Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
new enterpenur - new josh

ఈ సంచికలో >> యువతరం >>

లిటిల్‌ మాస్టర్స్‌ - కిచెన్‌ కింగ్స్‌

little masters - kitchen kings

ఇదివరకటి రోజుల్లో పిల్లల్ని వంటింట్లోకి రానిచ్చేవారు కాదు పెద్దలు. కానీ రోజులు మారాయి. ఇప్పుడు పిల్లలు హైపర్‌ యాక్టివ్‌ అయ్యారు. ప్రతీ విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి చూపుతున్నారు. ఏదో చెబితే తెలుసుకోవడం కాదు, ప్రాక్టికల్‌గా ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. అందులో ఒకటి కుకింగ్‌. అందుకే ఆల్రెడీ చాలా మంది లిటిల్‌ ఛెఫ్స్‌ సందడి చేస్తున్నారు. తమ పిల్లలు సరదాగా వండిన వంటకాల్ని వీడియోలు తీసి, తల్లి తండ్రులు సోషల్‌ మీడియా ఛానెల్స్‌లో పోస్ట్‌ చేసి మురిసిపోతున్నారు. మురిసిపోవడమే కాదు, సోషల్‌ మీడియాలో ఈ లిటిల్‌ మాస్టర్స్‌ చేసే ఫుడ్‌ ఐటెమ్స్‌కి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే, అంతా ఇంతా కాదు. ఓ పక్క ఆదాయార్జన. మరో పక్క పాపులారిటీ. ఇలా డబుల్‌ ధమాకా అన్నమాట. అయితే ఆదాయార్జన సంగతి పక్కన పెడితే, పిల్లల్లో కుకింగ్‌ పట్ల ఉన్న ఇంట్రెస్ట్‌ని వెలికి తీసినట్లు అవుతుంది ఈ రకమైన పద్ధతి ద్వారా. అసలీ ఇంట్రెస్ట్‌ పిల్లల్లో ఎలా కలిగించొచ్చు అనే విషయంపై కొంచెం కూలంకషంగా తెలుసుకుందాం.

మా పిల్లలు అస్సలు తిండి తినడం లేదు. మా పిల్లాడికి ఫలానా కూరంటే అస్సలు నచ్చదు.. అంటూ తల్లితండ్రులు బాధపడుతూ ఉంటారు. ఆ కారణంగా తమ పిల్లలకు అందాల్సిన పోషకాలు అందడం లేదని మధన పడుతూ ఉంటారు. అందుకోసమే ఈ చిన్న ట్రైల్‌. చేసి చూడండి. పోయేదేముంది. చిన్న వయసులోనే పిల్లలకి అన్ని రకాల కూరగాయల పైనా సరైన అవగాహన కల్పించాలి. తమతో పాటు మార్కెట్‌కి తీసుకెళ్లడం, అక్కడి కూరగాయలను కొనేటప్పుడే వాటి పోషకాల విలువల గురించి, వారికి అర్ధమయ్యేలా చిన్నగా చెప్పే ప్రయత్నం చేయాలి. ఇంటికొచ్చాక, వారికి ఏ రకమైన కూర ఇష్టమో వారినే అడిగి తెలుసుకోవాలి. అంతేకాదు, వండేటప్పుడు వారిని కూడా పక్కనే ఉంచి, మేకింగ్‌ విధానాన్ని ఎక్స్‌ప్లైన్‌ చేయడంతో పాటు, అవసరమైతే దగ్గరే ఉండి గరిటె తిప్పే పని కూడా అప్పచెప్పడంతో వారికి తామే ఆ కూర వండామేమో అనే ఫీలింగ్‌ కలుగుతుంది. దాంతో డైనింగ్‌ టేబుల్‌పై చేరేసరికి ఆ కూరని టేస్ట్‌ చేయాలనే ఆసక్తి కలుగుతుంది. అలా ఇష్టం లేని దాన్ని జస్ట్‌ టేస్ట్‌ చేసేందుకు అవకాశం కల్పించిన వాళ్లమవుతాం. అంతేకాదు, వారికిష్టమైన బిస్కెట్స్‌, బ్రెడ్స్‌ తదితర ఫుడ్‌ ఐటెమ్స్‌తో కూడా అప్పుడప్పుడూ చిన్న చిన్న ప్రయోగాలు చేయిస్తూ ఉండాలి. ఇది కేవలం కుకింగ్‌కి మాత్రమే పరిమితం కాదు. మిగతా యాక్టివిటీస్‌లో కూడా పిల్లలకు ఇలాగే ఇంట్రెస్ట్‌ కల్పించాలి.

ఉదాహరణకు డ్రాయింగ్‌, పెయింటింగ్‌, ఇంటీరియర్‌ డెకరేషన్‌ ఇలా తదితర అంశాల్లో పిల్లల అభిరుచికి తగ్గట్లుగా వారిని చిన్న వయసు నుండే మౌల్డ్‌ చేస్తూ ఉండాలి. దాంతో చిన్న వయసు నుండే పిల్లల మేథో శక్తి పెరగడంతో పాటు, ఆసక్తి లేని అంశాలనేవే వారి లిస్టులో ఉండవు. అయితే ఈ ప్రోసెస్‌ అంతా అంత సులువేం కాదు. అలా అని కష్టం కూడా కాదు. గ్రాడ్యువల్‌గా ఈ ప్రోసెస్‌ని తల్లితండ్రులు పిల్లలకు అలవాటు చేయాలి. అలవాటు మెల్ల మెల్లగా అభిరుచిగా మారడం పెద్ద విషయమేమీ కాదు. డియన్‌ పేరెంట్స్‌.. ట్రై చేసి చూడండి. మీ లిటిల్‌ మాస్టర్స్‌, భవిష్యత్తులో అద్భుతాలు సాధిస్తారనడం నిస్సందేహం. 

మరిన్ని యువతరం