Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> లవ్ ఈజ్ ఇన్జూరియస్ టు లైఫ్

love is injurious to life

“బాస్ ! రైవస్ కెనాల్లో ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ కుమారి పేరెంట్స్ మీ అప్పాయింట్ మెంట్ కోసం ఫోను చేస్తున్నారు.మీరింకా ఆఫీసుకు రాలేదని చెప్పాను.మీరు టైం చెపితే ..”

“అవినాష్ !ముందు మనం కేసు స్టడీ చేయాలి. టెల్ దెం టు కంబై త్రి మీన్ వైల్ అస్క్ స్టెల్లా అండ్ శిరీష టు గెట్ ఆల్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్. విజయవాడ పోలీస్ కమీషనర్ విజయ్ భాస్కర్ తో జాకీని మాట్లాడమని చెప్పు.నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్.”

“ఓకే బాస్!”

“వన్ మోర్ థింగ్.మన ఫ్రీలాన్సర్ రాధిక విజయవాడలోనే వుందా?వచ్చేసిందా?”

“ఇoకా అక్కడేవుంది బాస్!”

“కుమారి పేరెంట్స్ తో మన సంభాషణ రికార్డు చేసి తనకు ఫార్వార్డ్ చెయ్యి. ఈకేసు సాల్వ్ అయ్యేంతవరకూ రాధికను ఫార్చూన్ మురళీపార్క్ హోటల్లో  చెక్ ఇన్ చేయమని చెప్పు.మనకు కూడా రెండు రూమ్స్ రిజర్వ్ చేయించు. “

“ఓకే బాస్! ఐ విల్ టేక్ కేరాఫ్ ఎవ్విరి థింగ్.”

*******

“నమస్కారం బాలీసార్!నా పేరు దేవదానం ..నావైఫ్ మార్గరెట్..ఆత్మహత్య చేసుకున్నదని చెపుతున్న డాక్టర్ కుమారి   మా రెండో కూతురు.సార్ !నాకూతురు ఆత్మహత్య చేసుకోలేదు.దాన్ని అమానుషంగా ఆవిల్సన్ గాడి ఫ్యామిలీవాళ్ళే చంపేసుంటారు..”
“దేవదానం గారూ! మీరు యిప్పుడు యెంతబాధపడినా  ప్రయోజనం వుండదు.పోలీస్ డిపార్ట్మెంట్ ఆత్మహత్యని తేల్చేసారు.మీరేమో చంపారంటున్నారు.. “

“ఆప్రభువు సాక్షిగా చెపుతున్నాను సార్ ..విల్సన్ గాడి ఫాదర్ పొలిటీషియన్ .వాడే చంపించి ఉంటాడు.”

“ఓకే !నేను మీఆవేదనని అర్ధం చేసుకోగలను. కేసు ప్రూవ్ కావాలంటే  సాక్ష్యాలు అవసరం.చెప్పండి మీఅనుమానాలు సందేహాలు.”
“సార్!మాది అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.మాకు నలుగురు కుమార్తెలు. పెద్దమ్మాయి ఐఏయస్..రెండో అమ్మాయి కుమారి.మూడో అమ్మాయికూడా డాక్టరే.ఆఖరి అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజినీర్.ఆప్రభువు దయవలన ఆనందంగా సాగిపోతున్న మాజీవితాలలో కుమారి మరణంతో సైతాన్ పాదం మోపిoది బాలీ సార్.”

“మీకు తెలిసిన విషయాలు దాయకుండా చెప్పండి.”

“కుమారికి విల్సన్ చర్చ్ లో పరిచయమయ్యాడు.అవివాహితుడని నమ్మిoచాడు.ప్రేమించింది. మాకు విషయం తెలసి విల్సన్ కుటుంబం గురించి ఆరాతీస్తే వాడికి అయిదేళ్ళ క్రిందటే పెళ్ళయ్యిందని ఇద్దరు పిల్లలని తెలిసింది.కుమారిని హెచ్చరించాము.తను చాలా బాధ పడింది.పిజి చేస్తానని విజయవాడకు దూరంగా వెళ్ళిపోతానని వాడిని మరిచి పోతానని ప్రామిస్ చేసిoది.జూన్ ముప్పైన అర్జoట్ పనిఅని  చెప్పి తన స్కూటిమీద రాత్రి పదిగంటల ప్రాంతములో బయటికెళ్ళిoది.పదకొండు గంటలకు విల్సన్ వచ్చి కుమారి తనయింటికి వచ్చితను డిల్లి వెళుతున్నాని  బై చెప్పితన సెల్ ఫోను మర్చిపోయిoదని యిచ్చి వెళ్ళిపోయాడు.కానీ ఆతర్వాత గంట లోపు మూడుసార్లు  వచ్చి కుమారి వచ్చిందా ?అని అడిగి వెళ్ళాడు.”

“విల్సన్ ప్రవర్తనలో ఏదైనా మార్పు గమనించారా?”

