నేచురల్ స్టార్ నాని తొలిసారిగా నిర్మాతగా మారి రూపొందించిన సినిమా 'అ'. ప్రశాంత్ వర్మ అనే యంగ్ డైరెక్టర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు నాని ఈ సినిమాతో. ఇదో ప్రయోగాత్మక చిత్రం. అందర్నీ విశేషంగా ఆకట్టుకుందీ చిత్రం. షార్ట్ ఫిలిం మేకింగ్‌లో విశేషమైన అనుభవం ఉన్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి ఇది తొలి చిత్రమైనప్పటికీ, ఆయన టేకింగ్, కథలోని కొత్తదనం అన్ని వర్గాల ఆడియన్స్‌నీ బాగా ఎట్రాక్ట్ చేసింది. అదే ఎట్రాక్షన్‌తో ఇప్పుడు సీనియర్ హీరో రాజశేఖర్‌నీ ఎట్రాక్ట్ చేశాడు మనోడు. త్వరలోనే రాజశేఖర్, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.
ఇది కూడా రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదని తెలుస్తోంది కానీ, తొలి ప్రయత్నంగా కమర్షియల్ అంశాల్ని దృష్టిలో పెట్టుకోకుండా, ఓ కొత్త కథని పరిచయం చేయాలనే తపనతో 'అ' చిత్రం చేశాడు ప్రశాంత్ వర్మ. కానీ ఇప్పుడు చేయబోయే సినిమాలో కొత్తదనంతో పాటు కొన్ని కమర్షియల్ హంగుల్ని కూడా జత చేసే యోచనలో ఉన్నాడనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్. అయితే ఖచ్చితంగా డైరెక్షన్‌లో తనదైన ప్రత్యేకతను చాటుకునే విధంగా ఈ చిత్రం ఉండబోతోందట. ఇటీవలే రాజశేఖర్ 'గరుడవేగ' చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ సక్సెస్‌ని నిలబెట్టుకోవాలంటే ఆచి తూచి వ్యవహరించాల్సిందే. అందుకే యంగ్ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడొస్తున్న డైరెక్టర్లు సరికొత్త ఆలోచనలతో సరికొత్త కథా, కథనాలతో వస్తున్నారు. మినిమమ్ బడ్జెట్‌తోనే ఓ రేంజ్ హిట్స్ అందుకుంటున్నారు. ఆ దిశగా ప్రశాంత్ వర్మతో రాజశేఖర్ మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలిక.
|