Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

లండన్‌ బాబులు చిత్ర సమీక్ష

london babulu movie review

చిత్రం: లండన్‌ బాబులు 
తారాగణం: రక్షిత్‌, స్వాతి, అలీ, సత్య కృష్ణ, సత్య, ధన్‌రాజ్‌, మురళీ శర్మ, అజయ్‌ ఘోష్‌, రాజా రవీంద్ర తదితరులు 
సంగీతం: కె. 
సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె నాయుడు 
దర్శకత్వం: బి.చిన్నికృష్ణ 
నిర్మాత: మారుతి 
నిర్మాణం: ఏవీఎన్‌ స్టూడియో 
విడుదల తేదీ: 17 నవంబర్‌ 2017 
క్లుప్తంగా చెప్పాలంటే 
ఇంట్లో కష్టాల కారణంగా ఎలాగైనా దుబాయ్‌కి వెళ్ళి డబ్బు బాగా సంపాదించెయ్యాలనుకునే కుర్రాడు గాంధీ (రక్షిత్‌). వీసా, పాస్‌ పోర్ట్‌ కోసం హైద్రాబాద్‌ వచ్చి, ఓ బ్రోకర్‌ని కలుస్తాడు. వీసా పెళ్ళయినవాళ్ళకయితే త్వరగా వస్తుందనే ఆలోచనతో, పాస్‌పోర్ట్‌ అప్లికేషన్‌లో భార్య పేరు సూర్యకాంతం అని రాస్తాడు. అక్కడితో అతనికి సమస్యలు స్టార్ట్‌. మరి, పాస్‌పోర్ట్‌లో సూర్యకాంతం అనే పేరు తీయించడానికి గాంధీ పడే కష్టాలేంటి? సూర్యకాంతం ఎవరు? గాంధీ, లండన్‌ ప్రయాణం ఏమయ్యింది? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది. 

మొత్తంగా చెప్పాలంటే 
హీరో రక్షిత్‌కి ఇదే తొలి సినిమా. అయినాసరే బాగానే చేశాడు. అక్కడక్కడా ఇంకొంచెం 'ఇంప్రవైజేషన్‌' అవసరం. చూడ్డానికి బాగానే ఉన్నాడు. తొలి సినిమాకి మంచి మార్కులేయించుకోవడం చిన్న విషయం కాదు. 

హీరోయిన్‌ స్వాతి నటనలో ఆరితేరిపోయింది. ఆమె అలా అలా తనకిచ్చిన పాత్రలోకి ఒదిగిపోయింది. ఆమె నటన, ఆమె అందం ఆకట్టుకుంటాయి. కమెడియన్‌గా నవ్వించడంలో సిద్ధహస్తుడన్పించుకున్న ధన్‌రాజ్‌, సెంటిమెంట్‌తో ప్రేక్షకులకి కంటతడిపెట్టించేస్తాడు. సత్య కామెడీ సినిమా మొత్తానికీ ప్రధాన ఆకర్షణ. డైలాగ్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌లో సత్తా చాటాడు. అలీ, సురేఖవాణి కాంబో వర్కవుట్‌ అయ్యింది. అజయ్‌ ఘోష్‌, మురళీ శర్మ తమ తమ పాత్రల్లో రాణించారు. 

ఓ కొత్త పాయింట్‌తో సినిమాని సరదాగా తీసుకెళ్ళిపోవాలని దర్శకుడు ప్రయత్నించాడు. అందులో చాలావరకు సఫలమయ్యాడు కూడా. కథ కొంచెం కొత్తదనంతో కూడుకున్నదే. కథనం ఆకట్టుకుంటుంది. డైలాగ్స్‌ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బావుంది. పాటలు వినడానికీ తెరపై చూడ్డానికీ బాగానే ఉన్నాయి. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరం అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఓకే. నిర్మాణపు విలువల విషయంలో ఎక్కడా రాజీపడలేదు. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి హెల్ప్‌ అయ్యాయి. 

ఇంట్రెస్టింగ్‌ పాయింట్స్‌తో, ఎంటర్‌టైన్‌మెంట్‌ని జోడించి వస్తోన్న చిన్న సినిమాలు చాలావరకు సక్సెస్‌ అవుతున్నాయి. ఎక్కువగా ఇలాంటి సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ కీ రోల్‌ పోషిస్తోంది. ఇక్కడా ఈ సినిమాకి దర్శకుడు ఎంటర్‌టైన్‌మెంట్‌ని బాగానే ప్లాన్‌ చేసుకున్నాడు. అది బాగా వర్కవుట్‌ అయ్యింది కూడా. కథనం ఆసక్తికరంగా సాగిపోయేలా సన్నివేశాలు రాసుకోవడంతో ప్రేక్షకుడికి పెద్దగా బోర్‌ కొట్టించదు. ఓవరాల్‌గా ఓ సరదా సినిమా చూశామన్న భావన కలుగుతుంది. కొత్తదనం పరంగానూ ఓకే. అక్కడక్కడా సాగదీసే కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే మంచి ఎంటర్‌టైనింగ్‌ మూవీగానే అన్పిస్తుంది. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
లండన్‌బాబులు బాగానే నవ్వించారు 
అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka