సూపర్‌స్టార్ మహేష్‌బాబు సోదరి మంజుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'మనసుకు నచ్చింది'. ఫాలో యువర్ హార్ట్ అంటూ ఇంతవరకూ ఫస్ట్‌లుక్, టీజర్స్‌తోనే ఆహ్లాదమైన లవ్ స్టోరీ 'మనసుకు నచ్చింది' అనే ఫీలింగ్ క్రియేట్ అయ్యింది. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే, 'మనసుకు నచ్చింది' ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ అనడంలో అతిశయోక్తి కాదనిపిస్తోంది. యంగ్ హీరో సందీప్‌కిషన్, అందాల భామ అమైరా దస్తూర్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రమిది. త్రిథా చౌదరి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. నటిగా, నిర్మాతగా తన సత్తా చాటిన మంజుల ఈ సినిమాతో తొలి సారిగా దర్శకురాలిగా మారింది.
ఈ సినిమాని తెరకెక్కించేందుకు మంజుల చాలా కష్టపడిందట. ఆ కష్టంలోనే ఎంతో ఇష్టం, సంతృప్తి వెతుక్కున్నాననీ ఆమె చెప్పింది. నటిగా, నిర్మాతగా పొందలేని సంతృప్తి, దర్శకురాలిగా ఈ సినిమాతో తాను పొందాననీ, అన్ని వర్గాల వారిని ఈ సినిమా ఖచ్చితంగా అలరిస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తోంది మంజుల. ఇక హీరో సందీప్‌కిషన్‌కి 'మనసుకు నచ్చింది' ఓ మంచి సినిమా అవుతుందంటున్నారు. ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కిషన్‌కి 'మనసుకు నచ్చింది' ఓ రొమాంటిక్ హిట్ అవుతుందేమో చూడాలిక. క్యూట్ భామ అమైరా దస్తూర్ ట్రైలర్‌లో క్యూట్‌గా కనిపిస్తూనే, సో హాట్ అనిపిస్తోంది. హాట్‌నెస్సే కాదండోయ్, యాక్టింగ్‌కి మంచి స్కోపున్న క్యారెక్టర్‌లో అమైరా దస్తూర్ కనిపించనుందట. సందీప్ కిషన్, అమైరాదస్తూర్ జంట చూడముచ్చటగా అనిపిస్తోంది. మంజుల కూతురు, మహేష్‌బాబు మేనకోడలు అయిన జాహ్నవి ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఓ కీలకపాత్రలో జాహ్నవి కనిపించనుందట. జనవరి 26న అందరి మనసుల్ని దోచేందుకు 'మనసుకు నచ్చింది' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|