Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Is it cold ? Kill it!

ఈ సంచికలో >> యువతరం >>

కుర్రోళ్లోయ్‌ కుర్రాళ్లూ.. ప్రేమకు దూరమయ్యారూ.!

Away from love.

ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఓ ఇంట్రెస్టింగ్‌ విషయమొకటి బయటపడింది. ఈ మధ్య యంగ్‌స్టర్స్‌ ఎక్కువగా ప్రేమకు దూరంగా జరిగిపోతున్నారట. 'బాబోయ్‌ మాకొద్దీ ప్రేమ..' అంటున్నారట. ఇండియాలో జరిగిన లేటెస్ట్‌ సర్వేలో ఈ విషయం తేలింది. లవ్‌ పట్ల కుర్రాళ్లకు ఆశక్తి తగ్గిపోయిందట. ఒకప్పుడు అంటే రెండు దశాబ్థాల నుండీ కుర్రోళ్లు మూతి మీద మీసం మొలవక ముందే ప్రేమా, దోమా అంటూ తిరిగేవారు. ఆ టైంలో పేరెంట్స్‌ మాటలు కానీ, టీచర్స్‌ మాటలు కానీ ఒంట పట్టించుకునే వారు. అదే లోకం అంటూ తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు యూజ్‌ చేయాల్సిన కాలాన్ని ప్రేమ పేరుతో కాని వయసులో దుర్వినియోగం చేసుకునేవారు. కానీ ఇప్పుడు కుర్రాళ్లలో చాలా మార్పులు వచ్చాయట. ప్రేమకు దూరమై కెరీర్‌పై దృష్టి పెడుతున్నారట. కెరీర్‌ గురించి యావ అబ్బాయిలకు బాగా ఎక్కువైందట.

అయితే అబ్బాయిలు తమ ఆలోచనను ఇంతగా మార్చుకోవడానికి కారణమేంటంటే.. అందుకూ ఓ బలమైన కారణం ఉందంటున్నారు సర్వే నిపుణులు. ఈ మధ్య ప్రేమకథలన్నీ విషాద గాథలుగానే ముగుస్తుండడం చూస్తున్నాం. అంతేకాదు, ఇప్పటి ప్రేమకథలో నిజాయితీ కూడా లోపిస్తోంది. ఇదివరకటిలా లవర్స్‌ ఒక కమిట్‌మెంట్‌కి కనెక్ట్‌ అయ్యి ఉండడం లేదు. అవసరాలతో ప్రేమను ముడిపెడుతుండడం, ఆ అవసరం తీరాక ఆ ప్రేమను మర్చిపోతుండడం చేస్తున్నారు. ఈ రకమైన పరిణామాలకు ఎక్కువగా బలవుతున్నది అబ్బాయిలేనట. దాంతో ఎందుకొచ్చిన ప్రేమరా బాబూ అనవసరంగా టైం వేస్ట్‌ చేసుకోవడం అన్న భావనకు అబ్బాయిలు వచ్చేసినట్లు తెలుస్తోంది. దాంతో యువకులకు ప్రేమ పట్ల ఆశక్తి సన్నగిల్లిపోయిందట.

ఇక అమ్మాయిల విషయానికి వస్తే, అమ్మాయిల్లో ఈ సమస్య లేదంటున్నారు సర్వే శాస్త్రవేత్తలు. అమ్మాయిల్లో ప్రేమ పట్ల ఆశక్తి అబ్బాయిలతో పోల్చితే ఎక్కువైందట. గత పరిస్థితులతో పోల్చితే అమ్మాయిలకు కట్టుబాట్ల నుండి కాస్త విముక్తి లభించింది. దాంతో ప్రేమ పట్ల గతంలో ఉండే భయాలు తొలిగిపోయాయి. ఆ కారణంగా అమ్మాయిలు ఈజీగా లవ్‌ ప్రొపోజల్స్‌ని యాక్‌సెప్ట్‌ చేస్తున్నారు. వారే ముందు ప్రొపోజల్‌కి దిగుతున్నారనీ సర్వే తెలుపుతోంది. అలాగే లవ్‌ కారణంగా అమ్మాయిలు తమ కెరీర్‌ని ఎంత మాత్రమూ డిస్ట్రబ్‌ చేసుకోవడం లేదట. కానీ అబ్బాయిలు మాత్రం లవ్‌లో పడి, కెరీర్‌ని గాలికొదిలేస్తుండడంతో పాటు, రెండు రకాలా నష్టపోతున్నారు. ఒకవేళ లవ్‌ ఫెయిల్యూర్‌ అయ్యి జీవితం నాశనమైతే, ప్రాణాలే కోల్పోతే ఇటు భవిష్యత్తుకీ, అటు లవ్‌కీ రెండింటికీ కాకుండా పోతున్నారన్న మాట. దాంతో అబ్బాయిలు లవ్‌ పట్ల జర జాగ్రత్త పడిపోతున్నారట సుమీ.!

మరిన్ని యువతరం