుతోన్న సినిమా ఇది. పూజా హెగ్దే ఐటెం సాంగ్ గాసిప్‌లో నిజమెంతుందో తెలీదు కానీ, ఒకవేళ ఉండి ఉంటే, అది సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పొచ్చు. 1985 కాలం అంటే సెల్‌ఫోన్స్, ఇంటర్‌నెట్స్ వంటి సదుపాయాలేమీ లేని కాలం. ఆ కాలంలోని స్టోరీతో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలూ, ఆశక్తీ ఉన్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|