“అవునుసార్ !యెప్పుడు నేను కనిపించినా హాయ్ అంకుల్ ! అని విష్ చేసేవాడు.కానీ ఆరోజు చాలా మూడిగా కనిపిoచాడు.”

“అదికాదు ..డ్రస్సింగ్ విషయంలో మార్పులేమైనా గమనించారా?”

“యస్సార్ !నైట్ డ్రెస్ లోవున్నాడు.షర్ట్ బటన్స్ రెండు ఓపెన్గా వున్నాయి.క్రాఫు చెదిరిపోయి వుంది.వాటర్ ఆఫర్ చేశాను ..కానీ అదేమి పట్టించుకోలేదు.”

“కుమారి మిస్సింగని పోలీస్ కి ఇన్ఫాంచేసారా?”

“తనఅక్క కర్నాటకాలో ఐఏఎస్ ఆఫీసర్.తనకు చెప్పగానే తనే ఫోన్ చేసి కేసుబుక్ చేయించింది.”

“కుమారి స్కూటీ ఎప్పుడు కనిపించింది?ఎక్కడ?”

“ఐదురోజుల తర్వాత ..రైవస్ కెనాల్ ఒడ్డున చెట్లమధ్య కనిపించింది.”

“ఐదురోజుల తర్వాతా?అందునా ఓఐఏఎస్ రిపోర్ట్ చేసిన కేసిది.”

“సార్ ! విల్సన్ గాడి ఫాదర్ మాజీ ఎంఎల్యే .వాడు పోలీస్ ను మేనేజ్ చేసుంటాడని నా అనుమానం .పోలీస్ మీద నమ్మకం లేక మీ దగ్గరకు వచ్చాము సార్.”

“ఓకే !మేము మీకేసు తీసుకుంటున్నాము.ఈరాత్రి ఫ్లైట్ కే బయలుదేరుతాము.మీరు రేపు మార్నింగ్ హోటల్  ఫార్చూన్ లో కలవండి.వియ్ విల్ ట్రై అవర్ బెస్ట్.”

******

హోటల్ ఫార్చూన్..

“బాస్ !నేను క్రైంజరిగిన ప్లేసు విజిట్ చేశాను.మెయిన్ రోడ్ మీద చిన్న కల్వర్ట్ ప్రక్కనే చెట్లమధ్య కుమారి స్కూటీ పార్క్ చేసివుంది.ఒకప్పుడు ఆప్లేసులో దోభీఘాట్ ఉండేదట.కోతుల బెడద మూలంగా యిప్పుడు నిర్మానుష్యoగావుంది.అందుకే వెహికల్ లోకేట్ చేయడానికి అంతటైo పట్టిందని పోలీస్ భోగట్టా .ఆకల్వర్ట్ ప్రాంతం ఒకప్పుడు ప్రేమికుల  అడ్డాగా ఉండేదట.అందుకే కుమారి ఆత్మహత్య కోసం ఆప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుందని లోకల్ రూమర్.”

“హలో !ప్లీజ్ కనెక్ట్ మీ టు విజయభాస్కర్ సర్.

హాయ్ విజయ్! నైట్ ఫ్లైట్ కే  వచ్చాను. డిస్టర్బ్ చేయడం యిష్టం లేక యిప్పుడు.”

“చెప్పండి పెర్రీమేసన్ గారూ ! నేను మీకు యేవిధముగా సాయపడగలను?”

“బాబూ !జోకులాపి లేడీ డాక్టర్ కేసు గురించి చెప్పి.. “

“ఓకే బాబా !వెహికల్ పంపిస్తాను .కంటు మైఆఫీస్.”

“ఇప్పుడు కాదు ..ఈవెనింగ్ వస్తాను.నాకు కుమారి పోస్ట్ మార్టం రిపోర్ట్ మెయిల్ చేస్తే చాలు.”

లేడీ డాక్టర్ కేసు టేకప్ చేసావా? గుడ్ జాబ్ ..మాకున్న రాజకీయ ఒత్తిళ్లు నీకుoడవు.అయినా ఇది బ్లేజ్ వాడన్న సంగతి మర్చిపోకు.రిపోర్ట్ ఎలా వచ్చిందో గండిపేటరహస్యం..”

“అర్ధమయ్యిoది.అయినా నువ్వున్నావు ..నాకు భయం లేదు మిత్రమా.”

“అనుకో..పాపం లేడీsడాక్టర్ యoగ్ ఏజ్ లో ఆత్మహత్య ..ఐ కాంట్ బిలీవ్.మా చేతులు కట్టేశారు.మరో ఆయేషా  కేసని నా నమ్మకం.అయినా చేసేది యేమీలేదు.ముప్పైఏళ్ళ సర్వీసున్న ఐఏఎస్ఐపీఎస్ లు కూడా అయిదేళ్ళుకూడా గ్యారెoటీలేని రాజకీయ నాయకులకు బలాదూరే. యిది మన దేశంలో నెవెర్ ఎండింగ్ స్టొరీ.బాధపడి బలై పోయేకన్నా..యివన్నీ ఇప్పుడెందుకు గానీ సాయంత్రం ఆఫీస్ కువచ్చెయ్.. రాత్రికి డిన్నర్ చేస్తూ ..” “ప్రామిస్ చేయలేనుకాని ఐ విల్ ట్రై మై బెస్ట్.”

