Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
leni poni peddarikaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (సెప్టెంబర్ 27 - అక్టోబర్ o3) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు శుక్ర,శనివారాల్లో ఇష్టమైన వారిని కలుస్తారు వారితో సంతోషంగా గడుపుటకు అవకాశం కలదు. చేపట్టిన పనులలో ధనలాభంను కలిగి ఉంటారు. మనోధైర్యంతో నూతన పనులను ఆరంభిస్తారు. ఆది,సోమ,మంగళవారాల్లో బంధుమిత్రులతో స్వల్ప మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది. కావున నిదానంగా వ్యవహరించుట మేలు. ప్రయత్నాలు కొంత ఆలస్యం అయ్యే అవకాశం కలదు.బుధ,గురువారాల్లో స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం కలదు తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. తలపెట్టిన పనులు మధ్యలో ఆగిపోవుటకు అవకాశం ఉంది. ఒకవార్త ఒకింత ఆందోళన కలిగించేదిగా ఉంటుంది. వారంమొత్తం మీద తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు అవకాశం కలదు. ధనధాన్య వృద్దిని పొందుటకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాలు ఆరంభించుటకు అవకాశం కలదు. చేపట్టిన పనుల మూలాన మాత్రం శ్రమ పెరుగుటకు అవకాశం ఉంది. అధికారుల మూలాన పనిఒత్తిడిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త. అకారణంగా భయంను కలిగి ఉండే అవకాశం ఉంది.      

వృషభ రాశి
ఈవారం మీరు శుక్ర,శనివారాల్లో ధనంకు సంబంధించిన విషయాల్లో మాత్రం నిదానంగా వ్యవహరించ సూచన. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ద చూపకండి. ఆది,సోమ,మంగళ వారాల్లో నూతన విషయాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. ఇష్టమైన వారిని కలిసే అవకాశం కలదు వారితో సమయాన్ని గడుపుటకు ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. బుధ,గురువారాల్లో బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనులలో చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది జాగ్రత్త. వారం మొత్తంమీద ప్రయాణాలలో ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది ఒకటికి రెండు సార్లు ఆలోచించి ప్రయాణాలు చేపట్టుట మంచిది. నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు కుటుంబంలో అందరిని సంప్రదించే ప్రయత్నం చేయుట ఉత్తమం. ఇష్టమైన పనులను ఆరంభించుట యందు ఆసక్తిని కలిగి ఉంటారు. నూతన వస్త్రప్రాప్తిని కలిగి ఉండే అవకాశం ఉంది. చర్చాసంభందమైన విషయాల్లో పాల్గొంటారు,విధ్యాసంభందమైన విషయాల్లో పాల్గొనే అవకాశం కలదు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో శ్రమను పొందుటకు అవకాశం కలదు.  

మిథున రాశి
ఈవారం మీరు శుక్ర,శనివారాల్లో భోజన సౌఖ్యాన్ని కలిగి ఉంటారు. ధనంకు సంబంధించిన విషయాల్లో లాభం పొందుటకు అవకాశం కలదు. ఉత్సాహం కలిగి ఉండి నూతన పనులను చేపట్టే ఆస్కారం కలదు. ఆది,సోమ,మంగళ వారాల్లో భోజనం విషయంలో మాత్రం అశ్రద్ద వద్దు. అనారోగ్యం కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండుట మంచిది. బుధ,గురు వారాల్లో ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో లాభం పొందుతారు,గతంలో చేపట్టిన పనులను తరచి చూసుకోవడం మంచిది. వారం మొత్తంమీద తలపెట్టిన పనులు నిదానంగా సాగుతాయి నూతన పనులను ఆరంభించక పోవడం మంచిది. ప్రయాణాలలో ఆటంకాలు కలుగుటకు ఆస్కారం కలదు. స్నేహితులతో కలిసి చేయుపనులలో జాగ్రత్తగా ఉండుట వలన మేలుజరుగుతుంది. అనుకోని ఖర్చులు కలుగుతాయి. మాతృ సంబంధమైన విషయాల్లో బాగుంటుంది. వారి తరుపున మేలు జరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకొనే అవకాశం కలదు. ఉద్యోగంలో సాధ్యమైనంత వరకు నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. అధికారులతో చిక్కులు తప్పక పోవచ్చును. భోజనం విషయంలో ప్రత్యేకమైన దృష్టిని కలిగి ఉంటారు అందుకోసం ప్రాముఖ్యతను ఇచ్చే అవకాశం ఉంది. 
 

