తెలుగులో 'గౌరవం', 'కొరియర్ బోయ్ కళ్యాణ్' సినిమాల్లో నటించిన బ్యూటీ యామీ గౌతమ్. తెలుగులో నటించిన రెండు సినిమాలూ ఈ ముద్దుగుమ్మకి ఆశించిన విజయాన్ని అందించలేదు. కానీ నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే హిందీలో ఈ బ్యూటీ 'కాబిల్' సినిమాలో నటించింది. హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో అంధురాలి పాత్రలో యామీ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తనను తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకొనేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందట. ఇమేజ్ మేకోవర్ కోసం ఇదిగో ఇలా హాట్ హాట్ ఫోటో సెషన్‌కి ఫోజిచ్చిందీ బ్యూటీ. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే, ఇవి కేవలం హాట్ ఫోటోస్ మాత్రమే కాదు. గాఢమైన ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి.. లోతుగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందది.
హాట్ హాట్ బికినీలో అమ్మడి అందాలు ఎంత మత్తెక్కిస్తున్నాయో, అలాగే ఆమె ముఖంలోని ఎక్స్‌ప్రెషన్స్ అదరహో అనిపిస్తున్నాయి ఈ తాజా పిక్స్‌లో. సోషల్ మీడియాలో ఇప్పుడీ భామ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతవరకూ ఎక్స్‌పోజింగ్‌కి కొంచెం దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇకపై తనలో హాట్‌నెస్‌ని బయటికి తీసుకొస్తానంటోంది. అందుకు పై ఫోటోలు జస్ట్ శాంపిల్ మాత్రమేనట. అయితే ఎక్కడా హద్దులు దాటబోనంటోంది. హద్దులు మీరని ఎక్స్‌పోజింగ్ ఆరోగ్యదాయకమే అని చిన్న మెసేజ్ కూడా ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. హాట్‌నెస్ తెరలు తెరిస్తే, ముద్దుగుమ్మల అవకాశాలకు కొదవే ఉండదు కదా. అందుకే తెలుగు, హిందీతో పాటు ఏ భాషలోనైనా మంచి అవకాశాలను వినియోగించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ సంకేతాలు పంపిస్తోంది. ప్రస్తుతం యామీ గౌతమ్ హిందీలో ఓ సినిమాలో నటిస్తోంది.
|