“ఓకే !నీ మెయిల్ చెక్ చేసుకో.”

క్రైమ్ ప్లేస్.ప్రోహిబిటేడ్ ఏరియా ..ఏరియా ఇన్ స్పెక్టర్ రిసీవ్ చేసుకున్నాడు బాలీ అవినాష్ లతోబాటు రాధికను కూడా .

“సర్ !సీపీ సర్ చెప్పారు .మీకు సహకరించమని.వియార్

ఎట్ యువర్ సర్వీస్ సర్.”

“ఓకే !నాకు అవసరమైనప్పుడు పిలుస్తాను.కుమారి బిలాంగిoగ్స్ ఎక్కడ భద్రపరిచారు?” “అవన్ని పీఎస్లో వున్నాయి సర్.”

“అవినాష్ ! ఈప్లేసును వీడియోతో కవర్ చెయ్యి.రాధికా చెట్టూపుట్టా వెదుకు.మన పూర్వీకుల్నికూడా విస్మరించకు.అర్ధమైందా?”

“అయ్యింది బాస్!”

“దయానంద్ గారూ !మీరు కూడా కుమారికి సంబంధించిన వస్తువులు దొరుకుతాయేమో వెదకండి.అమ్మాయి ఆరోజు ధరించిన దుస్తులు రిస్ట్ వాచ్ గుర్తుండేవుంటుంది.”

ఏరియా ఇన్ స్పెక్టర్ వచ్చి

“సర్ !మాపోలిసులు ఆల్ రెడీ జల్లెడ పట్టేశారు సర్.”

“పోలీస్ జల్లెడకు చిల్లులు పెద్దగా వుంటాయి.కానీ కనిపించవు.చూద్దాo మన ప్రయత్నం మనo  చేయాలికదా?..ఆంధ్రప్రదేశ్   కలలోకూడా వూహిoచలేని అమరావతిగా మారలేదా?యిదీ అంతే.”

“బాస్ !వీడియో కవరేజి అయిపోయిoది.ఫుట్ ప్రింట్స్ జూమ్లో చూస్తుoటే ఏదో సందేశాన్ని యిస్తున్నఫీలింగ్ కలిగింది.”

“ఓకే అవినాష్.!హోటల్ రూoలో డిస్కస్ చేద్దాము.రాధిక ఎక్కడవుందో చూడు.యిది అసలే కోతులసామ్రాజ్యమని చెప్పారు.”

“ఓకే బాస్!”

“బాలీ సర్ !ఇది కాలవ వడ్డున బురదలో దొరికిoది.కుమారిదే .”

బురదతో ఎండిపోయిన హెయిర్ బ్యాండ్ చూపిస్తూ చెప్పాడు దేవదానం.

“ఔను సార్..ఇది కుమారిదే ..డాక్టర్ కోటుకు మ్యాచిoగా ఉంటుందని కొనుక్కుంది.” ఏడుస్తూ చెప్పింది కుమారి తల్లి మార్గరెట్. రాధికతో అన్వేషి వస్తూనే “బాస్ !రాధిక మన పూర్వీకులతో ఏమి మాట్లాడిoదో వండర్ ఫుల్ క్లూ సంపాదించింది.”

తన చేతిలో వున్న చిరిగిపోయిన చిన్న గుడ్డ పీలికను చూపిస్తూ చెప్పాడు. “అవున్సార్ ..ఇది కుమారి చున్నీలోని ముక్కే ..”
ఏడ్చేసింది మార్గరెట్.“బాస్ !ఇది చూడండి..”  తన అరిచేతిని తెరిచి చూపించింది రాధిక.

“వెల్ డన్ రాధికా ..ఫ్రం టుడే ఆన్ వర్డ్స్ యూఆర్ ఇన్ మై క్రు.”

షేక్  హ్యాండిచ్చిఅభినందించాడు బాలీ.

******

హోటల్ రూo .సాయంత్రం ఆరు గంటలు.

“అవినాష్!పోస్ట్ మార్టం రిపోర్ట్ స్టడీ చేశావా?యిది ఆత్మహత్యకాదు..కోల్డ్ బ్లడేడ్ మర్డర్.మనం విజయ్ ని కలవాలి. రాధికా !రాత్రి డిన్నర్ కు రెడీఅయిపో .అవినాష్ నీవీడియో టీవీకి కనెక్ట్ చేసి ప్లేచెయ్.”