కర్కాటక రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో తలపెట్టిన పనులలో శ్రమను కలిగి ఉంటారు. కొద్దిగా ఖర్చులు పెరుగుటకు ఆస్కారం ఉంది. ఆలోచనలు అదుపులో ఉండకపోవచ్చును. ఆది,సోమ,మంగళ వారాల్లో పనులలో ఉత్సాహం కలిగి ఉండి వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. భోజన సౌఖ్యం కలిగి ఉంటారు మృష్టాన్న భోజన ప్రాప్తిని కలిగి ఉంటారు. బుధ,గురువారాల్లో మాటలను పొదుపుగా వాడుట సూచన. సరైన ఆలోచనలు చేయుట వలన మేలు జరుగుతుంది. అనారోగ్యం మూలాన సమస్యలు తప్పక పోవచ్చును. వారం మొత్తంమీద బంధుమిత్రులతో కలిసి సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో లాభం పొందుతారు. సంతానమూలక సౌఖ్యం కలిగి ఉంటారు. కుటుంబంలో నిదానంగా వ్యవహరించుట వలన మేలు జరుగుతుంది. తలపెట్టిన ప్రయత్నాలలో విజయం పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుటకు అవకాశం ఉంది. మాతృ సంబంధమైన వారినుంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ప్రయాణాలు చేయవలసి రావచ్చును వాటిమూలాన స్వల్ప ఇబ్బందులు తప్పకపోవచ్చును. పెద్దలతో పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారి మూలాన లాభం పొందుతారు. ఉద్యోగంలో ప్రతిపనిని ఒకటికి రెండు సార్లు ఆలోచింఛి ఆరంభించుట మంచిది.
  

సింహ రాశి
ఈవారం మీరు శుక్ర,శనివారాల్లో సంతోషంగా గడుపుటకు అవకాశం కలదు నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. బంధువుల గృహంలో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. భోజనసౌఖ్యం కలిగి ఉంటారు. ఆర్థికపరమైన లాభం పొందుటకు అవకాశం కలదు. ఆది,సోమ,మంగళ వారాల్లో అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఖర్చులు అదుపులో ఉండకపోవచ్చును. చేపట్టిన పనులలో ఆందోళన ఉంటుంది. బుధ,గురువారాల్లో మిత్రులను కలుస్తారు వారితో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. స్త్రీ /పురుష సౌఖ్యం పొందుటకు అవకాశం ఉంది. శరీర సౌఖ్యానికి ప్రాముఖ్యతను ఇస్తారు. వారం మొత్తంమీద వ్యాపారంలో నూతన ఆలోచనలు చేయకండి నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. స్నేహితుల మూలాన చిన్న చిన్న ఇబ్బందులు పొందుటకు అవకాశం కలదు. సంచారం చేయుట మూలాన అనారోగ్య సమస్యలు కలుగుతాయి తగిన జాగ్రత్తలు పాటించుట ఉత్తమం. దేశసంచారం చేయుటకు  అవకాశం కలదు.  పనులలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన. ధార్మిక పరమైన కార్యక్రమాలను చేపట్టుటకు ఆస్కారం కలదు వాటికి సమయాన్ని కేటాయిస్తారు. వ్యాపారంలో స్వల్పధననష్టం కలుగుటకు అవకాశం కలదు జాగ్రత్త. 

 

కన్యా రాశి
ఈవారం మీరు శుక్ర,శనివారాల్లో ప్రయత్నకార్యములలో విజయం పొందుటకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాలలో విజయం పొందుటకు అవకాశం కలదు. ఇష్టమైన పనులను పూర్తిచేస్తారు. ఆది,సోమ,మంగళ వారాలలో ఆర్థికపరమైన లాభం పొందుటకు అవకాశం ఉంది నూతన అవకాశాలు కలిసి వస్తాయి. బంధువులతో కలిసి సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. మానసికసౌఖ్యంను కలిగి ఉంటారు. బుధ,గురువారాల్లో అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది వాటిని అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. శారీరకశ్రమను పొందుటకు అవకాశం కలదు. వారంమొత్తం మీద పనిఒత్తిడి మూలాన సమయానికి భోజనం చేయలేరు. బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుటకు అవకాశం కలదు. అనారోగ్యం కలుగుటకు ఆస్కారం కలదు కావున తగిన జాగ్రత్తలు పాటించుట మూలాన మేలుజరుగుతుంది. మనోదైర్యంను కలిగిఉండి నూతన పనులను చేపడుతారు. నూతన అవకాశాలు కలుగుటకు అవకాశం ఉంది. మంచిపరిచయాల మూలాన మేలుజరుగుతుంది. క్రయవిక్రయాలు లాభిస్తాయి. బంధువులతో కలిసి నిదానంగా పనులను ఆరంభించుట మంచిది. కుటుంభంలో సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు.

