Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రతాప వెంకట సుబ్బారాయుడు

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue284/746/telugu-serials/katyayani/katyayani/

(గత సంచిక తరువాయి)...  మొదటి సమాగమానికి హడావుడి పడకుండా నేర్పుగా, ఓర్పుగా వ్యవహరిస్తే వందేళ్ల సంసార జీవితానికి పటిష్టమైన పునాది పడుతుందని.

"కాత్యాయనీ నిజానికి నువ్వు స్వర్గంలో ఉండాల్సిన దేవ కాంతవు. నిన్ను చూసింది మొదలు నిన్ను పొంద గలనో లేదో అన్న భయం నన్ను వెంటాడింది. నీ అందం సంపూర్ణ వికసిత పుష్పమైతే, సౌశీల్యం తావి.

నేను అన కూడదు కాని నువ్వు అమెరికా సంబంధానికే తగిన దానివి, ఎందుకంటే, నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకో గల ఐశ్వర్యం వారికుంటుంది. స్వర్గంలో ఉండాల్సిన దానివి భూమి మీదకు వచ్చావు, మళ్లీ స్వర్గానికి వెళ్ల లేవు కదా ! అది నాకు దక్కిన వరం. హృదయ పూర్వకంగా చెబుతున్నాను- నేను ఏ జన్మలోనో భగవంతుడి చరణాల మీద అత్యంత భక్తి ప్రపత్తులతో రెండు పుష్పాలు వేసుంటాను. దాని ప్రతి ఫలమే నువ్వు నాకు దక్కడం. ఈ స్పృహ నా జీవితాంతం కలిగి ఉంటాను.

మధ్య తరగతి వాణ్ని గనక నిన్ను గొప్పగా చూసుకో లేక పోవచ్చు, కాని అపురూపంగా, జాగ్రత్తగా చూసుకుంటాను.

ప్రమాణం చేస్తున్నాను. నువ్వూ మాట్లాడు కాత్యాయని" అన్నాడు ఆమె చుబుకం ఎత్తి.

తనను ఎదురుగా పెట్టుకుని పొగడడం ఆమెను కొద్ది క్షణాల పాటు అత్తిపత్తిని చేసింది. తేరుకుని- "మనకు సమాజంలో ఆడ పిల్లలు తండ్రి నిరాదరణకు గురవడం తెలుసు. కానీ ఆడపిల్లే తనకు తను మానసికంగా కుంగి పోవడం ఈ పెళ్లిల్ల వల్ల జరుగుతుంది. మగ పెళ్లి వారి కట్న దాహం, కానుకల లిస్ట్, గొంతెమ్మ కోరికలు ఆమె తండ్రిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే, ‘అందుకే తన తండ్రి తను పుట్టంగానే అంతలా అల్లల్లాడి పోయాడు, అలా చూశాడు అన్న తలంపు’ కలుగుతుంది.

డబ్బు ఎన్నటికీ ప్రధానం కాదండి. మనసు ముఖ్యం. పెళ్లయ్యాక  ’బరువును వదిలించుకున్నా’నన్న రిలీఫ్ ను మా నాన్న ముఖంలో చూడలేదు. దానికి కారణం మీరు. ఈ రోజు నుంచి మనసా వాచా మీకే అంకితం. మా అమ్మ అంటుండేది ’ఆడ పిల్లకు మనసును అంటి పెట్టుకునే వాడు దొరకడం అదృష్టమని..అది పెళ్లి చూపుల్లోనే తెలిసింది" అంది.

 

రాత్రి పన్నెండయింది.

 

అక్కడక్కడా వెహికిల్స్ వెళుతున్న శబ్దం తప్ప అంతా నిశ్శబ్దం లోకి జారుకుంటోంది. గాలిలో చల్లదనం పెరిగింది. అర్ధ రాత్రికి పరిపూర్ణంగా విచ్చుకున్న పుష్పాలు సువాసనల్ని గాలి పొరలపై పేరుస్తున్నట్టున్నాయి, అక్కడి వాతావరణం సుగంధ భరితమైంది.

మనసు లోని మదనుడు కమలాకర్ ను, రతీ దేవి కాత్యాయనిని అల్లరి చేస్తున్నాయి. ఇంత వరకూ వాళ్లు అనుభూతించని అవ్యక్తమైనవేవేవో మనసు లోనూ, శరీరం లోనూ కలుగుతున్నాయి. జరుగుతున్నాయి.

అయస్కాంతం లోని ఉత్తర దక్షిణ ధృవాలు లటుక్కున కలవడానికి తొందర పడుతున్నట్టు, కలయిక కోసం వాళ్ల శరీరాలు ఉబలాట పడుతున్నాయి.