వీడియో ఆన్ అయ్యింది.చుట్టూ దట్టమైనచెట్లు.చెట్లమీద కోతుల గుంపులు.క్రైంప్లేసులో జూమ్ అయ్యింది కెమారా..నల్లరేగడి భూమి.ఎండిపోయిన బురద .

“అవినాష్.!పాస్ ..యిది ఫుట్ ప్రింట్ లావుంది ..మరికొంచం జూమ్ చెయ్.”

“ఎస్ బాస్ !యిది ఒకషూ ప్రింట్.ఇలాంటివి చాలావున్నాయి ..ఈ షుప్రింట్స్ అన్ని టువర్డ్స్ కెనాల్.కానీ ..”

“కాలవవైపు వెళ్ళిన  వ్యక్తి మళ్ళీ యిటు తిరిగిరాలేదు. అంటే  అక్కడినుండి ఒడ్డుమీద నడుచుకుoటు వెళ్ళి  మరో ప్రాంతంనుండి  రోడ్ కు చేరుకొని ఉంటాడు.”

“బాస్! అక్కడున్న మట్టిని సేకరించి నా హ్యాండ్ బాగ్ లో దాచి తెచ్చాను .”

రాధిక తనబాగ్ తెరిచి మట్టి పొట్లాన్ని బాలికి అందించింది.

“రాధికా!డిటెక్షన్ లో ఫస్ట్ స్టెప్ నథింగ్ షుడ్ బి ఇగ్నోర్ డ్.యూ హావ్ డన్ ఏవండర్ఫుల్ జాబ్. “థాంక్స్ ఏ లాట్ బాస్!”

“అవినాష్! ఈవీడియో విజయ్ కి చూపించాలి. పోతే మన నెక్స్ట్ టార్గెట్ విల్సన్ ..రేపు చూద్దాం.

********

కమీషనర్ విజయ్ భాస్కర్ బంగ్లా.బాలీ క్రూ మెంబర్స్ కి తన భార్యా ఇద్దరు పిల్లల్ని పరిచయం చేసాడు. డిన్నర్ అయిపోయింది. రాధిక విజయ్ భార్యతో కలిసిపోయి కబుర్లు చెప్తుంటే బాలీ అవినాష్  విజయ్ తో సమావేశమయ్యారు. అవినాష్ వీడియో ప్లేచేసాడు.
“విజయ్! కుమారిది ఆత్మహత్యకాదు.డెఫినెట్ గా  హత్యే.నువ్వు పంపిన పోస్ట్మార్టం రిపోర్ట్ చూడగానే అర్ధమైపోయింది.ఇవ్వాళ          క్రైంప్లేసులో మాకు దొరికిన ఆధారాలబట్టి నైన్టీనైన్ పర్సెంట్ కన్ఫం అయిపొయింది.రేపు ఆ వన్ పర్సెంట్ కూడా కంప్లీట్ అయిపోతుంది.నీమీదున్న పొలిటికల్  ప్రెజర్ నాకు అర్ధమయ్యింది.పోస్ట్మార్టం రిపోర్ట్ చూసిన నాకు అర్ధమైన విషయం ఓఐపీయస్ ఆఫీసర్కు అర్ధం కాలేదంటే నేనే కాదు ప్రపంచంలో మరెవరూ నమ్మరు.ఓక్రిమినల్ కున్నపొలిటికల్ పవర్  జైలు నుంచే చీఫ్ మినిస్టర్ ని శాసిoచే స్థాయిలో వుందంటే పోలీస్ పవరెoత?” “పొలిటికల్ పవర్ తో బాటు మన ఆంధ్ర రాష్ట్రాని పట్టిన మరో దరిద్రం కులగజ్జి. తరతరాల పిచ్చి.అందుకే నేనుఏమీ చేయలేక పోతున్నాను.

డిటెక్టివ్ బ్రెయిన్ నీది.పైగా నీమీద ఎలాంటి ప్రెజర్ పనిచేయదు. రాజకీయం పోలీస్ పవర్ ని శాసించగలదు..కానీ నిజాయితీ గల       ఏ చానల్ నీ శాసించలేదు. ప్రెస్, మీడియాని మించిన అస్త్రం లేదు ప్రపంచoలో. అర్ధమయ్యిందనుకుంటాను.”

“ఇoత వివరిoచినా అర్ధం కాకపోవడానికి ఇదేమైనా స్టార్ డైరెక్టర్ మత్తులో చుట్టేసిన హెవీ బడ్జట్ మూవీ కాదుగా?”

“పోతే ..ఈకేసులో నీకున్న పెద్ద అడ్వాoటేజ్..మతపిచ్చి తప్ప కులదురద లేని కులానికి సంబధించిన కేసిది..నీకున్నరేప్యుటేషనే నీకు ఆర్మర్.. ప్రేమ పేరుతో వంచించి యoగ్ ఏజ్ లోవున్న ఓఅమాయిక లేడీడాక్టర్ ను  పొట్టను పెట్టుకున్నపశువుల్ని వదిలిపెట్టకు. మా డిపార్ట్ మెంట్ కు నిజాలుతెలిసినా బయటకు చెప్పలేని పరిస్థితి.నయీంకేసు ఏమయ్యింది?డ్రగ్స్ కేసు ఏమవబోతుంది?రాష్ట్రాలు వేరయినా పరిస్థితులు ఒకటే.”

