Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
bhrat political ricords vibrations

ఈ సంచికలో >> సినిమా >>

అందాల రాశి సక్సెస్‌ని కొల్లగొట్టేసి!

rashikhanna  crossed success

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో ముద్దుగుమ్మ రాశీఖన్నా తెలుగు తెరకు పరిచయమైంది. సూపర్‌ హిట్‌తో పాటు, నటనలో మంచి మార్కులు కూడా కొట్టేసిందీ బ్యూటీ తొలి సినిమాతోనే. ఆ సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించేసుకుంది. తర్వాత వరుసగా ఆఫర్లు దక్కించుకుంది. 'జోరు', 'హైపర్‌', 'సుప్రీమ్‌', 'బెంగాల్‌ టైగర్‌' తదితర చిత్రాల్లో నటించింది. వీటిలో 'సుప్రీమ్‌' సినిమా మంచి సక్సెస్‌ని అందించిందనే చెప్పాలి రాశీఖన్నాకి. వసూళ్ల పరంగా ఈ సినిమా రాశీఖన్నా కెరీర్‌లో బెస్ట్‌ మూవీగా నిలిచింది. అయితే ఆ తర్వాత రాశీఖన్నా నటించిన 'బెంగాల్‌ టైగర్‌' తదితర చిత్రాలు ఫర్వాలేదనిపించాయి అంతే. రీసెంట్‌గా రాశీఖన్నా రెండు చిత్రాల్లో నటించింది. వాటిలో రవితేజతో నటించిన 'టచ్‌ చేసి చూడు' సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్‌ కాకపోయినా, రెండో సినిమా 'తొలిప్రేమ' మాత్రం రికార్డులు కొల్లగొడుతోంది. రాశీ కెరీర్‌లోనే ది బెస్ట్‌ హిట్‌గా నిలిచింది 'తొలిప్రేమ'. లవ్‌ మంత్‌లో విడుదలైన ఈ సినిమా లవర్స్‌ని బాగా ఆకర్షించడంతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరిస్తోంది.

అలాగే నటనలోనూ రాశీఖన్నాకి మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది ఈ సినిమా. ఈ సినిమా సక్సెస్‌తో రాశీఖన్నాలో ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ వచ్చేసిందట. దాంతో పాటు రెమ్యునరేషన్‌ కూడా బాగా పెంచేసిందంటూ టాక్‌ వినిపిస్తోంది. మరోపక్క రాశీఖన్నాకి తమిళ చిత్ర పరిశ్రమ నుండి ఆఫర్స్‌ బాగా వస్తున్నాయి. ఇప్పటికే అక్కడ మూడు చిత్రాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ మరిన్ని క్రేజీ ప్రాజెక్టులను ఓకే చేసే పనిలో ఉందంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. అలాగే యాక్టింగ్‌తో పాటు సింగింగ్‌ టాలెంటె కూడా ఉన్న రాశీఖన్నా అప్పుడప్పుడూ గొంతును సవరించుకుంటూ తనకి నచ్చిన పాటల్ని కూడా ఆలపించేస్తోంది. అన్నట్లు బాలీవుడ్‌లోనూ ఓ సినిమాలో నటిస్తోందీ భామ. ఎక్కడి నుండి ఎన్ని ఆఫర్స్‌ వచ్చినా, టాలీవుడ్‌కే ఫస్ట్‌ ఇంపార్టెన్స్‌ ఇస్తానంటోంది. త్వరలోనే తన పాత్రకి డబ్బింగ్‌ కూడా చెప్పుకుంటానంటోంది అందాల రాశీఖన్నా. 

మరిన్ని సినిమా కబుర్లు
rezina increased