Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
pellichoopulu beauty

ఈ సంచికలో >> సినిమా >>

అఖిల్‌తో జత కట్టబోయే హాట్‌ ఐటెం భామ ఎవరో.!

hot item bhama

అక్కినేని రాకుమారుడు అఖిల్‌ మూడో సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. 'తొలిప్రేమ' సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్న డైరెక్టర్‌ వెంకీ అట్లూరితో అఖిల్‌ మూడో సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే. 'తొలిప్రేమ'తో డైరెక్టర్‌గా తొలి సినిమాకే మంచి విజయం అందుకున్న వెంకీ అట్లూరి, అఖిల్‌ కోసం కూడా మరో లవ్‌స్టోరీనే సిద్ధం చేశాడట. కమర్షియల్‌ హంగులతో, యాక్షన్‌ ఘట్టాలతో ఈ సినిమాకి స్క్రిప్టు రెడీ చేశాడట. ఈ స్టోరీ పట్ల నాగార్జున, అఖిల్‌ సంతృప్తిగా ఉన్నారనీ తెలుస్తోంది.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సీనియర్‌ డైరెక్టర్‌ వినాయక్‌తో చేసిన 'అఖిల్‌' సినిమా డిజాస్టర్స్‌ ఖాతాలో చేరిపోయింది. ప్రధమ ప్రయత్నం అలా అయితే 'మనం' వంటి క్రిటికల్‌ సబ్జెక్ట్‌తో సక్సెస్‌ అయిన విక్రమ్‌ కుమార్‌తో చేసిన రెండో సినిమా 'హలో' కూడా ఆశించిన విజయాన్ని అందివ్వలేదు అఖిల్‌కి. దాంతో యంగ్‌ డైరెక్టర్స్‌ని ప్రిఫర్‌ చేశాడు. ఆ కోవలోనే వెంకీ అట్లూరి దొరికాడు. మరి ఈ సారి ఏం చేస్తాడో అఖిల్‌ చూడాలి. ఇకపోతే, ఈ సినిమాలో ఐటెం సాంగ్‌ గురించి టాలీవుడ్‌లో ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో కొన్ని ఐటెం సాంగ్స్‌ సినిమా భవితవ్యాన్ని మార్చేస్తున్నాయి. అందుకే పాపులర్‌ హీరోయిన్స్‌ కూడా ఐటెం సాంగ్స్‌కి అదే స్పెషల్‌ సాంగ్స్‌కి సై అంటున్నారు. హీరోయిన్‌గా మొత్తం సినిమాలో నటిస్తే వచ్చే క్రేజ్‌, ఒక్క స్పెషల్‌ సాంగ్‌తో సంపాదించేస్తున్నారు. అఖిల్‌ సినిమా కోసం ఓ పాపులర్‌ హీరోయిన్‌ని స్పెషల్‌ సాంగ్‌ కోసం అనుకుంటున్నారట. ఆ లిస్టులో పూజా హెగ్దే, కాజల్‌ అగర్వాల్‌ పేర్లు ముందు వరుసలో ఉండగా, అఖిల్‌ తొలి సినిమా హీరోయిన్‌ సాయేషా సైగల్‌ పేరు కూడా వినిపిస్తోంది. చూడాలి మరి, అఖిల్‌తో వీరిలో ఏ ముద్దుగుమ్మ చిందేస్తుందో.! 

మరిన్ని సినిమా కబుర్లు
srireddy leeks