1) హిమాచల్, గుజరాత్ లలో ఎన్నికల నగారా మోగింది....అప్పటికే రసకందాయంలో ఉన్న రాజకీయం మరింత వేడెక్కింది....హామీల వర్షం జోరందుకుంది....అందులో ఆచరణకు సాధ్యం కానివీ, అమలుకు నోచుకోనివీ కోకొల్లలనేది జగమెరిగిన సత్యం....డబ్బులు, మద్యం పంచి ఓటర్లను లోబరుచుకొనే విష సంస్కృతికి అన్ని పార్టీలూ ఇకనైనా చరమగీతం పాడాలి..ఎదుటి పార్టీల మీద విమర్శల కంటే ముందు తామేం చేయాలనుకుంటున్నామో స్పష్టంగా ప్రజలకు హామీ ఇవ్వాలి...మారాల్సింది రాజకీయ నాయకులే...
2) వాళ్ళు మారరు...మనమే మార్చాలి...మనకెలాంటి నాయకులు కావాలో ఎన్నుకోనే అధికారం మన ప్రజాస్వామ్యం మనకిచ్చింది...తాయిలాలకు ఓట్లమ్ముకునే మనస్తత్వం నుండి బయటకు రావాలి....మనకింత ఇచ్చి ఓట్లు వాళ్ళు కొనుక్కుంటే, అధికారంలోకొచ్చాక లంచాల రూపంలో తిరిగి మననుంచే సంపాదిస్తూంటే ఇదేమని అడిగే హక్కు మనకుండదు...అభ్యర్థి నేపథ్యం, నిజాయితీ, సమర్థత పలు అంశాలకు విలువనిచ్చి ఓటుకున్న పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మనదే.....మారాల్సింది ప్రజలే.....
పై రెండింట్లో ఏది కరెక్ట్?
|