మేష రాశి : ఈవారం మొత్తం మీద మీరు తీసుకొనే నిర్ణయాల్లో ఆరంభంలో కాస్త సందిగ్దత ఉంటుంది. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి మంచిది. వ్యాపారపరమైన విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు స్పష్టమైన వైఖరిని అవలంభిస్తారు. గతంలో మీకు రావల్సిన ధనం కాస్త ఆలస్యంగా వచ్చే ఆస్కారం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. కుటుంబంలో సభ్యుల నుండి వచ్చిన సూచనల విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తి ఉండకపోవచ్చును. కొన్ని కొన్ని విషయాల్లో సర్దుబాటు అవసరం.
వృషభ రాశి : ఈవారం మొత్తం మీద చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యం ఇస్తారు. తలపెట్టిన పనుల విషయంలో స్పష్టమైన ఆలోచన అలాగే కార్యాచరణ కలిగి ఉండుట మంచిది. వ్యాపారపరమైన విషయంలో పెద్దలతో మీ ఆలోచనలను పంచుకుంటారు. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు లభిస్తాయి, కాకపోతే పనిభారం పెరుగుటకు అవకాశం ఉంది. మిత్రులతో కొన్ని కొన్ని విషయాల్లో నిక్కచ్చితగా ఉంటారు. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలకు అవకాశం ఉంది. గతంలో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు.
మిథున రాశి : ఈవారం మొత్తం మీద మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీవైన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు, పెద్దగా ఎవ్వరు చెప్పిన వినకపోవచ్చును. అనుకోకుండా చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైన పరిధుల దృష్ట్యా కాస్త ఆలోచించి ముందుకు కెళ్లడం మేలు. మీ మాటతీరు పెద్దలకు నచ్చకపోవచ్చును. సంతానం విషయంలో కీలకమైన ఆలోచనలు చేస్తారు. సమయాన్ని సాధ్యమైనంత మేర వృధా చేయకండి. విలువైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం సూచన. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మీ స్థాయిని పెంచుటకు అవకాశం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు.
కర్కాటక రాశి : ఈవారం మొత్తం మీద నూతన విషయాలకు సమయం ఇస్తారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకొనేవిషయంలో కాస్త తడబాటు పొందిన, చివరి నిమిషంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. జీవితభాగస్వామి నుండి వచ్చిన సూచనల విషయంలో అభిప్రాయం బేధాలు ఉండే ఆస్కారం ఉంది. తప్పని పరిస్థితుల్లో రుణం తీసుకొనే అవకాశం ఉంది , కాకపోతే కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడకుండా చూసుకోండి.
సింహ రాశి : ఈవారం మొత్తం మీద సమయం విషయంలో అలాగే చేపట్టు పనుల విషయంలో అశ్రద్ధ పనికిరాదు. కుటుంబంలో పెద్దలనుండి వచ్చిన సూచనలు మీలో నూతన ఆలోచనలకు శ్రీకారం చుడుతాయి. సామజికరంగాల పట్ల మక్కువను కలిగి ఉంటారు, వాటికి సమయం ఇస్తారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. మిత్రులను కలుసుకుంటారు.ఉంది.
కన్యా రాశి : ఈవారం తీసుకొనే నిర్ణయాల విషయంలో ఏమాత్రం తొందరపాటు పనికిరాదు. వ్యాపారపరమైన విషయాల్లో బంధువులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను మిత్రుల సహకారంతో పూర్తిచేస్తారు. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. రావాల్సిన సహకారం గతంలో మీకు ఉన్న పరిచయాల ద్వారా కలుగుతుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం వలన తప్పక మేలుజరుగుతుంది. తొందరపాటు వద్దు, అనుభవజ్ఞుల సూచనలు పాటించుట ఉత్తమం.
తులా రాశి :ఈవారం మొత్తం మీద సముద్రప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది , గతంలో విదేశీ ప్రయాణ ప్రయాత్నాలు చేసిన వారికి అనుకూలమైన సమయం. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో సమయపాలన పాటించుట ద్వారా సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. వ్యాపారపరమైన విషయాలలో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. మీ మాటతీరు మీయొక్క ఆత్మీయులకు నచ్చకపోవచ్చును, సరిచూసుకోండి.
వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేస్తారు. పెద్దలనుండి రావాల్సిన సహకారం లభిస్తుంది. బంగారం అలాగే డబ్బుల విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. మిత్రులనుండి వచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. ఎవ్వరితోను మాపట్టింపులకు వెళ్ళకండి. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో తోటిఉద్యోగులను కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది.
ధనస్సు రాశి : ఈవారం మొత్తం మీద అధికారులతో చర్చలు చేయుటకు అలాగే పెద్దలతో కలిసి నూతన పనులను మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. దస్త్రాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. చిన్న చిన్న విషయాలకే హైరానా పడే అవకాశం ఉంది , కాస్త స్థిమితంగా ఉండే ప్రయత్నం మేలు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. మీరు చేసిన ఆలోచనలను అలాగే నిర్ణయాలను ఎదుటివారికి తెలియజేయడంలో కాస్త ఇబ్బంది ఎదుర్కొంటారు. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి.
మకర రాశి : ఈవారం మొత్తం మీద సంతానపరమైన విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యం అయినా విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం దఫాలుగా అందుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది, భోజనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. జీవితభాగస్వామితో కలిసి దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఏ విషయంలో నైనా పాజిటివ్ ఆలోచనల్తో ముందుకు వెళ్ళుట సూచన. నలుగురిలో గతంలో మీరు చేసిన పనుల వలన గుర్తింపును పొందుతారు.
కుంభ రాశి : ఈవారం మొత్తం మీద పెద్దలనుండి గుర్తింపును అలాగే ప్రశంశలు పొందుతారు. వారై ఆలోచనలకు అనుగుణంగా నడుచుకునే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. ప్రయాణాల కోసం చేసిన ఆలోచనలు సత్ఫాలితాల కలుగజేస్తాయి. జీవితభాగస్వామితో అనుకోకుండా మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. చేపట్టిన పనులను మధ్యలో వదిలేసే అవకాశం ఉంది. గతంలో మీకు రహస్య పరిచయాలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది, జాగ్రత్త. విదేశీప్రయాణ ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. పూజాదికార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీన రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. పెద్దలతో మీకున్న పరిచయం వలన నూతన అవకాశాలు లభిస్తాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి రావోచ్చును. సంతనం విషయంలో కొంత ఆందోళన చెందుటకు ఆస్కారం కలదు. మిత్రులనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం వలన లబ్దిని పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. రుణపరమైన ఇబ్బందులు పెరుగుటకు అవకాశం ఉంది, జాగ్రత్త అవసరం.
|