ఓకే !విజయ్ !ఫోన్లో టచ్లో వుంటాను.రేపు సాయoత్రమే ప్రెస్ మీట్.”

“యిది సెన్సేషనల్ కేసు పైగా ..మాడిపార్ట్ మెంట్ క్లోజ్ చేసిన కేసుకాబట్టి..ఏదైనా జరిగే అవకాశoవుంది.క్రైం బ్రాంచ్ డిఎస్పితోబాటు నా పర్సనల్ గార్డ్స్ నీచుట్టు వుంటారు. నువ్వు హేపీగా  మీ భాగ్యనగరం చేరేవరకూ నాదిబాధ్యత.ఐవిష్ యూ బెస్ట్ అఫ్ లక్.”

 ********

“బాలీ సార్!రేపు మాఇంట్లో కుమారి ఆత్మశాంతికి “మెమోరియల్ సర్వీస్ “కoడక్ట్  చేస్తున్నాము.మీరు తప్పకుండా రావాలి.”                        

అర్ధరాత్రి  వచ్చిన  ఫోనులో దేవదానం వాయిస్ విoటునే చిన్నగా నవ్వుకున్నాడు డిటెక్టివ్ బాలీ.

“రేపు మెమోరియల్ సర్వీస్ కి విల్సన్ ఫ్యామిలీని  ఇన్వైట్ చేసారా?”

“చేసాము సార్!కానీ వాళ్ళు వస్తారని నమ్మకము లేదు .”

“నమ్మండి.తప్పకుండా వస్తారు.మీ ఆఖరి అమ్మాయికీ విల్సన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితోనైనా పరిచయం వుందా?”

“వుంది సార్.విల్సన్ సిస్టర్ గ్రిజిల్డా మా ఆఖరి అమ్మాయి విక్టోరియా క్లోజు ఫ్రెండ్స్.”

“ఓకే !రేపు మేము మీబంధువుల్లా వస్తాము. చిన్న ప్లాన్ చెప్తాను అదిపూర్తై పోతే కుమారి హంతకులు దొరికిపోయినట్లే.”

“సార్ !రేపు ఉదయం పది గంటలనుండి మెమోరియల్ కార్యక్రమం  వుంటుంది.”

“ఓకే మేము నైన్ కే వస్తాము. “       

******

“విక్టోరియా ! మెమోరియల్ సర్వీస్ స్టార్ట్ అవగానే నువ్వు గ్రిజిల్దాని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి.మీతోబాటు మారాధిక వస్తుంది.నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో నీయిష్టం.మారాధిక సిగ్నల్ యిచ్చేoతవరకు నువ్వు గ్రిజిల్దాని యంగేజ్ చేస్తుండాలి.”

“అలాగే సర్!గ్రిజిల్డా మహేష్ బాబు పిచ్చిది.తన లేటెస్ట్ మూవీ నెట్లో చూడాలని వన్ వీక్ నుండి నాప్రాణం తీస్తోంది.నేను సెల్ లో డౌన్ లోడ్ చేసి తెచ్చి తనకి చూపిస్తుoటాను.కానీ యిప్పుడు....”

“విక్టోరియా డోంట్ వర్రీ ..యూ నేమ్ ఇట్ అన్వేషి విల్ ప్రోవైడ్ .”

“నేనూ మహేష్ బాబు అభిమానినే.నాఐపాడ్ లో రిలీజైన అన్నిమూవీస్ వున్నాయి.ఛాయిస్ ఈజ్ యువర్స్.” రాధిక పజిల్ సాల్వ్ చేసిoది.
“విక్టోరియా! తను రాధిక ..మా క్రూ మెంబర్ .తనను తీసుకొనే గ్రిజిల్డా ఇంటికి వెళ్ళాలి.”

“ఓకే సర్ !తను మాతో రావడానికి బ్రహ్మాండమైన వంక దొరికింది.

మా అక్క ఆత్మశాంతికి ఓమంచిపని చేసే అవకాశo దొరికింది .గిజ్జీ రాగానే మేము ముగ్గురం జoపై పోతాము.”

“జంప్ అయిపోoడి ..బట్ ఇంటి కీస్ మర్చిపోకండి.”

“అదేమీ ప్రోబ్లం కాదు సర్.దాని దగ్గర స్పేర్ కీస్ వుంటాయి.”

******

‘మీపేరు రాధిక కదూ?యిదే మా ఇల్లు.”

లాక్ ఓపెన్ చేస్తూ చేప్పిoది గ్రిజిల్డా.

