Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

‘ఐ యామ్ దట్ చేంజ్’ - -సాయి సోమయాజులు

Allu Arjun I am that change Short Film - Independence Day

‘స్టార్ డైరక్టర్’ సుకుమార్ మన ‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్‍తో ఆర్య, ఆర్య-2 వంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన విషయం మనందరికి తెలిసిందే. ఐతే, ఇదే కాంబినేషన్‍లో ఓ షార్ట్ ఫిల్మ్ కూడా విడుదలయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నిర్మించిన ఈ లఘు చిత్రం- ‘ఐ యామ్ దట్ చేంజ్’, ఐ.ఎమ్.డి.బి లో 8.5/10 రేటింగ్‍ను సంపాదించుకుంది.  ఈ లఘుచిత్ర సమీక్ష...మీ కోసం-

కథ :
ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసిన ఒకణ్ని లంచం కాపాడుతుందా?, పరీక్షలో ఆన్సర్స్ తెలియని ఓ అమ్మయిని మాల్‍ప్రాక్టీస్ కాపాడుతుందా? మన దేశ శుభ్రతకి మనం విలువనిస్తున్నామా? వి.ఐ.పి. కల్చర్ తప్పు కదా, మరి దానికి పరిష్కారం?  ఇలాంటి కొన్ని సభ్య సమాజానికి ఉపయోగే పడేల ఇష్యూస్ రేయిజ్ చేసే సినిమా ఈ ‘ఐ యామ్ దట్ చేంజ్’.

ప్లస్ పాయింట్స్ :

అన్నిటికంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవలసిన ప్లస్ పాయింట్ ఈ సినిమా ద్వారా అందే మెసేజ్. ‘దేశభక్తి అంటే మన దేశం పట్ల మనం బాధ్యత వహించడం’ అని చాలా చక్కగా,మనసుకు హత్తుకునేలా చెప్పారు సుకుమార్ గారు. ఎడిటింగా చాలా షార్ప్ గా ఉంటుంది. మూడు నిమిషాల నిడివి ఈ సినిమాకి చాలా ఉపయోగపడుతుంది. అల్లు అర్జున్ తో పాటు ఇతర నటులూ బాగా చేశారు. ‘వందే మాతరం’ థీమ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, మనకి గూస్ బంప్స్ (వెంట్రుకలు నిలవడం) తెప్పిస్తుంది.

మైనస్ పాయుంట్స్ :

చాలా మంచి ఇతివృత్తాన్ని ఎంచుకున్న సుకుమార్ గారు ఈ చిత్రం ద్వారా మరి కొన్ని సోషల్ ఇష్యూస్‍ని రెయిజ్ చేసి ఉంటే ఇంకా బాగుండేదేమొ.

సాంకేతికంగా :

అమోల్ రాఠోడ్ గారి సినిమాటోగ్రఫి గురించి మనం ప్రత్యేకంగా ఏం చెప్పకర్లేదు. ప్రతి ఫ్రేమ్ చాలా బాగా డిజైన్ చేసారు. సాయి కార్తిక్ అందించిన మ్యూజిక్‍లో మంచి పేట్రియాటిక్ డెప్త్ ఉంది. ప్రవీణ్ పుడి గారి ఎడిటింగ్ అభినందనీయం. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి.

మొత్తంగా :

చూసింతర్వాత మార్పు మనతోనే మొదలవుతుంది... BE THAT CHANGE!

అంకెలలో :


4/5

LINK :

https://www.youtube.com/watch?v=ZkbQcayOsc0

మరిన్ని శీర్షికలు
varam varam vari vari phalalu