Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

కాజల్‌ లక్కీ హ్యాండ్‌ - అన్నయ్యకీ కలిసొస్తుందా?

kajol lucky hand

కళ్యాణ్‌రామ్‌ - కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'ఎమ్యెల్యే'. 'ఎమ్మెల్యే' అంటే 'మంచి లక్షణాలున్న అబ్బాయి' అని అర్ధం ఈ సినిమాలో. పాపం ఈ మంచబ్బాయికి ఓ మంచి హిట్‌ కావాలిప్పుడు. 'పటాస్‌' సినిమా తర్వాత ఆ స్థాయి హిట్‌ అందుకోలేకపోయాడు కళ్యాణ్‌రామ్‌. దాంతో కళ్యాణ్‌రామ్‌ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయని చెప్పాలి. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఈ అంచనాలకు అసలు కారణం ఈ సినిమాలో కళ్యాణ్‌ రామ్‌ జత కడుతోంది చందమామ బ్యూటీ కాజల్‌తో. కాజల్‌కి అసలే ఇప్పుడు గుడ్‌ టైం నడుస్తోంది. కాజల్‌ ఏది పడితే అది బంగారమైపోతోంది. 'ఖైదీ' సినిమా నుండి కాజల్‌కి తిరుగే లేదు. వరుస విజయాలతో దూసుకెళ్తోంది.

ఈ సంగతి పక్కన పెడితే, తమ్ముడు ఎన్టీఆర్‌తో కాజల్‌ నటించిన 'టెంపర్‌' చిత్రం మంచి విజయం అందుకుంది. అప్పటిదాకా వరుస ఫెయిల్యూర్స్‌తో ఉన్న ఎన్టీఆర్‌కి ఆ సినిమాతోనే హిట్‌ కళ ఆవహించింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ వరుస హిట్స్‌తో దూసుకొస్తున్నాడు. ఎన్టీఆర్‌ కోసమే కాజల్‌ అగర్వాల్‌ 'జనతా గ్యారేజ్‌' సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో నటించింది. ఆ సినిమా కూడా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది ఎన్టీఆర్‌కి. ఆ రకంగా చూస్తే, కళ్యాణ్‌రామ్‌కి 'ఎమ్మెల్యే'తో హిట్‌ కొట్టే ఛాన్స్‌ పుష్కలంగా ఉందనే చెప్పాలి. మరి ఎన్టీఆర్‌లా కాజల్‌ లక్‌ కళ్యాణ్‌రామ్‌కి కలిసొస్తుందో లేదో చూడాలిక. అన్నట్లు కళ్యాణ్‌రామ్‌కి కాజల్‌తో గతంలో 'లక్ష్మీ కళ్యాణం' రూపంలో హిట్‌ ఉన్న సంగతిని గమనించాలి.

మరిన్ని సినిమా కబుర్లు
mega namdamuri multystarer