Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
In 2018 we ...

ఈ సంచికలో >> శీర్షికలు >>

జయజయదేవం - - డా. ఎస్. జయదేవ్ బాబు

 

 

గురుకులం లో ఒక శిష్యుడు: మహా విష్ణువుకి దేవతలు వెళ్ళి మొరపెట్టుకుంటారు కదా... క్షీర సముద్రం లో అడుగుపెడితే వాళ్ళు మునిగిపోరా?
రెండో శిష్యుడు: పాల మీగడ తెట్టు మీద చీమలు తిరగడం నువ్వు చూళ్ళేదా? క్షీర సముద్రం లో మీగడ తెట్లుంటాయిరా!








రాజు కొలువు లో ఒక పౌరుడు: రాజూ, మంత్రీ ఒకరి జుట్టు మరొకరు పట్టుకు పోట్లాడుకుంటున్నారే?
ఇంకోపౌరుడు: రాజు గారి గొడ్లపాకలోంచి రెండు దున్నపోతులు మంత్రి గారి పొలంలో పొలం లో ప్రవేశించాయట! మంత్రి గారి పొలం లోంచి సాగునీటిని, రాజు గారు తమ పొలం లోకి మల్లించారట!!
మరో పౌరుడు:  వఠి దిక్కుమాలిన రాజూ,, మంత్రి..ఛీ !!

 

 



రాణిగారి అంతరంగిక మందిరం లో:
ఒక చెలికత్తె:
ఒశేవ్! రాణి గారు చీర కట్టుకోకుండా అటూ ఇటూ తిరుగుతున్నారే, మగ పురుగులు లోనికొచ్చేరు జాగ్రత్త!
రెండో చెలికత్తె: నిన్న చీనా వ్యాపారి, అగ్గిపెట్టెలో మడిచి  బహుకరించిన పట్టు చీర కట్టుకున్నారు, రాణిగారు! కళ్ళు పెద్దవి చేసి చూడవే బాబూ!!

 

 

కవిశేఖరుడి శిష్యుడు: తాళపత్రాల మీద రాసిన కవితలు రాలిపోయాయి!
కవిశేఖరుడు: విచిత్రం గా వుందే?
మరోశిష్యుడు: పొడి అక్షరాలతో రాసుంటాడు!!





వీధిలో ఒకడు: ఏనుగు మీద పల్లకీలో రాజుగారు కనిపించలేదే?
మరొకడు: మావటీడు స్థానం లో కూర్చుని తనే ఏనుగును తోలుతున్నారు చూడు!
ఇంకొకడు: మావటీడు ఏమయ్యాడు?
మరొకడు: రాణి గార్ని చూసి కన్నుకొడుతున్నాడని, మావటీని ఉద్యోగం లోంచి తీసేశారు, నీకు తెలీదా??



అహ్మద్: దీదార్ పట్టిన వాళ్ళలో ఒకరు రాజుగారులా వున్నారే?
మహమ్మద్: ఔను!
అహ్మద్: శవపేటికలో వున్నదెవరు?
మహమ్మద్: రాజుగారే!! దీదార్ పట్టింది, రాజుగారి ఆత్మ!!




ఒక యక్షుడు: ఆ గంధర్వుడ్ని శిక్షించారట తెలుసా?
ఇంకో యక్షుడు:: మధుపానం సేవించడానికి బదులు విప్పసారా తాగాడట!!






గురువరేణ్యుడు: శిష్యా, నీ చదువు పూర్తయింది! ఇంకా ఏమైనా నేర్చుకోవాలంటే కోరుకో!
శిష్య శిఖామణి: గురూ... మీ దివ్యదృష్టితో చూసి , నా భవిష్యత్తెలా వుంటుందో చెప్పండి!
(గురువు, కేక వేసి, తక్కిన శిష్యుల్ని రప్పిస్తాడు)

గురువరేణ్యుడు: ఒరేయ్ వీడ్ని చెట్టుకు కట్టేసి పారిపోకుండా కాపలా కాయండి!
శిష్య శిఖామణి: ఎందుకు గురూ?
గురువరేణ్యుడు:  నువ్వు గురుదక్షిణ ఎగ్గొట్టేసి , పారిపోయి పొరుగు రాజ్యం లో రక్షణ పొందుతావని, దూర దృష్టితో తెలుసుకున్నాను!!


మహారాజు:
ఈ రోజు మన నిలయ విద్వాంసుల గాన కచేరి వుందని తెలిసీ, సభకి ఒక్కరూ రాలేదే?
మహామంత్రి: ఆయనకి గొంతు నొప్పి కారణం గా పాడబోరని తెలుసుకుని జనం రాలేదు!
రాజు: ఆయన పాడకపోతే, బదులుగా నేను పాడుతాను కదా?
మహా మంత్రి: అది కూడా తెల్సుకుని ప్రజలు సభకు రాలేదు ప్రభూ!!

 

పార్వతి: చేదు నిజం అంటే అర్ధమేమిటి స్వామీ?
శివుడు: నా కంఠం!!  

మరిన్ని శీర్షికలు
prize-for-best-comment