“వావ్ !వెరీ నైస్ అండ్ పాష్ .. “

ఆచ్చర్యాన్ని వ్యక్తపరిచింది రాధిక.

“ఇది నాస్టడీరూo.ఇది నాస్మార్ట్ టీవీ.”

“వండర్ఫుల్ ..”మరోసారి వావ్ అంటే బాగోదని బాణీ  మార్చింది రాధిక.

“నాకు మీ ఇల్లు చూపిoచవా?”

తన సెల్ టీవీకి కనెక్ట్ చెస్తూ అడిగింది రాధిక.

“అసలే టైము లేదు ..మా సర్వెంట్ మెయిడ్ అవుట్ హౌస్ లో వుంటుంది ..వచ్చేస్తుంది .తను చూపిస్తుంది.”

టీవీకి యెదురుగా సోఫాలో సెటిలై పొతూ చెప్పింది గ్రిజిల్డా.

“అక్కా !తను సినిమా అయ్యేంతవరకు మన లోకంలో వుoడదు.పనమ్మాయి మేరీకి ..ఓఫైవ్ స్టార్ యిచ్చావంటే జీనీ అయిపోతుంది.”

“ఓకే !విక్టోరియా..నేను చూసుకుంటాను ..నువ్వు ..”

“అక్కా ఆవిషయం నాకు వదిలేయ్ ..టుఅవర్స్ నీ యిష్టం .”

*******

బాస్ !అసైనమెoట్ సక్సెస్.

రాధిక మెసేజ్ చూస్తూనే..అవినాష్ కు తమ్సప్ సిగ్నల్ చూపించాడు బాలీ.

“మిషన్ పూర్తి అయిపోయిoది. దేవదానం తనబిడ్డ మెమోరియల్ సర్వీస్ కి మీడియాని ఇన్వైట్ చేసాడు.బాంబు బ్లాస్ట్ మరో గంటలో.”
తన స్మార్ట్ ఫోను కొచ్చిన వాట్స్ యాప్  మెసేజ్ చూస్తూనే         

 “దట్ ఈజ్ బాలీ “  అనేసుకున్నాడు కమీషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ భాస్కర్ .అలా అనుకుoటునే క్రైం బ్రాoచ్ కి డయల్ చేసాడు.

