Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
purijagannaatha is back

ఈ సంచికలో >> సినిమా >>

టాలీవుడ్‌ 'టైమ్‌' మిషన్‌ వెనక్కెళ్లిపోతోంది

tollywood time mission is back

ఇప్పటి ట్రెండ్‌కి గుడ్‌బై చెప్పేస్తున్నారు మన టాలీవుడ్‌ దర్శక నిర్మాతలు. దశాబ్ధాల వెనక్కి వెళ్లి అప్పటి నేటివిటీకి తగ్గట్లుగా కథలు ప్రిపేర్‌ చేస్తున్నారు. చూసే ప్రేక్షకులు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. ఆ దిశలో మన టైమ్‌ మిషన్‌ని వెనక్కి తీసుకెళ్లిపోతున్నారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి, సంచలనాలు సృష్టిస్తోన్న 'రంగస్థలం' సినిమా తీసుకుంటే, 1980ల కాలం నాటి కథ. కానీ ప్రేక్షకులకు ఏ స్థాయిలో చేరువైందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో కూడా ఈ కథకు పట్టం కట్టేశారు. రికార్డు స్థాయిలో బాక్సాఫీస్‌ వసూళ్లు కొల్లగొట్టేసిందీ సినిమా. ఇప్పుడు మరో సినిమా వస్తోంది ఈ తరహా నేపథ్యంలోనే. అదే రెండు మూడు దశాబ్ధాల ముందు చరిత్ర. 'మహానటి' చిత్రంలో చూపించబోతున్న స్టోరీ కూడా అదే.

అలనాటి మేటి నటి సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులంతా అలనాటి కాలానికి తగ్గట్లుగా మారిపోయారు. కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సమంత, విజయ్‌ దేవరకొండలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన వీరిద్దరి ఫస్ట్‌లుక్స్‌ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే, 'బాహుబలి' సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కించబోయే మెగా ప్రాజెక్ట్‌ చరణ్‌ - ఎన్టీఆర్‌ మల్టీ స్టారర్‌ కథ కూడా 19ల కాలం నాటిదేనని ప్రచారం జరుగుతోంది. ఇవే కాక, పూరీ జగన్నాధ్‌ కొడుకు ఆకాష్‌ పూరీతో తెరకెక్కిస్తున్న 'మెహబూబా' చిత్రం కూడా స్వాతంత్య్రానికి ముందు ఇండియా - పాకిస్థాన్‌ యుద్ధ నేపథ్యంలో జరిగిన స్టోరీగా తెరకెక్కుతోంది. అలాగే రానా నటిస్తున్న '1945' కూడా ఈ తరహా నేపథ్యమే. ఇలా చెప్పుకుంటూ పోతే, టాలీవుడ్‌ సినిమా కొన్ని దశాబ్ధాల కాలం వెనక్కి వెళ్లిపోతోందనిపిస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
pellichoopulu beauty