Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
siraa

ఈ సంచికలో >> సినిమా >>

'భరత్‌' పోలిటిక్స్‌ రికార్డుల వైబ్రేషన్స్‌

bhrat political ricords vibrations

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్న చిత్రం 'భరత్‌ అనే నేను'. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమా కోసం భరత్‌ పోలిటిక్స్‌ మొదలెట్టేశాడా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ 150 కోట్లను మించి జరిగిందంటూ ట్రేడ్‌ వర్గాల సమాచారమ్‌. ఈ లెక్క చాలా పెద్దదే. 'బ్రహ్మూెత్సవం', 'స్పైడర్‌' రూపంలో వరుసగా రెండు భారీ ఫెయిల్యూర్స్‌ వచ్చాయి మహేష్‌బాబు నుండి. అయినా కానీ తాజాగా తెరక్కెబోయే 'భరత్‌ అనే నేను' చిత్రంపై ఇంత భారీగా అంచనాలు నమోదు కావడం చిన్న విషయం కాదు. అందుకే ఆయన సూపర్‌ స్టార్‌ అయ్యారు. అదే సూపర్‌ స్టార్‌ స్టామినా. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ని బట్టి చూస్తే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయనే చెప్పాలి.

కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహేష్‌ - కొరటాల కాంబినేషన్‌కున్న క్రేజ్‌ అలాంటిది మరి. 'ఊరు దత్తత' అనే కాన్సెప్ట్‌తో ఈ కాంబినేషన్‌లో వచ్చిన 'శ్రీమంతుడు' సినిమా మహేష్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలవడంతో పాటు బాక్సాఫీస్‌ వసూళ్లు కొల్లగొట్టింది. సినిమాని సినిమాగానే కాకుండా ఓ సామాజిక బాధ్యతగా తీసుకున్నారు చాలా మంది ప్రముఖులు ఈ సినిమా తర్వాత. ఆ రకంగా కూడా 'శ్రీమంతుడు' మంచి సక్సెస్‌ని అందుకున్నట్లే. అయితే ఈ సారి పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో రాబోతున్న 'భరత్‌ అనే నేను' సినిమాతో ఈ కాంబో ఏం మ్యాజిక్‌ చేయనుందో చూడాలి మరి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా మహేష్‌బాబు నటిస్తున్నారు ఈ సినిమాలో. ఇటీవల విడుదలైన 'భరత్‌ అనే నేను' టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కైరా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

మరిన్ని సినిమా కబుర్లు
rashikhanna  crossed success