********

మెమోరియల్ సర్వీస్ పూర్తయిపోయిoది.
మైక్ ముందుకొచ్చిన దేవదానం
“ప్రెస్ వారికీ , ఛానెల్స్ వారికీ వెల్కం చెపుతున్నాను.మా కూతురు డాక్టర్ కుమారి చనిపోయి ఇది తొమ్మిదవ దినం.
అన్ని ఛానల్స్ , ప్రెస్ మీడియా మా కూతురిది ఆత్మహత్యని ముక్త కంఠంతో డిసైడ్ చేసేసారు.కానీ ఈయన పేరు డిటెక్టివ్ బాలీ గారు.   థర్డ్ ఐ డిటెక్టివ్ఏజెన్సీ పేరు మీరు వినేవుంటారు ..హైదరాబాద్లో పేరు గాంచిన ఏజెన్సీ.వారు స్వర్గీయ నాకూతురు డాక్టర్ కుమారి గురించి ఎంక్యైరీ చేస్తూ స్వయంగా వచ్చారు.వారిని మాట్లాడవలసినదిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.”
క్రైంబ్రాంచ్ డియెస్పీ ..ఇచ్చిన సిట్యుయేషన్ అండర్ కంట్రోల్ సిగ్నల్ చూస్తూనే మైక్ ముందుకొచ్చాడు డిటెక్టివ్ బాలీ.
“నాపేరు బాలీ . నేను మీకు పర్సనల్ గా పరిచయం లేకపోయినా మేము సాల్వ్ చేసిన కేసులు మీకు పరిచయమేనని భావిస్తున్నాను.”
“డిటెక్టివ్ బాలీ సార్ !వియ్ నో”
చాలామంది ముక్త కంఠంతో అరిచేసారు.
“థాంక్ యూ ఆల్ ..అనుకోని మంచి సంఘటనలు జీవితంలో ఎదురు పడితే లక్ అనో పైవాడి దయఅనో భావిస్తాము.అదే చెడుసంఘటనైతే ఖర్మ అనో బాడ్ టైo అనో బాధపడిపోతాము.నిన్న ఏలూరు నుండి కారులో వస్తుంటే ఓసంఘటన జరిగింది.విజయవాడ సమీపిస్తుంటే ఓకల్వర్ట్ దగ్గర కోతిపిల్లలు అమ్మాయిలు ధరించేచున్నీతో ఆడుకుంటూ గాలికి వదిలేస్తే ఆచున్నీవచ్చి మాకారు విండ్ షీల్డ్ మీదపడింది.కారు ఆపి చూస్తుoటే పోలీసులు క్రైంప్లేసులో ఏర్పాటు చేసిన పోలీస్  ప్రోహిబిటేడ్ ఏరియా టేపు మధ్యలో ఓస్కూటీ కనిపించింది.హైదరాబాద్ వెళ్ళవలసిన మమ్మల్ని ఆ స్కూటి మిస్టర్ దేవదానం ఇంటికి లాక్కొచ్చింది.అది లక్కో బాడ్ టైమో మీరే చెప్పాలి.”
“బాలీమేసన్  !యూఆర్ జీనియస్”
లైవ్ చూస్తున్న విజయ్ గుంభనంగా నవ్వుకున్నాడు.
తను కోతులనుండి సపాదించిన చిన్నచున్నీ ముక్కకు యింతకధ చెపుతున్న బాస్ ను ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది.. అది పోలీస్ డిపార్ట్ మెంట్ కు బాస్  పెడుతున్నపూల గుత్తని  తెలియని  రాధిక.
“అక్కడితో మాజర్నీ డాక్టర్ కుమారి ఆత్మహత్య కేసుకు దారితీసింది.
ఓనిజాయితీవున్న చానెల్ కర్టసీతో సంపాదించిన  పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడగానే నీటిలోమునిగి ఆత్మహత్య చేసుకున్నడాక్టర్ లoగ్స్ లో నీటికంటెంట్ నిల్ అని చూసి ఓజగ్ వాటర్ నేనేతాగేశాను.”
కొందరి ముఖాలలో చిరునవ్వు తొంగిచూస్తే ..మరికొందరి ముఖాల్లో ఇన్ సల్ట్..కారణం తామింత గుడ్డిగా ఆత్మహత్యని ఎలా కమిటయ్యామా అని.
“అదిమొదలు డిటెక్టివ్ వానరాలు మానరాల్లోకీ జంప్ అయిపోయాయి.
ఇప్పటికే క్లైమాక్స్అర్ధమైపోయిoదనుకుoటున్నాను.
అంతేకాదు స్వర్గీయ డాక్టర్ కుమారి చూపిన ముందుచూపు  చూస్తే మీకుషాకులే షాకులు.తనుఆత్మహత్య చేసుకునేముoదు తనడాక్టర్ కోటు కలర్ తో  మేచయ్యే వైట్ హెయిర్ బేoడును తన వారసులకోసమా అన్నట్లు బురదలో దాచిమరీ చనిపోయింది.”
“బాలీ సార్ !సస్పెన్స్ తో చంపకండి.మాకోసం కాకపోయినా టీవీలలో లైవ్ టెలికాస్ట్ చూస్తున్న తెలుగు ప్రేక్షకులకోసమైనా ..”
“క్లైమాక్స్ లో సస్పెన్స్ స్టార్టిoగ్ లో లంగా డ్యాన్సులు లేని సినిమాలను వూహిoచగలమా?మాడిటెక్షన్ లో ఫస్ట్ పార్ట్ మిస్సింగ్.                          పోతే మరోసస్పెన్స్.పోలీసులకు కనిపించని ఫుట్ ప్రింట్స్ మాకు దర్సనమివ్వడం . అదేప్రింట్స్ తో అలరారే షుని కుమారి స్వర్గం నుండి  తనను హత్య చేసిన హంతకుడి ఇంటికే కొరియర్ చేయడం ..దానిని మారాధిక ఇప్పుడే సంపాదించడం వాటే సస్పెన్స్?                హత్యచేస్తున్న తన ప్రియుడి మీద  ప్రేమతో అతని షర్ట్ బటన్స్ తనతో తీసుకెళ్లాలని ప్రయత్నించి మామీద ప్రేమతో మాకు కనిపించేలా వదిలిపెట్టడం వండర్ కదా?                                                        ఇవి హంతకుడి స్వగృహమున దొరికిన బురద అంటుకున్నషు..యిది అక్కడి బురద మట్టి.ఇవి కుమారి వదిలిపెట్టిన  హంతకుడి షర్ట్ బటన్స్. యిది బటన్స్ వూడిన నైట్ షర్ట్.                                హంతకుడెవరో నన్ను చెప్పమంటారా?మీరు చెపుతారా?”
