టాలీవుడ్ డైరెక్టర్స్ అంతా ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది? కన్నుల పండగే కదా. కానీ ఈ స్క్రీన్ మీరంతా అనుకునే స్క్రీన్ కాదు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఇంట్లో డైరెక్టర్స్ అంతా విందుకు హాజరయ్యారు. జస్ట్ ఏ డిన్నర్ పార్టీ అన్నమాట. సరదాగా ఈ విందులో పాల్గొన్నారు పలువురు డైరెక్టర్లు. జక్కన్న రాజమౌళి, క్రిష్, కొరటాల శివ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, సందీప్‌రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ తదితరులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. నైట్ నుండి తెల్లవారుజాము వరకూ సరదా సరదాగా ముచ్చటించుకున్నారు. భవిష్యత్తులో తాము తెరకెక్కించబోయే ప్రాజెక్టుల కోసం ఈ మీటింగ్‌లో చర్చించుకున్నారు.
అంతా క్రియేటివ్ డైరెక్టర్లే. తమ తమ క్రియేటివిటీని మరింత విసృతపరిచి ప్రేక్షకుల్ని ఆనందింపచేసే దిశగా ఈ మీటింగ్‌లో వీరి చర్చలు జరిగాయట. ఒకరి సినిమాకి మరొకరు క్రియేటివ్ పరంగా సహకరించంచుకోవాలనే ఉద్దేశ్యంతో డైరెక్టర్లు ఉన్నారనీ తెలుస్తోంది. మన తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగేందుకు ఇది ఉపయోగపడుతుందనడంలో ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదు. తెలుగు సినిమా మరిన్ని నూతనమైన అద్భుతమైన ప్రయోగాలకు వేదికయ్యేందుకు తమ తమ క్రియేటివ్ ఆలోచనలను ఒకరితో ఒకరు పంచుకున్నారు మన ఈ డైరెక్టర్లు. ఇక నుండి స్క్రిప్టు రైటింగ్‌లో కూడా ఒకరికి ఒకరి సహకరించుకోవాలనీ, తగిన సూచనలు, సలహాలు ఇచ్చుకోవాలనీ డైరెక్టర్లు అంతా ఓ మాట అనుకున్నారట. నిజంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. ముందు ముందు మన తెలుగు సినిమా స్థాయి మరింత ఉన్నతంగా పెరుగుతుందనడానికి డైరెక్టర్ల ఈ స్నేహ పూర్వక చర్చా వేదిక ఓ చక్కని నిదర్శనం కానుంది.
|