Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

నయా ఎంటర్‌ప్రెన్యూర్‌ - నయా జోష్‌

new enterpenur - new josh

ఫస్ట్‌ స్టడీస్‌ కంప్లీట్‌ అవ్వాలి.. ఆ తర్వాతే ఉద్యోగం కోసం ఆలోచించాలి.. ఉద్యోగంలో చేరాక సంపాదన, ఆ తర్వాత లైఫ్‌లో స్ధిర పడడం.. ఈ ప్రోసెస్‌ అంతా జరిగేసరికి సగం వయసు గడిచిపోవాల్సిందే. కానీ ఇప్పుడు కాలంతో పాటు మనుషులే కాదు. మనసు కూడా పరుగులు పెడుతోంది. అంతదాకా ఎదురు చూసేది లేదు. అతి పిన్న వయసులోనే పెద్ద ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. ఆ ఆలోచనలకు స్కూల్‌ స్టడీస్‌ నుండే బీజం పడుతుంది. కాలేజీలకొచ్చేసరికి ఆ ఆలోచనలకు ప్రతిరూపం పురుడు పోసుకుంటోంది. ఆ రకంగానే అనేక స్టార్టప్‌ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. గతంలో స్కూల్‌ స్టడీస్‌ టైంలో ఓ క్లాస్‌కి ఒక్క లీడర్‌ మాత్రమే ఉండేవాడు. ఏడాది మొత్తం ఆ లీడరే క్లాస్‌ని కంట్రోల్‌ చేయడంలో లీడ్‌ రోల్‌ పోషించేవాడు. కానీ ఇప్పుడలా కాదు, క్లాసులోని ప్రతీ ఒక్కరికీ లీడర్‌ షిప్‌ అవకాశాలు కలుగుతున్నాయి. వారానికో లీడర్‌, నెలకో లీడర్‌ చొప్పున అందరికీ లీడర్‌ షిప్‌ అవకాశం కలుగుతోంది. తద్వారా ఈ స్టేజ్‌ నుండే నాయకత్వ లక్షణాలు అబ్బుతున్నాయి.

ఇక కాలేజీ స్టేజ్‌కొచ్చేసరికి ఈ నాయకత్వ లక్షణాలు బలపడుతున్నాయి. యూత్‌ రాజకీయాలు కాలేజీ క్యాంపస్‌లోనే మొదలవుతున్నాయి. అలాగే ఇంజనీరింగ్‌, తదితర గ్రూపు స్టూడెంట్స్‌కి ప్రాజెక్ట్స్‌ నిమిత్తం, కొంతమంది స్టూడెంట్స్‌ గ్రూప్స్‌గా తయారు కావడం ఒక విషయంపై డీప్‌గా పరిశోధన చేయడం వంటి విషయాలతో వారిలోని కొత్త కొత్త ఆలోచనలు సరికొత్త మార్గాల్లో అంకురిస్తున్నాయి. అలాగే చదువుకుంటూనే, ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులను ప్లాన్‌ చేసుకుంటోంది యువత. అది టెక్నికల్‌ ఫీల్డ్‌ కావచ్చు, మరే ఇతర రంగమైనా కావచ్చు. ఇక్కడ పెద్దలుగా మనం చేసేది ఏంటంటే, కేవలం వారి ఆలోచనలకు మెరుగులు దిద్దడం. వెన్ను తట్టి వారిని ప్రోత్సహించడం. గత తొమ్మిదేళ్ల కాలం నుండీ, యువత ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకున్నాయి. పిల్లల మేధస్సుపై జరిగిన ఓ అధ్యయనంలో తాజాగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఉద్యోగం వెతుక్కోవాలనే ఆలోచన నుండి, యువత చిన్న వయసులోనే ఆర్ధికవేత్తగా ఎదగేందుకు తగు సులభ మార్గాలను అన్వేషిస్తున్నారు.

ఎవరి కిందో మనం పని చేయడం ఏంటి? మనమే ఓ కంపెనీని స్టార్ట్‌ చేస్తే, స్వయం ఉపాధి దొరకడంతో పాటు, మరికొంత మందికి ఉపాధి కల్పించే అవకాశం కూడా కలుగుతుంది కదా అనే ఆలోచనలు చేస్తోంది యువత. ఆ రకంగానే చిన్న వయసుల్లోనే పారిశ్రామికవేత్తలుగా అవతారమెత్తుతున్నారు. అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇటీవల హైద్రాబాద్‌లో జరిగిన గ్లోబల్‌ ఆంట్రప్రన్యూర్‌ సదస్సును తీసుకుంటే, ఈ సదస్సులో 12 ఏళ్లు, 15 ఏళ్ల వయసులోనే పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన పలువురు చిన్నారులను చూశాం. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడంతో పాటు, వారి మేథో సంపత్తిని ప్రపంచం మొత్తం ప్రశంసించింది. మన పిల్లల్లోనూ ఇట్టి మేధో సంపత్తి ఉన్నవారుంటారు. వారిని వెలికి తీసే బాధ్యత తల్లితండ్రులది కొంతైతే, స్కూల్లో టీచర్స్‌ది మరికొంత బాధ్యత ఉంటుం. ఈ బాధ్యతను మనం గుర్తిస్తే, దేశం గర్వించదగ్గ పారిశ్రామకవేత్తలు కోట్లలో, లక్షల్లో ఒకరు కాదు.. ప్రతీ వందమందిలో పది మందిగా, ప్రతీ పది మందిలో ఒక్కరిగా ఉద్భవిస్తారనడం నిస్సందేహం.

మరిన్ని యువతరం
little masters - kitchen kings