తులా రాశి
ఈవారం మీరు శుక్ర, శని వారాలలో కుటుంబంలో నిదానంగా వ్యవహరించ సూచన. లేనట్లయితే వివాదాలు కలుగుటకు అవకాశాలున్నాయి. ఉద్యోగములో సమస్యలు తప్పక పోవచ్చును. వస్త్ర నష్టమును పొందుతారు. ఆది, సోమ, మంగళ వారాలలో తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేయుటకు అవకాశం కలదు. బంధువుల యెడల ప్రీతిని కలిగి ఉండి వారికి సమయాన్ని కేటాయిస్తారు. బుధ, గురు వారాలయందు మధుర పదార్ధములయందు ఆసక్తిని కలిగిఉంటారు. బంధు గృహమునందు భోజన సౌఖ్యము కలదు. వారం మొత్తం మీద తరుచూ ప్రయాణాలను చేయుటకు అవకాశం కలదు. వివిధ రూపములుగా ఖర్చులను కలిగి ఉంటారు. అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. మీ ఆప్త బంధువులకు అనారోగ్య సమస్యలు కలుగుతాయి. సమయానికి భోజనం చేయుట మంచిది. అధిక సంచారం చేయుట వలన శ్రమను పొందుతారు. ఆశించిన ఫలితాలు రాకపోవచ్చును. ఉద్యోగ స్థానంలో చిన్న చిన్న సమస్యలు తప్పక పోవచ్చును. బంధువులతో మాట పట్టింపులకు పోకండి. ఆర్ధికపరంగా బాగానే ఉంటుంది. నూతన అవకాశాల కోసం శ్రమించుట వలన మేలు జరుగుతుంది.


వృశ్చిక రాశి
ఈ వారం మీకు శుక్ర, శని వారాలలో అనారోగ్య సమస్యలు కలుగుతాయి. సమయానికి భోజనం చేయుట మంచిది. పరిశుభ్రమైన ఆహారం భుజించుట వలన ఆరోగ్యాన్ని కొంత వరకు కాపాడుకోగలుగుతారు. చేసే ప్రతి పనిలోనూ ఆచితూచి వ్యవహరించుట మంచిది. ఆది, సోమ, మంగళ వారాలలో కుటుంబంలో మనస్పర్ధలు కలుగుటకు అవకాశం ఉంది. నచ్చని ప్రదేశంలో నివసించాల్సి రావొచ్చు. ఉద్యోగములో సమస్యలు తప్పకపోవచ్చును. బుధ, గురువారాలలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. తలపెట్టిన పనులను నిదానంగానైనా పూర్తి చేస్తారు.  ఇష్టమైన పనులను పూర్తి చేయుటనందు ఆసక్తిని కలిగి ఉంటారు. వారం మొత్తం మీద అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలు జరుగుతుంది. మంచి పనులను చేయుటనందు ఆసక్తిని చూపించే ప్రయత్నం చేయండి. ధనలాభం ఉంటుంది. కాకపోతే జాగ్రత్త అవసరం. అనారోగ్యము వలన ఇబ్బందులు తప్పకపోవచ్చును. అకారణంగా కలిగే కలహములు ఇబ్బందుల పాలు చేస్తాయి. మనో విచారమును పొందుతారు. అధికారుల వలన మాట పడవలిసి రావోచ్చును. నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. చోరుల వలన బాధలు పొందుటకు అవకాశం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించాలి.


ధనస్సు రాశి
ఈ వారం మీరు శుక్ర, శని వారాలలో ఆర్ధికపరమైన విషయాలలో ధనలాభమును పొందుతారు. అయినను నిదానంగా వ్యవహరించ సూచన. సౌఖ్యవంతమైన జీవితమునకు ప్రాధాన్యతనిస్తారు. ఆది, సోమ, మంగళవారాలలో అజీర్తి మూలాన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. శారీరక శ్రమను పొందుతారు. బుధ, గురువారాలలో కోపమును అదుపులో ఉంచుకొనే ప్రయత్నమును చేయండి. కుటుంబంలో సర్దుకుని పోవుట వలన మేలు చేకూరుతుంది. వారం మొత్తం మీద బంధు మిత్రులతో కలిసి నూతన ఆలోచనలు చేపడతారు. అధికారులతో కలిసి ప్రయత్నాలను మొదలు పెట్టి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును. గతంలో తీసుకున్న ఋణముల వలన మాటలు పడాల్సి రావొచ్చు. తలపెట్టిన పనులకు మధ్యలో అవరోధాలు కలిగే సూచనలున్నాయి. బంధువుల మూలాన ఆర్ధికపరమైన విషయాలలో ధన లాభమును పొందుతారు. ఉత్సాహమును కలిగి ఉండి నూతన పనులను చేపట్టుట ఎంతో మేలు. ఇష్టమైన పనులను పూర్తి చేసే అవకాశాలున్నాయి. మధుర పదార్ధములయందు ఆసక్తిని కలిగి ఉంటారు. కావున భోజన విషయంలో శ్రద్ధను తీసుకోవాల్సి ఉంటుంది.