"చలి పెరుగుతోంది లోపలికి వెళదామా?"అన్నాడు కమలాకర్.

"ఊఁ.."అంది సిగ్గుతో!

ఆమె దగ్గరకి వెళ్లి రెండు చేతులతో పొదివి పట్టుకుని గది వైపుగా తీసుకెళ్ళాడు. 
బయట నుంచి వేసున్న గడె తీశాడు.

లోపలి నుంచి సవాసన భరితమైన చల్లని గాలి ఇరువురినీ సోకింది.

ఇద్దరి శరీరాలపై ఉన్న నూగారు చైతన్య వంతమైంది.

లోపలికి అడుగు పెట్టారు.

ఎదురుగా పెద్ద వికసించిన తామర దాని చుట్టూ రక రకాల పూలు అమర్చి ఉన్నాయి. మంచమూ గులాబులతో,

తెల్ల చామంతులతో ముస్తాబై ఉంది. గోడల మీద అక్కడక్కడా శృంగార భావాలను ఉద్దీపింప జేస్తూ

వాత్సాయన కామ సూత్రాల కేలండర్లు.

ఆమెని మంచం మీద కూర్చో బెట్టి, తను వెళ్లి తలుపుకి గడె వేసి వచ్చాడు.

మంచం పక్కనే టీ పాయ్, దానిపై ఇత్తడి పల్లెంలో రక రకాల పళ్లు, రెండు గ్లాసుల పాలు.

పక్కన ఒక అందమైన లేత గులాబీ రంగు ఉత్తరం. తీసి చదివాడు.

డియర్ కొత్త దంపతులూ!

మీ ఇద్దరి జీవితల్లోనూ ఈ రాత్రి ప్రత్యేకం. ఇది మీ మనసులో ఎంతలా ముద్రించుకు పోతే మీ వైవాహిక బంధం అంత సుదృఢ మవుతుంది.

ఈ రాత్రికి ఓ ప్రత్యేకతను అందిస్తూ కలిసిపోండి, కరిగిపోండి.

మీ రాజారావంకుల్.

ఆమె వంక చూశాడు.  కిటికీ లోంచి జాలు వారుతున్న వెన్నెల, మంచం మీద కూచున్న

ఆమె మీద పడి పాల రాతితో తీర్చిదిద్దిన అప్సరసలా భాసిస్తోంది. మంచం మీద కూర్చుని ఆమెని తన వైపుగా తిప్పుకున్నాడు.

ఆమె ముఖాన్ని దగ్గరకు తీసుకుని ఆమె ఎర్రని పెదాలపై గాఢ చుంబనాన్ని ముద్రించాడు.

"ముద్దు తియ్యగా ఉంటుందని చదివి, దానికి తియ్యని రుచి ఎలా వస్తుందని అనుకునే వాణ్ని? ఇప్పుడర్థమైంది.

తియ్యదనానికి పై మాట తెలియక మన వాళ్లు అక్కడితో వదిలేశారని." ఆమె చెవిలో గుస గుసగా అన్నాడు.

అతని పెదవుల కదలికలు ఆమె నాజుకైన చెవులకు తాకి గిలిగింతలు రేపాయి. ఒళ్లంతా పువ్వై విచ్చుకుంటోంది.

సుగంధాలు వెదజల్లుతోంది. అతను ఆమె పాదాల వేళ్ల నుంచి ప్రారంభించి చూపుడు వేలితో స్పృశిస్తూ,

అలా..అలా పైకి వస్తూ పలుచని నడుముని దాటి ఎత్తైన పర్వతాల పై కి చేరబోతుంటే ఆమె పరవశంతో వివశురాలైంది.

అతను కళ్లెం విడిచిన గుర్రం అయ్యాడు.

మధు పాత్ర ఒలికింది.

ఇద్దరూ తాగినంత తాగారు. మళ్లీ..మళ్లీ తాగారు. ఆద మరిచి ఒకరి నొకరు అల్లుకు పోయి,

సొమ్మ సిల్లి పోయినట్టు పడుకుండి పోయారు.

***      


తొలి రాత్రి మధురంగా....మధురాతి మధురంగా ఆస్వాదించిన

ఆ నవ దంపతుల పెళ్ళి పుస్తకం లో తర్వాత పేజీల్లో ఏ అధ్యాయాలు రాబోతున్నాయి.....

అవి వారి జీవితాలని ఎలాంటి మలుపులు తిప్పబోతున్నాయి....తెలుసుకోవాలంటే...


వచ్చే శుక్రవారం ఒంటి గంట దాకా వేచి చూడాల్సిందే.....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana