Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

జోకులు - - డా. ఎస్. జయదేవ్ బాబు

 

ఒక సేవకుడు : అక్బరు చక్రవర్తీ, బీర్ బల్ సాహెబూ, కథలు చెప్పుకుంటూ పగలబడి నవ్వుకుంటున్నారు చూడు !
ఇంకో సేవకుడు : ఏం కథలూ?
ఒక సేవకుడు : " అక్బర్ - బీర్ బల్ కథలు"


......................................


మహారాణి : మన రాజ్యాంగంలో, వయసులో అరవైయో పడి రాగానే విశ్రాంతి తీసుకోండని , ఒక్కొక్కరినే పంపించేస్తున్నామే.....అందరూ హాయిగా వెళ్ళిపోతున్నారే..నేను విశ్రాంతి తీసుకునేదెప్పుడూ?
మహారాజు : నేను చచ్చాక..!!

 

 

......................................

ఆలిమా : నిన్ను పెళ్ళి చేసుకుంటే నాకేం లాభం?
అబ్దుల్ : నువ్వు చనిపోతే నీకో పెద్ద గోరీ కట్టిస్తా.
ఆలిమా : నాకు ముందు నువ్వు పోతేనో?
అబ్దుల్ : స్వర్గంలో నీకు గోరీ కట్టి, సిద్ధంగా ఉంటాను !
ఆలిమా : గోరీలు కట్టే నువ్వొద్దు....వొస్తా...!!

 


......................................


గండిరెడ్డి : ఈ శిధిలమైన, తుప్పు పట్టిన తోపుడు బండిని, వంద మొహరీలు పెట్టి కొన్నావా....ఏమిటి దీని ప్రత్యేకత ?
మొండిశెట్టి : ఇది " సలీం " ప్రేమ చిహ్నం !!
గండి రెడ్డి : ఎలా నిర్ధారించావ్?
మొండిశెట్టి : చక్రం మీద " అనార్కలి " పేరు చెక్కి వుంది ! చూడు !!

 


......................................


రాజు తన నమ్మకస్తుడైన భటుడితో : ఒరేయ్, మన రాజ్యాంగ విస్తరణ కోసం, మంత్రి మండలి సభ్యులు, ప్రణాళికలు రచిస్తున్నారా?
భటుడు : అద్భుతంగా రచిస్తున్నారు ప్రభూ...అందులో ఒక భాగంగా తమరి మరణానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు మహారాజా!!
రాజు : నా మరణానికి ప్రణాళిక ఎందుకు ?
భటుడు : రాజ్యాంగ విస్తరణ కోసం రాజా..!

 

......................................


మంత్రి : వాద ప్రతివాదాలు విన్నాక, ముద్దాయి దోషి అని తేలింది. శిక్షార్హుడు అని ఋజువైంది..(రహస్యంగా), కానీ తుది నిర్ణయం తమరిదే కనుక, ముద్దాయిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేయండి ప్రభూ !!
రాజు : ఎందుకూ?
మంత్రి : ముద్దాయి నా బామ్మర్ది..
రాజు : అదా సంగతి? నీకెంత ముట్టజెప్పాడేం? అందులో సగం వాటా నాకివ్వు ! తీర్పు మార్చి చెబుతా!!


......................................


అనీసా : మీ ఆయనకి ఖిలాలో ఉద్యోగం వొచ్చిందన్నావ్...ఏం ఉద్యోగమేం?
ఎరీనా : ఫతే దర్వాజాలో నిలబడి , ఎవరైనా వస్తే, చప్పట్లు కొట్టాలి.
అనీసా : మంచి ఉద్యోగమే !
ఎరీనా : ఏం మంచుద్యోగమో ! ఇంట్లో, వాకిలి ముంగట ఎవరొచ్చినా చప్పట్లు కొడుతుంటారు !!

 

 


......................................


మహారాజు : మహామంత్రీ, పొరుగు రాజ్య రహస్యాలను తెలుసుకునేందుకు వేగుల వాళ్ళని నియమించాము కదా ? వాళ్ళనుంచి మనకేమైనా సమాచారం అందిందా ?
మహామంత్రి : ఆ రాజ్యంలో వాళ్ళు పెద్ద ఉద్యోగాలు సంపాదించుకుని స్థిరపడిపోయారు ప్రభో!!
మహారాజు : వాళ్ళు తిరిగి మనరాజ్యానికొచ్చి, మన రహస్యాలను మోసుకెళ్ళకుండా ఓ కంట కనిపెట్టండి...పోండి....హు!!


......................................


బురుజు కాపలాదారుడు : బురుజు కాపలాకి నన్ను రాత్రుళ్ళు మాత్రమే పంపించండి దండనాయకా ! చక్కగా కాపలా కాస్తాను !
దండనాయకుడు : కాపలా కాసేప్పుడు, నీకు ఆకాశంలో చుక్కలు, ఉల్కలూ, తోకచుక్కలు కనిపిస్తాయా?
బురుజు కాపలాదారుడు : అబ్బ...ఎన్ని నక్షత్రాలో...వాటినే చూస్తుంటా !
దండనాయకుడు : పడుకుని చూస్తావా...నుంచునా?

బురుజు కాపలాదారుడు : నుంచొని చుక్కల్నెలా చూస్తాం నాయకా? హాయిగా పడుకునే చూస్తాను..
దండనాయకుడు : ఔనా....నువ్వు రాత్రిళ్ళు కాపలాకాసేదిలాగానా...నిన్ను ఉద్యోగంలోంచి పీకేశాను పో!!


......................................


ఫైజ్ ఖాన్ : ప్యారీ బేగం...నేను పొరుగు దేశం వెళ్ళాలి....నా వెలకట్టలేని మాయ తివాసీని తీసుకురా....
బేగం ఉన్నీసా : తివాసీ దుమ్ముకొట్టుకుపోతే దాన్ని మన పక్కింటి వాళ్ళకిచ్చేశాను....వాళ్ళు దాన్ని భోగిమంటల్లో వేసేశారు ప్యారే అల్ జాజ్

మరిన్ని శీర్షికలు
sarasadarahasam