మకర రాశి
ఈ వారం మీరు శుక్ర, శని వారాలలో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. ఆర్ధికపరమైన విషయాలలో లాభం ఉంటుంది. ఆనందమును పొందుతారు. ఆది, సోమ, మంగళ వారాలలో చేపట్టిన పనుల వలన ధనలాభం ఉంటుంది. మంచి పేరు సంపాదించుకునేందుకు చేయు ప్రయత్నాలు సామాన్య ఫలితాలను కలుగచేస్తాయి. బుధ,గురువారాలలో అనారోగ్య సమస్యలు కలుగుతాయి. అకాల భోజనం చేయుటకు అవకాశం కలదు. వారం మొత్తం మీద అకారణంగా కలహములను పొందుతారు. అనుకోని ఖర్చులు ఉంటాయి. అపకీర్తిని తెచ్చుకునే అవకాశం ఉంది. అశుభ వార్తను వినే సూచనలున్నాయి. తీరని బాధకు లోనవుతారు. మానసికంగా ధృడంగా ఉండటం అవసరం. తలపెట్టిన పనులలో ఆలస్యం ఉంటుంది. కుటుంబంలో నిదానంగా వ్యవహరించటం అవసరం. మనోవిచారాన్ని కలిగి ఉంటారు. అగ్నిమూలక భయానికి లోనవుతారు. అధికారులకు మీరు చేపెట్టే పనులు నచ్చకపోవచ్చును. మీ అనుకున్న వారితో విభేదాలు కలుగుతాయి. మీ వ్యతిరేక వర్గం నుండి ఇబ్బందులు తప్పకపోవచ్చును.


కుంభ రాశి
ఈ వారం మీరు శుక్ర, శని వారాలలో పనులను నిదానంగా చేయుట మంచిది. ఏమాత్రం తొందరపాటు గా వ్యవహరించక పోవటం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించుట వలన మేలు కలుగుతుంది. ఆది, సోమ, మంగళ వారాలలో అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. ఆర్ధికపరమైన విషయాలలో లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. బుధ, గురువారాలో చేపట్టిన పనుల వలన సమాజంలో గుర్తింపు లభిస్తుంది. శరీర సౌఖ్యమునకు ప్రాధాన్యతనిస్తారు. వారం మొత్తం మీద శత్రువుల  వలన ఇబ్బందులు పొందుతారు. అయిష్టమైన వార్తను వింటారు. ఊహించని ఫలితాలు కలుగుటకు అవకాశాలున్నాయి. ఇతరులకు సేవ చేయవలెనన్న కోరికను కలిగి ఉన్నప్పటికీ పనులు మీరు ఆశించినంత వేగంగా జరుగకపోవచ్చును. వస్త్ర లాభమును కలిగి ఉంటారు. ఉద్యోగములో మీ ఆలోచనలకు  వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. సర్దుబాటు విధానంలో నడువుట అన్ని విధాలా శేయస్కారం. కుటుంబంలో మంచి పేరును కలిగి ఉంటారు. అధికారులలో గుర్తింపు ఉంటుంది. గురు భక్తిని కలిగి ఉండుట పెద్దల మాటను వినుట వలన మంచి జరుగుతుంది.  

మీన రాశి
ఈ వారం మీరు శుక్ర, శని వారాలలో చేపట్టిన ప్రయత్నాలు మంద కొడిగా సాగుతాయి. ప్రయత్న కార్యాలలో ఆటంకాలు కలుగుతాయి ఆది, సోమ, మంగళ వారాలలో అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. తలపెట్టిన పనులు ముందుకు సాగకపోవచ్చును. బుధ, గురువారాలలో కుటుంబ సభ్యులతో కలిసి నూతన ఆలోచనలు చేస్తారు. ఆర్ధికపరమైన విషయాలలో లాభం ఉంటుంది. ఇతరులకు సేవ చేయాలనే తలంపును కలిగి ఉంటారు. వారం మొత్తం మీద బంధుమిత్రులతో మనస్పర్ధలు ఏర్పడుతాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. తలపెట్టిన పనులలో ఉత్సాహం చివరి వరకు ఉండకపోవచ్చును. అకాల భోజనం చేస్తారు సమయానికి భోజనం చేయుట మంచిది. మీయొక్క మాటల్లో విశ్వసనీయతను ప్రశ్నించే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా మసలుకోవడం ఉత్తమం. స్థిరమైన ఆలోచనలు కలిగిఉండుట వలన తప్పక మేలుజరుగుతుంది. ప్రతిపనిని ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేపట్టుట అనేది సూచన. స్థానచలనంకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాలు ఆరంభించాలనే ఆలోచనను కలిగిఉంటారు. పెద్దల సూచనలు సలహాలను పాటించుట మంచిది. మిత్రులతో కలిసి సరదాగా గడుపుతారు విందులలో పాల్గొనే అవకాశం ఉంది. 

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
body launguage