Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

జయజయదేవం - - డా. ఎస్. జయదేవ్ బాబు

 

 

 

 

ఒక పరిచారిక: నీ పేరు 'రంభ' గా మార్చుకున్నావా? నువ్వేమైనా దేవలోక కన్యవా??
రెండో పరిచారిక: నన్ను చూసి రాజుగారు మెచ్చారు!!

 

 

................................


 మంత్రి: మహారాజా, మన రాజ్యం లో ప్రజల మీద సంతాన లక్ష్మి అనుగ్రహం , ధాన్య లక్ష్మి ఆగ్రహం ఎక్కువైంది ప్రభో!
రాజు: అంటే?
మత్రి: సంతానాభి వృద్ధి , పంట నష్టం విపరీతం గా జరుగుతున్నాయి మహారాజా!!

 

................................
 

రాజగురు: నిందితుడు, శిక్షా శాసనం రాసి, ప్రకటిస్తేనే, శిక్షకి ఒప్పుకుంటానని పట్టుబడుతున్నాడు రాజా!!
మహారాజు: అది సరైన పద్ధతే కదా?
రాజగురు: కానీ శాసనం రాసిన మరుక్షణం , శాసన పత్రం మీది అక్షరాలు మటుమాయం అవుతున్నాయి. శాసనం ఈ పాటికి వంద సార్లకు పైగా తిప్పి తిప్పి రాసి అలిసిపోయాం రాజా!!
మహారాజు: కారణం?
రాజగురు: (రాజు గారి చెవైపుకి వంగి) నిందితుడికి మంత్ర శక్తులున్నాయట రాజా!!


................................
 

వెయ్యేళ్ళ తపస్సు ఋషి: నా తపస్సు భంగం గావించడానికి, నిన్ను బ్రహ్మ గారు పంపించారా?
తిలోత్తమ: అవును మహర్షీ! కనుక మీరు నన్ను పెళ్ళిచేసుకోండి!!
వెయ్యేళ్ళ తపస్సు ఋషి: చేసుకుంటాను గానీ, పెళ్ళి బ్రహ్మ గారి సంకషం లోనే జరగాలి!! ఆయన్ని రమ్మను!!
తిలోత్తమ: ఆయన రారు!!
వెయ్యేళ్ళ తపస్సు ఋషి: ఆయన్ని ప్రత్యక్షం చేసుకోవాలనేగా నా తపస్సు?
తిలోత్తమ: చచ్చాను... నేను తిరిగి దేవలోకానికి వెళ్ళిపోతాను!!  
వెయ్యేళ్ళ తపస్సు ఋషి: వెళ్ళు! మర్యాదగా ఆయన గార్ని నాకు ప్రత్యక్షం కమ్మను...పో!!  

................................

 

రాజు: అంత:పుర రహస్య మార్గాలని కాపలా కాసేవాళ్ళు ఒక్కడైనా కనిపించరేం?
మంత్రి: వాళ్ళని ఉద్యోగాల్లోంచి తీసేశాం మహారాజా?
రాజు: కారణం?
మంత్రి: ఆ వెధవలు తమ ప్రియురాళ్ళని బైటి నుంచి రహస్యంగా రప్పించుకుని కులుకుతున్నారు ప్రభూ!
రాజు: అందులో తప్పేమిటీ?
మంత్రి: ఆ ప్రియురాళ్ళలో కొందరు మీకు చెందిన ప్రియురాళ్ళు ప్రభూ!

................................

 

 సుందరి: నేను బ్రహ్మచర్యము నాచరించే రాజకుమారుడ్నే వివాహమాడెదను!
సుందరి స్నేహితురాలు: రాజ వంశీయులలో బ్రహ్మచారులు అరుదు!
సుందరి: ఐనచో... నేనొక ముని కుమారుని పెళ్ళిచేసుకొనెదను!!
సుందరి స్నేహితురాలు: మునికుమారులు కఠోర బ్రహ్మచారులు! పెండ్లికొప్పుకొనరు!!
సుందరి: అహో..! నన్ను కన్నె చెరనుండి విముక్తిచేయువారెవరు??
పురుష అశరీరవాణి: నేనున్నాను... చింతేల బాలా...
సుందరి స్నేహితురాలు:  అదెవరనుకునేవు... దేవేంద్రుడు సుమా! పారిపోదాం పద!!


 

................................

 

మహారాణి: దారి ఎగుడు దిగుడుగా వున్నట్లుందే?
మహారాజు: దారి బాగానే వుంది! పల్లకీ మోసేవాళ్ళలో ఒకడు పొట్టి!!

 

.

................................
 

రాణి రత్నప్రభ: మహారాజా, నేను సతీ సహగమనం చేయడానికి నిశ్చయించుకున్నాను.
రాజ శూర సిం హ: అది జరగదు మహారాణీ! నిన్ను కారాగారం లోకి తోసి, మొసళ్ళకి ఎరగా వేసి, నేను రెండో పెళ్ళి చేసుకో బోతున్నానుగా?!

 

................................

 

 ఒకడు: ఆ మాయ తివాసీ ఎక్కితే ఏడు సముద్రాలు సులభంగా దాటవచ్చు!
రెండోవాడు: ఆ తివాసీ ఎక్కడ దొరుకుతుంది?
ఒకడు: ఏడు సముద్రాలు దాటి వెళ్ళితే , అక్కడుంది!!

 

................................

 

మహా మంత్రి: మహా ప్రభో, వరద తాకిడికి, మన రాజ్యం లోని నగరాలూ, పల్లెలూ, కోట్ల బురుజులూ, నీట మునిగి అంతా అతలాకుతలంగా మారింది!
మహారాజు: ఐతే శతృ సేనలు మన మీద దాడి చేయలేరన్నమాట! సంతోషించాం మహామంత్రీ!! 

మరిన్ని శీర్షికలు
chamatkaaram