Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

22-6-2018 నుండి 28-6-2018 వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :  ఈవారం మొత్తం మీద ముఖ్యమైన పనులను పెద్దలతో కలిసి చేపట్టుటకు అవకాశం ఉంది. గతంలో మొదలు పెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో ఆశించిన మేర నూతన పెట్టుబడులు లభిస్తాయి. నూతన ఉద్యోగప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విదేశాల్లో లేక దూర ప్రదేశంలో ఉన్న బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది.

 

 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తం మీద మిత్రులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. రావల్సిన ధనం అవసరానికి చేతికి అందుతాయి. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీ మాటతీరు పెద్దలకు నచ్చుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలకు ఆస్కారం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో మీరు తీసుకొనే నిర్ణయాలు కొంతమందికి నచ్చక పోవచ్చును. చర్చలకు అవకాశం ఇవ్వకండి.

 



మిథున రాశి : ఈవారం మొత్తం మీద సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చేపట్టిన పనుల విషయాల్లో స్పష్టత ఉండుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వడం సూచన. అధికారులతో చర్చలకు అవకాశం ఉంది, వారై అభిప్రయాలకు గౌరవం ఇవ్వడం మంచిది. అనుకోకుండా దూరప్రదేశ ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది, ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.

 

 

కర్కాటక రాశి :  ఈవారం మొత్తం మీద సొంత పనులకు అలాగే ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుటకు కాస్త శ్రమించాల్సి వస్తుంది, తోటివారి సహకారంతో ముందుకు వెళ్ళుట వలన తప్పక మేలుజరుగుతుంది. కుటుంబ పరమైన విషయాల్లో పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది, స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన ముందుకు సాగుతుంది. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. సమయానికి భోజనం చేయుట సూచన.

 

 

 సింహ రాశి :  ఈవారం మొత్తం మీద స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఆత్మేయుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ముందుగా గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. మిత్రులతో కలిసి వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంది. రావాల్సిన ఆర్థికపరమైన సహకారం కొంతమేరె అందుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను నష్టపోయే అవకాశం ఉంది, కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యమైన ఆలోచనల్లో మొహమాటం వద్దు, ఇబ్బంది తప్పదు.

 

 

కన్యా రాశి :ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో బాగాఉంటుంది, నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. నూతన ఉద్యోగప్రయత్నాలు చేయువారికి అవకాశాలు పెరుగుతాయి. నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. మీ మాటతీరులో పూర్తిగా స్పష్టత ఉండకపోవచ్చును, నిర్ణయం తీసుకోవడంలో తడబాటు పొందుతారు. కుటుంబంలో పెద్దలతో కలిసి సమయాన్ని గడుపుతారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. కోర్టుపరమైన విషయాల్లో విజయాన్ని పొందుతారు. కొన్ని విషయాల్లో ఫలితాలు వస్తాయి.

 

 

తులా రాశి : ఈ వారం మొత్తం మీద మిత్రులతో కలిసి చర్చలు చేయుటకు అలాగే నూతన పనులను మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయంలో బాగాఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకోవడంలో తడబాటు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో విభేదాలు పెరుగుటకు అవకాశం ఉంది. సోదరులతో చేపట్టిన చర్చలు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. సంతానం వలన పెద్దలనుండి గుర్తింపును పొందుటకు ఆస్కారం కలదు.

 

 

వృశ్చిక రాశి :  ఈవారం మొత్తం మీద ఆరంభంలో చిన్న చిన్న సమస్యలు వచ్చుటకు ఆస్కారం ఉంది, అత్యుత్సాహం తగ్గించుకొనుట వలన మేలుజరుగుతుంది. నూతన ప్రయత్నాల కన్నా గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలి పొందుతారు. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. బద్ధకం వీడడం వలన తప్పక లబ్దిని పొందుతారు. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు పెరుగుటకు అవకాశం ఉంది, జాగ్రత్త. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, సర్దుబాటు విధానం ఉత్తమం. నిదానం అవసరం.

 

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తం మీద బంధువులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేసేలా ప్రణాలిక కలిగి ఉండుట మంచిది. మీ మాటతీరు మూలన కొంతమంది ఇబ్బందికి గురయ్యే ఆస్కారం ఉంది. చర్చల్లో సర్దుబాటు మంచిది. సంతాన పరమైన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం ఉంది , అనుకోకుండా విభేదాలు తోటివారితో ఏర్పడే ఆస్కారం ఉంది, కాస్త జాగ్రత్త అవసరం. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన కలిగి ఉంటారు. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.

 

మకర రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. బంధువుల గృహం సందర్శన చేయుటకు అవకాశం ఉంది, వారితో సమయాన్ని సరదాగా గడుపుతారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. కుటుంబ పరమైన విషయాల్లో పెద్దల సూచనల మేర ముందుకు వెళ్లుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. పెట్టుబడుల విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

 

 

కుంభ రాశి : ఈవారం మొత్తం మీద దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు ఇబ్బందిని పొందుటకు ఆస్కారం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో జీవితభాగస్వామి నుండి విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది. సర్దుబాటు విధానం కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. సంతాన పరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ఆత్మీయుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. అధికారులతో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది, వారితో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం ఉంది.

 

 

మీన రాశి : ఈవారం మొత్తం మీద చేపట్టు ప్రతివిషయాల్లో నిదానంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళుట మంచిది. వ్యాపారపరమైన విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. కుటుంబపరమైన విషయాలలో ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతానపరమైన విషయాల్లో సమాజంలో గుర్తింపును పొందుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది, తగ్గించుకొనే ప్రయత్నం చేయుట సూచన. మిత్రులతో సమయం గడుపుతారు.

మరిన్ని శీర్షికలు
chamatkaram