Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
betala prashna

ఈ సంచికలో >> శీర్షికలు >>

జయజయదేవం - డా. ఎస్. జయదేవ్ బాబు

అంతరంగిక సేవకుడు: మహారాజా, ప్రభుత్వోద్యోగులు లంచాలు మింగుతున్నారట! ఉద్యోగ ధర్మాలు మానారట!
రాజు: అందరినీ చెరసాలలో తోయండి!
అంతరంగిక సేవకుడు: ఈ వార్త అక్కడి నుంచే పొక్కింది మహారాజా! చెరసాలలో తోసినా అదే పనిమీదున్నారట!

 

 

****************

భార్యామణి: ఏవండీ... నాపేరు కనకమహాలక్ష్మి. నన్ను ముద్దుగా "కమ్మీ" అని పిలిస్తే మీ సొమ్మేం పోతుంది?
భర్త రత్నం: పక్కింటావిడ పేరూ కనకాహాలక్ష్మే! వాళ్ళాయన ఆవిడని 'కమ్మీ' అని పిలుస్తాడు!
భార్యామణి: చూశారా? మరి మీరు కూడా నన్నలా పిలవచ్చుగా?
భర్తరత్నం: పిలుస్తాను... ఒకవేళ పక్కింటాయన పిలిచాడనుకో... నేనే పిలిచానని నువ్వక్కడికి పారిపోతేనో... అదీ నా భయం!

 

****************

దానయ్య: ఈ ఇంట్లో ఒక గొప్ప క్షుద్రసాహిత్యాప్రవీణుడుండేవారే? ఆయనేరీ?
వీరయ్య: ఆ చింత చెట్టు  కింద చింకిపాతలతో తిరిగే పిచ్చివాడు ఆయనే!
దానయ్య: ఆయన పిచ్చివాడైపోయాడా? ఎలా?
వీరయ్య: ఎవరో ఆయన మీద చేతబడి చేశారు పాపం!

 

****************

ఒకడు: ఈ దేశం రాజు చండశాసనుడట గదా? ఊరూ వాడా ఎంత నిర్మానుష్యంగా వుందో చూశావా?
(రెండు నిముషాలనంతరం)

ఇంకొకడు: సొల్లు కబుర్లాడుతూ వీధుల్లో తిరిగేవాళ్ళని గోశాలల్లో తోసి, పేడతో పిడకలద్దిస్తారన్నమాట!!

 

 

 

****************

మంత్రివర్యుడు: మహారాజా, మన రాజ్యం లో ఈ ఏడు చింతకాయలు సమృద్ధిగా పండాయి. పంట కోతకి సిద్ధంగా వుంది.
మహారాజు: ఐతే వెంటనే మంత్రగాళ్ళని సిద్ధం చేసి , కోత కోయించండి.
మంత్రివర్యుడు: కబురంపాము ప్రభూ! ఐతే వాళ్ళ మంత్రాలకి చింతకాయలు రాలవని తెలిసింది.
మహారాజు: ఐతే మన భటులని పంపించి కత్తులతో చింతకాయలు కోయించండి. దానితో పాటు, ఆ మంత్రగాళ్ళ తలకాయలని కూడా నరికించండి.. పోండి!

 

****************

 

రమణి: నీకు తగిన వరుడు దొరికాడా?
రాధిక: నాకు బహుసంతాన ప్రాప్తి అని జోస్యుడు చెప్పాడు! అందుచేత ఒక గజ ఈతగాడ్ని వెతుకుతున్నాను!
రమణి: ఈతగాడెందుకూ?
రాధిక: గంపెడు సంతానం గల సంసారసాగరాన్ని ఈదగలగాలి కదా? అందుచేత!!

 

 

****************

 

రామశాస్త్రి: గొంతులోతు నీటిలో సంగీత సాధన చేసావే, జతులు, సంగతులు, గమకాలూ అన్నీ వంటబట్టాయా?
సోమశాస్త్రి: వాటి సంగతటుంచి, నీరు పరిశుభ్రంగా లేనందువల్ల వొంటి నిండా గజ్జి, తామర సోకింది!!

 

 

 

****************

ఒక చిలక: పిట్ట కొంచెం, కూత ఘనము అంటారు గదా... ఆ పిట్ట, నోరుమూసుకూర్చుందే?
ఇంకో చిలక: అది ఈరోజు మౌన వ్రతం పాటిస్తోంది!!

 

 

 

****************

ఒక మెరుపుతీగ: ఆ యువకుడు అస్థలిత బ్రహ్మచారి కదా? నీ వలలో ఎలా చిక్కుకున్నాడు?
ఇంకోమెరుపుతీగ: వాత్య్సాయన కామసూత్ర గ్రంధాన్ని అతడి కంటపడేలా నా చెలికత్తెల ద్వారా ఏర్పాటు చేశానులే!

 

 

 

****************

సోమప్ప:   నువ్వు తేరును ఉత్త చేతుల్తో ముట్టుకుని లాగితే అది దొర్లుకుటూ ముందుకు సాగిందా? మరదెలా ఆగింది?
వీరప్ప: నా రెండు కాళ్ళు కట్లుకట్టుకుని కూర్చున్నానే... నీ కర్ధం కాలేదా??

మరిన్ని శీర్షికలు
cheppagalaraa..cheppamantara