“ప్రేమనే కాక కుమారిని కూడా హత్య చేసిoది విల్సనా?”
అప్పటికే విల్సన్ ని చుట్టుముట్టారు క్రైంబ్రాంచ్ పోలీస్ .
“బాలిసార్! ఇద్దరు పిల్లల తండ్రి డర్టీ ప్రేమ కధ పత్రికల్లో రాస్తున్నప్పుడే మాకు అనుమానం వచ్చింది.కానీ పోలీస్ ఫీడ్ బ్యాక్ తప్పదు.”     అంటూనే ఓచానెల్ రిపోర్టర్ దోషిలా నిలబడ్డ విల్సన్ ను చూస్తూ
“బాలీ సర్ !ఈ నీచుడిని చూస్తూ మేముతట్టుకోలేము.మైకులు పెట్టి    ఈనీచుడి తలపగల గొట్టాలన్నoతఆవేశంలో ఉన్నాము. ఈవెధవని యెలా అనుమానిoచారో మీరే చెప్పండి.”
“ఆవిషయం మాత్రం నేనే చెపుతాను.జరిగింది నేను చెపితే నేరేషన్ అవుతుంది. హంతకుడు చెపితే అనుభవం . వాడినే అడగండి .”
“చెప్పరా కొ..నా..కొ..”
ఆవేశంతో వూగిపోయాడో జర్నలిస్ట్.
పోలీస్ కస్టడీ మధ్య పాలిపోయిన ముఖంతో నిలబడిన విల్సన్ నోరిప్పాడు.
“ఆరోజు రాత్రి పదిగంటలకు కుమారి మాఇంటికొచ్చింది.మనిషి చాలా ఆవేశoలోవుంది.వస్తూనే మాఅమ్మానాన్నల్ని నాభార్యని బాగా తిట్టేసింది. నువ్వొక రాజకీయ పుoడాకోరువి.నీ కొడుకొక ఛీటర్ పిగ్ ..రేపే ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని కడిగేయక పోతే నాపేరు కుమారేకాదంటూ బెదిరించింది. నెక్స్ట్ ఎలక్షన్లో ఎంఎల్యే గా పోటీ చేయాలనుకుంటున్న మాడాడీ భయపడిపోయాడు.నా కాపురం కూలిపోతుందని నా పిల్లలు నన్ను అసహ్యించుకుంటారని తనని వదిలించుకోవడం తప్ప మరోదారి లేదని డిసైడైపోయాను.నా కుటుంబ సభ్యులుకూడా నన్ను రెచ్చగొట్టారు.కుమారిని మాయమాటలతో మభ్యపెట్టి తన స్కూటీ మీద మేము రోజూ కలుసుకొనే ప్లేసుకు తీసుకొచ్చాను. తన చున్నీతో గొంతుబిగించి చంపేసి కాలువలో కి తోసేసి కాలువ   ప్రక్క బురదలో నదుచుకుoటు అంకుల్ వాళ్ళ ఇంటికొచ్చాను.నామీద అనుమానం రాకూడదని కుమారినుంచి లాక్కున్న  సెల్ యిచ్చి తను డిల్లి వెల్లిపోయిందని తన ఫోను మర్చిపోయిందని అబద్దం చేప్పాను. చంపాలన్న టెన్షన్లో తన చున్నీని అక్కడే పడేసాను.”
“సరే చంపేసిన తర్వాత తిరిగి ముడుసార్లు  కుమారి ఇంటికి ఎందుకు వెళ్ళావు?”
“నన్ను యెవరూ అనుమానిoచ కూడదని”
“నువ్వు ప్రేమిoచిన అమ్మాయిని చంపడo బాధనిపించ లేదా?”
“అప్పుడు నా ఫ్యామిలీ నా గురించి తప్ప మరో ఆలోచనరాలేదు.”
“బాలీ సర్ !ఈనిక్రుష్టుడి మాటలు వింటుంటే మతులు పోతున్నాయి.అసలు వేడిని మీరు ఎలా అనుమానించారు?”
“ నంబర్ వన్..అనుమానం రాకూడదని మూడుసార్లు కుమారి యింటికెల్లాడు.వూరెళుతున్నానని చెప్పిన కుమారి ఇంటికి యెలా వెళుతుంది?
నంబర్ టు ..తన ప్రేయసి స్టేషన్ వెళుతున్నానని చెప్పి వెళుతూ సెల్ మర్చిపోయిందని చెప్పాడు.స్టేషన్ కు వెళ్ళిన కుమారికి సెల్ యివ్వాలoటే స్టేషన్ కే వెళ్ళాలి.కానీ మన హంతకుడు ఓవర్ స్మార్ట్ గా ప్రవర్తించి యెన్నో క్లూలు అయాచితంగా అందించాడు.                      నంబర్ త్రి..బురదలో  కూరుకుపోయిన షుని తన షు రేక్ లో వదిలేసాడు తప్ప వదిలించుకోవాలన్న ప్రయత్నం చేయలేదు.
కుమారి డెడ్బాడీ నీటిలోనాని కుళ్ళిపోయిoది కాబట్టి గొంతుపిసికిన ఆనవాళ్ళు దొరకలేదు.
“నిజానికి ఒకటే రూపం.అబద్దానికి అనంతకోటి రూపాలు.”
క్రైంని కప్పిపుచ్చుకోవాలని నేరస్తుడు ఆడే ప్రతి అబద్దం ఒక క్లూ అవుతుంది.ఈ కేసులో హంతకుడు చెప్పిన అబద్దాలే క్లూలు.”
బాలీ ..మిన్నంటిన కరతాళధ్వనులమధ్య తన ప్రసంగం ముగించాడు.
                                     
 
 

 

మరిన్ని కథలు
sahasam shaayakuraa dimbakaa